For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi September 2nd Episode: అక్షర సూసైడ్ డ్రామా.. వాళ్లను కలిపేందుకు తులసి ప్లాన్!

  |

  ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రేమ్‌ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అక్షర ప్లాన్ చేసుకుంటుంది. అందుకోసం తన తండ్రికి ప్రేమ్ గురించి చెప్పాలనుకుంటుంది. ప్రేమ్‌ను శృతికి ప్రపోజ్ చేయమని తులసి సలహా ఇస్తుంది. అతడు ధైర్యం చేయకపోయినా తల్లి ప్రోత్సహిస్తుంది. ఆ తర్వాత నందూ తన పరిస్థితికి కారణం తండ్రే అంటూ నిందిస్తాడు. నాశనం అవ్వాలని తిట్టడం వల్లే తన కంపెనీ దివాళా తీసిందని వాపోతాడు. దీంతో ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. ఆ తర్వాత తులసి నందూతో మాట్లాడుతూ ఇంట్లో ఆఫీస్ గొడవలు తీసుకు రావద్దని సలహాలు ఇస్తుంది.

  బ్రా కూడా లేకుండా రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా: అందాలు మొత్తం కనిపించేలా మరీ దారుణంగా!

  నందూను తీవ్రంగా హెచ్చరించిన తులసి

  నందూను తీవ్రంగా హెచ్చరించిన తులసి


  ఆఫీస్‌లో ఉన్న టెన్షన్స్ ఇంట్లో చూపించొద్దని నందూకు తులసి చెప్తుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. నందూతో మాట్లాడుతోన్న సమయంలో ఇంట్లో గొడవలకు కారణం కావొద్దని తులసి తీవ్రంగా హెచ్చరిస్తుంది. ఈ తర్వాత ‘మీరు అన్న మాటల వల్ల మామయ్య గారు ఎంత బాధ పడ్డారో తెలుసా' అని అతడిని ప్రశ్నిస్తుంది. అప్పుడు నందూ ‘ఆయన నన్ను శపించడం వల్లే నాకీ పరిస్థితి వచ్చింది' అంటాడు. అప్పుడు తులసి ‘మోయలేని వాడే మూట బరువుగా ఉందన్నాడట. అలా ఉంది మీరు చెబుతున్న తీరు' అంటూ మాజీ భర్తకు బదులిస్తుంది.

  లాస్య, నందూకు తులసి అదిరే ఆన్సర్స్

  లాస్య, నందూకు తులసి అదిరే ఆన్సర్స్

  తులసి అన్న మాటలు విన్న లాస్య ‘అంటే ఏంటి మేము ఆకాశానికి నిచ్చెన వేశాం అంటావా. మేమెందుకూ పనికి రాని వాళ్లమని అంటున్నావా' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు ‘ఆయన బాగుంటే ఇల్లు బాగుంటుంది. ఆయన మా పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు. కానీ, మా నాన్న ఓ స్థాయిలో ఉన్నారు అనుకోవాలి. మేము భార్యభర్తలుగా విడిపోయినా.. ఆయన నాశనాన్ని నేను.. నేను ఎదగకూడదని ఆయన ఎప్పుడూ కోరుకోము. మా మనసులో అంత దుర్భుద్ది ఎప్పుడూ చేరదు. కావాలంటే ఆయనను అడిగి తెలుసుకో' అంటూ ఇద్దరికీ ఒకేసారి ఆన్సర్స్ ఇస్తుంది.

  HBD Pawan Kalyan: పవన్ స్టార్ అవ్వడానికి ఆమె కారణం.. అలా చేసిన ఏకైక టాలీవుడ్ హీరోగా రికార్డ్

  పరందామయ్య బాధ.. అనసూయ ఢీలా

  పరందామయ్య బాధ.. అనసూయ ఢీలా


  నందూ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ పరందామయ్య తెగ బాధ పడుతుంటాడు. ఆ సమయంలో అనసూయ అక్కడకు వచ్చి ‘ఏంటంటి ఒంటరిగా కూర్చుని రాజ్యాంగాలు మార్చి రాస్తున్నారా. రండి పడుకోండి' అని అంటుంది. అప్పుడాయన ‘ఇంట్లో పరిస్థితులనే మార్చలేను. రాజ్యాంగం వరకూ ఎందుకు' అని అంటాడు. దీనికి ‘తులసి మారితే ఇల్లు మారుతుంది' అంటుంది. ఆ తర్వాత పరందామయ్య నందూ అన్న మాటలను ఆమెకు వివరించి ఒక్కసారిగా ఏడుస్తుంటాడు. దీంతో అనసూయ ఆయనకు ధైర్యం చెప్పి లోపలికి తీసుకుని వెళ్లిపోతుంది.

