twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: తులసిపై నందూ, లాస్య మరో ప్లాన్.. అంకిత ఎంట్రీతో అభికి బిగ్ షాక్

    |

    దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి ఇంటికి వచ్చిన నందూ, లాస్య.. ఆమె కావాలనే అలా చేసిందని ఆరోపిస్తారు. అంతేకాదు, దీపక్‌ను ప్లాన్ ప్రకారమే తనపైకి రెచ్చగొట్టిందని నందూ ఆరోపిస్తాడు. అప్పుడు తులసి ఎంత చెప్పినా వాళ్లు మాత్రం అస్సలు వినరు. దీంతో తులసి.. నందూ, లాస్యకు ధీటుగా సమాధానం చెబుతూ షాకిస్తుంది.

    అప్పుడు ఇంట్లో వాళ్లందరూ ఆమెకు చప్పట్లు కొట్టి అభినందిస్తారు. ఇక, సామ్రాట్.. తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో పాపం ఆమెకు ఏమౌతుందా అని తన బాబాయి ముందు బాధను వ్యక్తం చేస్తాడు.

    ఫస్ట్ డే ఫస్ట్ షో ట్విట్టర్ రివ్యూ: సినిమాకు షాకింగ్ టాక్.. ఏది ప్లస్ అవ్వాలో అదే మైనస్‌గా!ఫస్ట్ డే ఫస్ట్ షో ట్విట్టర్ రివ్యూ: సినిమాకు షాకింగ్ టాక్.. ఏది ప్లస్ అవ్వాలో అదే మైనస్‌గా!

    నందూ ముందు నిజం దాచిన లాస్య

    నందూ ముందు నిజం దాచిన లాస్య

    తులసి తనకు ధీటుగా బదులివ్వడంతో నందూ రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన అతడు లాస్యతో 'అసలు తులసి విషయంలో ఏం జరిగినా నా మీద ఎందుకు రుద్దుతున్నారు. నా వైపు ఎందుకు చూస్తున్నారు. తులసితో నాకు ఎఫ్పుడో విడాకులు అయ్యాయి. అయినా ఇంకా నేను తులసి గురించి ఎందుకు ఆలోచించాలి. తులసి విషయంలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇక నుంచి నేను తులసి విషయంలో కలుగజేసుకోను' అంటాడు. దీంతో లాస్య 'అసలు అభిని రెచ్చగొట్టింది నేనే అని నందూు తెలిస్తే నన్ను ఏం చేస్తాడో' అనుకుంటుంది.

    వాళ్లను కూడా వదిలేయమన్న లాస్య

    వాళ్లను కూడా వదిలేయమన్న లాస్య

    నందూ మాటలకు లాస్య 'నువ్వు తులసి విషయంలో పట్టించుకోకుండా ఉండాలంటే మీ అమ్మానాన్నలను కూడా వదిలేయాలి. అలా చేస్తావా మరి' అని ప్రశ్నిస్తుంది. దీంతో నందూ 'నో అలా ఎలా కుదురుతుంది. మా అమ్మానాన్నను ఎలా వదిలేస్తాను' అంటాడు. దీంతో లాస్య 'కదా.. అందుకే నువ్వు తులసి విషయంలోనూ పట్టించుకోకుండా ఉండలేవు' అంటుంది. అంతేకాదు, 'మనం సామ్రాట్ కంపెనీలో తిరిగి జాయిన్ అవుదాం.

    అలా అయితేనే వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుందో మనం చూడగలం. తులసి బండారం తెలుసుకోగలం' అంటుంది. అప్పుడు నందూ 'అంటే ఇప్పుడు వెళ్లి సామ్రాట్ కాళ్లు పట్టుకోమంటావా' అంటాడు. దీనికి లాస్య అలా ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక పని చెయ్ అని ఏదో ప్లాన్ చెబుతుంది.

