Intinti Gruhalakshmi: దివ్యపై రాజ్యలక్ష్మి కుట్ర.. అడ్డంగా బుక్కైన బసవయ్య.. తులసికి హనీ అబద్దాలు

భారతదేశంలోని చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అటు విక్రమ్, ఇటు దివ్య తమ తప్పులను ఒప్పుకుని ఒక్కటైపోతారు. దీంతో సంతోషంగా వినాయక చవితి జరుపుకోవాలని తులసికి దివ్య ఫోన్ చేస్తుంది. కానీ, ఆమెకు అప్పటికే దెబ్బలు తగిలి ఉండడంతో మీ ఇంట్లో మీరే చేసుకోండి అని చెప్తుంది. ఇక, గాయపడి ఉన్న తులసికి నందూ సేవలు చేస్తుంటాడు. సామ్రాట్ ఇంట్లో హనీని రత్నప్రభ హింసిస్తూ ఉంటుంది. అలాగే, తను తినే వాటిపై కూడా రిస్టిక్షన్స్ పెడుతుంది. దీంతో సామ్రాట్ బాబాయి ఆమెను వేడుకుంటాడు. ఇక, తులసి కోసం నందూ ఫుడ్ తీసుకు వచ్చి తినమని బ్రతిమాలతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 29th 2023

తులసికి అబద్దం చెప్పిన హనీ:తులసి భోజనం చేస్తుండగా హనీ గుర్తు రావడంతో ఫోన్ చేస్తుంది. అంతలోనే సామ్రాట్ ఫొటో చూసుకుంటూ హనీ ఏడుస్తుంటుంది. తులసి కాల్ చూసిన హనీ జాగ్రత్తగా మాట్లాడతానని చెప్తుంది. కాల్ లిఫ్ట్ వేసిన వెంటనే తులసి 'దిగులుగా ఉంది హనీ.. నిన్ను చూడాలని అనిపిస్తుంది' అంటుంది. దీంతో హనీ ఏడుస్తుంది. తర్వాత హనీని తిన్నావా అని అడగ్గా అబద్ధం చెప్తుంది. అప్పుడు బాధ తట్టుకోలేక ఏడుస్తుంటే తులసి కంగారు పడుతూ ఏమైందని అడుగుతుంది. దీంతో హనీ మళ్లీ అబద్ధాలు చెబుతుంది. అప్పుడు తులసి నిజమే అని నమ్మి కాల్ కట్ చేసేస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 29th 2023

దివ్యపై రాజ్యలక్ష్మి కుట్రలతో:విక్రమ్ నుంచి దివ్యను దూరం చేయడంతో పాటు ఆమెకు నీలాపనిందలు పడాలని రాజ్యలక్ష్మి అనుకుంటుంది. ఆ వెంటనే ప్రసన్నను పిలిచి 'ఒక టబ్‌లో నీళ్ళు పోసి చంద్రుడు కనిపించేలా ఏర్పాటు చేసి అది దివ్య చూసేలా చెయ్. వినాయక పూజ చేయకుండా చందమామని చూస్తే నీలాపనిందలు పడేలా చేయవచ్చు. అలాగే, దివ్య చేతికి ఇచ్చిన డాక్యుమెంట్స్ మాయమయ్యేలా చేయాలి' అని ప్లాన్ చేస్తుంది. తర్వాత ప్రసన్న టబ్ పెట్టిన దగ్గర ఉన్న బట్టలు తీసుకురమ్మని రాజ్యలక్ష్మి దివ్యను పిలుస్తుంది. కానీ, దివ్య మాత్రం అటు వైపు చూడకుండా వచ్చేస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 29th 2023