  ప్రేమలో ఉన్నా చెప్పుకోలేని శృతి, ప్రేమ్

  ప్రేమలో ఉన్నా చెప్పుకోలేని శృతి, ప్రేమ్

  చాలా కాలంగా ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నా అటు ప్రేమ్ కానీ.. ఇటు శృతి కానీ తమ ప్రేమను మాత్రం వ్యక్త పరుచుకోలేరు. ఇప్పుడు ఇంట్లో వాళ్లకు కూడా తమ బంధం గురించి తెలియడంతో ఇది హైలైట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ్ ఎలా ప్రపోజ్ చేయాలి అని తెగ ఆలోచిస్తుంటాడు. అంతలో శృతి ‘ప్రేమ్ నీ మీద ప్రేమ ఉన్నా చెప్పుకోలేని పరిస్థితి. చెబితే ఏమవుతుందో అర్థం కాదు. ఇక, ఈ జన్మకు నీకు సొంతం అవుతానన్న నమ్మకం కలగడం లేదు' అని తనలో తానే అనుకుంటూ తెగ బాధ పడుతూ ఉంటుంది. దీంతో ఓ లవ్ సాంగ్ ప్లే అవుతుంది.

  మహేశ్ బాబు అదిరిపోయే రికార్డ్: పవన్‌కు బిగ్ షాక్.. అగ్రస్థానంలో ప్రభాస్‌.. ఏ హీరో ర్యాంక్ ఎంతంటే!

  ప్రేమ్ కోసం చస్తా... తండ్రికి అక్షర షాక్

  ప్రేమ్ కోసం చస్తా... తండ్రికి అక్షర షాక్

  మరోవైపు, అక్షర ‘ప్రేమ్ ఇంకా ఎంత కాలం నాకు దూరంగా ఉంటావు. ఎప్పుడు నీ ప్రేమలో పొంగిపోవాలా అని ఏడాదిగా ఎదురు చూస్తున్నా. నిన్ను పెళ్లి చేసుకోవాలని, నీతో జీవితం పంచుకోవాలని చూస్తున్నా. నీకోసం ప్రపంచాన్నే ఎదురిస్తాను. నువ్వు నాకు దక్కకపోతే ప్రాణాన్ని సైతం వదిలేస్తాను' అని అనుకుంటుంది. తర్వాత ఆమె తండ్రి వచ్చి పుట్టినరోజుకు విష్ చేయబోగా.. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు యాక్టింగ్ చేస్తుంది. దీంతో ఆయన ఎంతగానో బాధ పడతాడు. తాను చేసిన పనికి తండ్రికి క్షమాపణలు చెబుతుంది అక్షర.

  ప్రేమ్ కావాలని తండ్రిని అడిగిన అక్షర

  ప్రేమ్ కావాలని తండ్రిని అడిగిన అక్షర

  పుట్టినరోజు సందర్భంగా అక్షర తండ్రి ఆమెను ఏం కావాలని అడుగుతాడు. అప్పుడామె ‘ఇన్ని రోజులూ మీరు ఇచ్చిన గిఫ్టులు వేరు.. ఇప్పుడు నేను అడగబోయే గిఫ్ట్ వేరు' అని అంటుంది. అందుకు అనుగుణంగానే ఆమె ప్రేమ్ ఫొటోను చూపిస్తుంది. అంతలో ఆయన ‘ప్రేమ్.. నువ్వు అతడిని ప్రేమిస్తున్నావ్.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావ్. నీకు నేనిచ్చే గిఫ్ట్‌లో మార్పు ఉండదు. ప్రేమ్ గురించి ముందే తెలుసుకున్నాను. నీ బర్త్‌డే గిఫ్టుగా ప్రేమ్‌ను తీసుకొచ్చి ఇస్తాను' అని అంటాడు. దీంతో అక్షర తండ్రిని హత్తుకుని ఆయనకు థ్యాంక్స్ చెబుతుంది.

  టాప్‌ తీసేసి హీరోయిన్ హాట్ సెల్ఫీ: పెళ్లైన తర్వాత కూడా అందాలు మొత్తం చూపించిందిగా!

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  శృతి, ప్రేమ్‌ను కలిపేందుకు తులిసి ప్లాన్

  శృతి, ప్రేమ్‌ను కలిపేందుకు తులిసి ప్లాన్

  ఇంట్లో పనేమీ చేయకుండా ఖాళీగా కూర్చున్న పని మనిషి రాములమ్మతో తులసి ‘ఏంటే.. ఇంకా ఏమీ చేయకుండా కూర్చున్నావ్? టిఫిన్ చేయాలి.. భోజనాలు వండాలి కదా' అని అంటుంది. అప్పుడామె ‘అదేంటమ్మా? ఇవన్నీ చేసేది శృతి అమ్మే కదా' అని అడుగుతుంది. అప్పుడు తులసి ‘శృతిని ప్రేమ్ గుడికి తీసుకెళ్తున్నాడు. అక్కడే తన ప్రేమను చెప్పబోతున్నాడు' అని బదులిస్తుంది. దీనికి రాములమ్మ ‘అంటే వాళ్లిద్దరూ ప్రేమను చెప్పుకుంటే వెంటనే పెళ్లి చేసేయడమే కదమ్మా' అని అంటుంది. అప్పుడు ‘వాళ్లు ఆ మాట చెప్పాలే కానీ, నాకంటే సంతోషించే వాళ్లే ఉండరు' అని తులసి చెబుతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 414: Akshara Told her Love to Father. Parandamayya Feeling Sad about Nandhu Comments. After That Prem and Shruthi Ready to Go Temple.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X