For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: సామ్రాట్‌ను పెళ్లి చేసుకోమన్న పరందామయ్య.. ఆయనకు తులసి ప్రామిస్

  |

  దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రెస్‌మీట్ తన భార్య గురించి అడిగితే సామ్రాట్ ఏమీ చెప్పకపోవడంతో కలకలం రేగుతుంది. ఆ తర్వాత హనీ తన తల్లి గురించి సామ్రాట్‌ను ప్రశ్నిస్తుంది. కానీ, అతడు సమాధానం చెప్పడు. అనంతరం అభిని నందూ, లాస్య రెచ్చగొడతారు. దీంతో తర్వాతి రోజు ఉదయాన్నే అతడు సామ్రాట్‌ భార్య గురించి చెప్పమంటూ కుటుంబ సభ్యులు అందరి ముందే పెద్ద గొడవ చెస్తాడు. దీంతో సామ్రాట్ బాబాయి అసలు హనీ అతడి కూతురు కాదని, చెల్లెలి కూతురు అని అంటాడు. దీంతో అందరూ షాక్‌కు గురవుతారు.

  Indira Devi: మహేశ్ తల్లి గురించి సంచలన నిజాలు.. కృష్ణ రెండో పెళ్లి తర్వాత ఆమె ఏం చేశారో తెలిస్తే!

  అసలు నిజం చెప్పేసిన బాబాయి

  అసలు నిజం చెప్పేసిన బాబాయి

  హనీ సామ్రాట్ కూతురు కాదని చెప్పిన బాబాయి.. 'ఈ నిజం ప్రాణాలు పోయేంతవరకు తనలోనే దాచుకోవాలని అనుకున్నాడు. అందుకే ఎవరు ఎంత రెచ్చగొట్టినా.. తనలోనే దాచుకున్నాడు. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఆమాట మీవాడికి చెప్పు' అని అంటాడు. ఆ తర్వాత సామ్రాట్ చెల్లెలి గురించి చెబుతూ.. 'సామ్రాట్‌కు చెల్లెలు అంటే చాలా ప్రాణం. వాడి అమ్మానాన్న చిన్నప్పుడే పోయారు. చిన్నప్పటి నుంచి చెల్లెలు అంటే సామ్రాట్‌కు ప్రాణం. అన్నీ తానై చెల్లెలును గుండెల మీద పెట్టుకొని పెంచాడు. సునంద పెరిగి పెద్దదయింది' అని చెప్పుకొచ్చాడు.

  ప్రేమ పెళ్లి... బావకు కానుకలిచ్చి

  ప్రేమ పెళ్లి... బావకు కానుకలిచ్చి

  ఆ తర్వాత సామ్రాట్ బాబాయి మాట్లాడుతూ.. 'సునంద అన్న సామ్రాట్ కనుసన్నల్లో తిరుగుతుండేది. కానీ, ప్రేమ విషయంలో మాత్రం ఆన్న కళ్లు కప్పింది. సామ్రాట్ కంపెనీలో పనిచేసే మేనేజర్ నిరంజన్‌ను తను ప్రేమించింది. చెల్లి ప్రేమ విషయం తెలుసుకొన్న సామ్రాట్ షాక్ అయ్యాడు. దీంతో నిరంజన్ క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ.. సునంద మాత్రం ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఇద్దరి పెళ్లి చేశాడు. సునంద భర్తకు క్యాష్ ఇవ్వడంతో పాటు ఆస్తిలో వాటా కూడా ఇచ్చాడు' అని తెలిపాడు.

  Bigg Boss Vote: 4వ వారం షాకింగ్ ఓటింగ్.. ఒక్క ఎపిసోడ్‌కే ఆమె సంచలనం.. ఆ జంటకు మాత్రం బిగ్ షాక్

  సునంద ఆత్మహత్య చేసుకుంది

  సునంద ఆత్మహత్య చేసుకుంది

  అనంతరం సామ్రాట్ బాబాయి 'సునందకు హనీ పుట్టింది. నిరంజన్ ఆస్తి మొత్తాన్ని తగులబెట్టి సునందను పుట్టింటి నుంచి డబ్బు తీసుకురా అనేవాడు. అంతేకాదు, తనను తరచూ కొట్టి పుట్టింటికి పంపించేవాడు. దీంతో అన్నయ్య మాట విననందుకు దేవుడు తగిన సాక్షి చేశాడని సునంద అనుకుంది. అప్పుడు హనీని సామ్రాట్ ఇంటి ముందు పడుకోబెట్టి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి సామ్రాట్ గుండె పగిలిపోయింది. ఆ నిరంజన్‌ను జైలుకు పంపించాడు. అప్పటి నుంచి హనీనే తన లోకంగా, తన కోసం బతుకుతున్నాడు' అని చెబుతాడు.