బుక్కైన బసవ.. నందూ ప్లాన్:రాజ్యలక్ష్మి వేసిన ప్లాన్‌ బెడిసి కొడుతుంది. దీంతో ఆమె నిరాశ చెందడంతో పాటు రగిలిపోతూ ఉంటుంది. అంతలోనే అటుగా మందు తాగి వస్తున్న బసవయ్య.. టబ్ దగ్గరకు వచ్చి పట్టు కోల్పోతాడు. ఆ వెంటనే ముందుకు పడిపోయి టబ్‌లో నుంచి చందమామను చూస్తాడు. దీంతో ప్లాన్ నాశనం చేశాడని బసవయ్యను ప్రసన్న తిట్టుకుంటూ లోపలికి తీసుకుని వెళ్లిపోతుంది. మరోవైపు, తులసిని ఇంప్రెస్ చేయడం కోసం పండుగ పనులను నందూ దగ్గరుండి చేస్తుంటాడు. అలాగే, కంటిన్యూ చేయమని పరందామయ్య అతడికి మరిన్ని సలహాలను కూడా ఇస్తాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 29th 2023

అప్పుడే నిందలు మొదలు:ఉదయాన్నే నిద్ర లేచి వచ్చిన బసవయ్యను ప్రసన్న తిడుతుంది. కానీ, అతడికి ఆమె ఎందుకు తిడుతుందో అర్థం కాదు. కాసేపు అలాగే ఉన్న తర్వాత ఏమైందని అడుగుతాడు. అప్పుడు ప్రసన్న 'వద్దంటే వినకుండా చంద్రుడిని చూశావు. ఇక నుంచి నీలాపనిందలు పడతావు' అంటూ తిడుతుంది. అనంతరం దివ్య విక్రమ్‌కు నలుగు పెట్టడానికి మొత్తం సిద్ధం చేయగా తనకి వద్దని మారాం చేస్తాడు. కానీ దివ్య మాత్రం ఒప్పుకోదు. నువ్వుల నూనె కనిపించకపోయేసరికి దివ్య బసవయ్యను పిలిచి అడగ్గా.. అప్పుడే నిందలు మొదలయ్యాయని అనుకుంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 29th 2023

విక్రమ్ పక్కన జానూ ఉండి:షర్ట్ లేకుండా కూర్చుని ఉండడానికి విక్రమ్ సిగ్గుపడుతూ ఉంటాడు. అంతలోనే నూనె తీసుకొస్తానని చెప్పి దివ్య అతడి కళ్లకు గంతలు కట్టేసి వెళ్తుంది. అంతలోనే జాహ్నవి దొరికింది సందు అనుకుని వచ్చి విక్రమ్ వీపు రుద్దుతూ సరసాలు ఆడుతుంది. రాస్తుంది దివ్య అనుకుని విక్రమ్ నవ్వుతుంటాడు. దివ్య వచ్చి అది చూసి కోపంగా విక్రమ్ కళ్ళకి కట్టిన గంతలు విప్పేస్తుంది. జానూ పక్కన ఉండటం చూసి విక్రమ్ షాక్ అవుతాడు. అప్పుడు 'మా ఆయనకి నువ్వు నలుగు పెట్టడం ఏంటి' అని దివ్య ప్రశ్నించగా.. విక్రమ్ కూడా ఆమెపైనే సీరియస్ అవుతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 29th 2023

హద్దుల్లో ఉంటే మంచిదని:విక్రమ్, దివ్యలు జాహ్నవిపై సీరియస్ అవడంతో అక్కడే ఉన్న రాజ్యలక్ష్మి 'మరదలు కదా సరదాగా ఆట పట్టించింది. దానికే ఎందుకు అంత చేస్తున్నారు' అని అంటుంది. దీంతో దివ్యకు కోపం పెరిగిపోతుంది. ఆ వెంటనే 'పెళ్లి కావాల్సిన పిల్ల హద్దుల్లో ఉంటే మంచిది. పెద్దవాళ్లు అయి ఉండి మీరు కూడా తననే వెనకేసుకుని వస్తారా? దయచేసి ఇకనైనా ఇలాంటివి ఎంకరేజ్ చేయవద్దు' అని అత్తపై కోప్పడుతుంది. ఆ తర్వాత విక్రమ్‌కు నలుగు పెడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X