  సామ్రాట్‌ను పెళ్లి చేసుకోమంటూ

  సామ్రాట్‌ను పెళ్లి చేసుకోమంటూ

  నిజం తెలిసిన వెంటనే సామ్రాట్ 'అమ్మానాన్న లేరన్న నిజం హనీకి ఎప్పటికీ తెలియకూడదని నేను ప్రెస్ వాళ్ల ముందు మౌనంగా ఉన్నాను. ఐయామ్ సారీ తులసి గారు' అని అంటాడు. దీనికామె 'లేదు సామ్రాట్ గారు. మా వాడే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. వాడి తరుపున నన్ను క్షమించండి' అని అడుగుతుంది. అప్పుడతను 'నాకు అభి మీద కోపం లేదు. మీ మీద ప్రేమతో నేను మిమ్మల్ని మోసం చేస్తానని అనుమానించాడు అంతే' అంటాడు. అప్పుడు పరందామయ్య ఏమీ అనుకోకపోతే ఒక మాట అడగొచ్చా అంటూ పాప కోసం ఒంటరిగా బతికే బదులు పెళ్లి చేసుకుంటే హనీకి తల్లిని తీసుకొచ్చినట్టు ఉంటుంది కదా అంటాడు. అప్పుడు సామ్రాట్ 'భయంతో చేసుకోలేదు. తనను ఒక్కరోజు కూడా వదిలి ఉండలేను' అని చెప్తాడు.

  స్లీవ్‌లెస్ టాప్‌లో శివాత్మక రాజశేఖర్: మైండ్‌బ్లాక్ చేసే ఫోజులతో రచ్చ

  ప్రామిస్ చేయమని అడుగుతాడు

  ప్రామిస్ చేయమని అడుగుతాడు


  ఆ తర్వాత సామ్రాట్ 'నేను తనను వదిలి ఉండలేకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాను. దయచేసి మీరందరూ ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోండి. హనీకి ఎప్పటికీ ఈ నిజం తెలియకూడదు' అంటాడు. అప్పుడు తులసి 'మా అందరి తరుపున నేను మాటిస్తున్నాను.. ఈ నిజాన్ని మేము ఇక్కడే మరిచిపోతాం' అంటుంది. తర్వాత నందూ, లాస్య కూడా అదే చెబుతారు. అప్పుడు తులసి ఇక మేము వెళ్లొస్తామండి అని అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంటికి వెళ్లిన తర్వాత పరందామయ్య, తులసి ఇద్దరూ మాట్లాడుకుంటారు. అప్పుడు తులసి 'మనం తప్పు చేశాం మామయ్య. ఆయన సంతోషాన్ని మనం దూరం చేశాం. హనీ గతాన్ని ఇంకెప్పుడు సామ్రాట్ గారి ముందు తీసుకురావద్దు' అని పరందామయ్యతో అంటుంది.

  హనీ ఓదార్పు... నందూ, లాస్య

  హనీ ఓదార్పు... నందూ, లాస్య

  అందరూ వెళ్లిపోయిన తర్వాత సామ్రాట్ తన చెల్లెలు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో హనీ అక్కడికి వస్తుంది. సామ్రాట్ ఏడ్వడం చూస్తుంది. ఎందుకు నాన్నా ఏడుస్తున్నావు అని అడుగుతుంది. దీంతో అదేం లేదమ్మా అంటాడు. దీంతో ఆమెను హత్తుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. మరోవైపు, నందూ, లాస్య కూడా సామ్రాట్ గతం గురించి మాట్లాడుకుంటారు. అయితే, తాను కోరుకున్నట్లు గొడవ జరగకపోవడంతో లాస్య నిరాశగా ఉంటుంది. కానీ, ఎప్పటిలాగే నందూ మాత్రం చెడుగా ఆలోచించొద్దన్నట్లు మాట్లాడతాడు.

  జాకెట్ లేకుండా శిల్పా చక్రవర్తి: అప్పటి స్టార్ యాంకర్.. ఇప్పుడిలా చేసిందేంటి!

  టీవీలో స్టోరీ... మరోసారి గొడవ

  టీవీలో స్టోరీ... మరోసారి గొడవ

  తులసి, సామ్రాట్ గురించి టీవీ ఛానెల్‌లో ప్రత్యేక కథనం వస్తుంది. అందరూ వాళ్ల స్టోరీని చూస్తారు. అందులో 'తులసి, సామ్రాట్ ఇద్దరూ కలిసిపోవడంలో తప్పేం లేదు. కానీ, సామ్రాట్ గారు ఎందుకు ఓపెన్‌గా వాళ్ల రిలేషన్ గురించి మాట్లాడలేదు. తులసి గారు మాత్రమే ఎందుకు మాట్లాడారు. వీళ్ల రిలేషన్ షిప్ గురించి ఎప్పుడు అసలు నిజం బయటపడుతుందో వేచి చూడాలి. ఇదే ఈరోజు స్పెషల్ స్టోరీ' అని చెబుతారు. దీంతో అభికి కోపం వస్తుంది. ఆ వెంటనే 'మామ్.. ఏం జరుగుతుందో చూస్తున్నావు కదా. నేనెప్పుడు నుంచే ఇదే చెబుతున్నా. కానీ, వాళ్లెవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఒంటిరిని అయిపోతున్నా మామ్ బాధగా ఉంది' అని గొడవ పెడతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 749: Reporters Asks to Tulasi About Annoying Questions. Then She Fires on Them. After That Samrat Feels Emotional About her Sister.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X