    రంగరంగ వైభవంగా ట్విట్టర్ రివ్యూ: వైష్ణవ్ తేజ్ మూవీకి ఊహించని టాక్.. అసలైందే మిస్ అవడమే మైనస్రంగరంగ వైభవంగా ట్విట్టర్ రివ్యూ: వైష్ణవ్ తేజ్ మూవీకి ఊహించని టాక్.. అసలైందే మిస్ అవడమే మైనస్

    జరగకుండా ఉంటే బాగుండేదంటూ

    జరగకుండా ఉంటే బాగుండేదంటూ

    ఇక, ఇంట్లో జరిగిన గొడవల తర్వాత పరందామయ్య, అనసూయ మాట్లాడుతుంటారు. అప్పుడు అనసూయ మన ఇంటి పరిస్థితి ఏంటి.. ఇప్పుడు ఏం చేయాలి అని భర్తను అడుగుతుంది. ఇంతలో తులసి వస్తుంది. దీంతో పరందామయ్య భార్యతో నీ డౌట్స్ ఏంటో నువ్వే అడుగు అంటాడు. అప్పుడు తులసి 'అత్తయ్య మనం రాసే కథ అయితే ఎలాగైనా రాసుకోవచ్చు. ముగింపు మన చేతుల్లో ఉంటుంది. కానీ, మన జీవితాలు దేవుడు రాస్తున్న కథలు. అంతా ఆయన ఇష్టం. మనం కేవలం నిమిత్తమాత్రులం. కథలో పాత్రలం మాత్రమే. జరిగిన గొడవ తలుచుకుంటే నాకూ బాధగానే ఉంది. అలా జరగకుండా ఉంటే బాగుండు అని అనిపించింది కానీ జరిగిపోయింది' అంటుంది.

    ఆ నిజం దాయడమే నా తప్పు అని

    ఆ నిజం దాయడమే నా తప్పు అని

    తులసి మాటలకు అనసూయ 'జరిగిపోయిన దాని గురించి కాదమ్మా నా ఆరాటం. ఇక నుంచి నువ్వు ఏం చేయబోతున్నావు' అని అడుగుతుంది. దీంతో తులసి 'చేసిన తప్పుకు శిక్ష అనుభవించబోతున్నా. నా దృష్టిలో నమ్మకం కోల్పోవడం అంటే ప్రాణాలు కోల్పోవడం. సామ్రాట్ గారు నమ్మింది తులసిని కాదు.. తులసి నిజాయితీని, మంచితనాన్ని. మీ అబ్బాయి నా మాజీ భర్త అనే నిజాన్ని సామ్రాట్ గారి దగ్గర దాచి పెద్ద తప్పు చేశాను. నిజం తెలియగానే సామ్రాట్ గారు నా వైపు చూసిన చూపు చాలు. ఆయన దృష్టిలో నేను ఎంతగా పడిపోయానో అని తెలియడానికి. నేను స్వేచ్ఛగా ఎదగడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు కాబోలు' అని అంటుంది. అప్పుడు పరందామయ్య నిజం ఏంటో.. తప్పేంటో నువ్వు వెళ్లి సామ్రాట్ కు చెప్పు అంటాడు.

    HBD Pawan Kalyan: పవన్‌కు అన్ని కోట్ల ఆస్తులు.. ఇండియాలోనే ఇదో రికార్డు.. ఆమె వల్లే సినిమాల్లోకి!HBD Pawan Kalyan: పవన్‌కు అన్ని కోట్ల ఆస్తులు.. ఇండియాలోనే ఇదో రికార్డు.. ఆమె వల్లే సినిమాల్లోకి!

    అభి ఎంట్రీ... షాక్ ఇచ్చిన అంకిత

    అభి ఎంట్రీ... షాక్ ఇచ్చిన అంకిత

    తులసి మాట్లాడుతోన్న మాటలు విన్న అభి అక్కడకు వచ్చి 'నువ్వు అలా చేస్తే దాన్ని స్వార్థం అంటారు అంటాడు. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు.. నేను బాగుంటే చాలు అనుకోవడం స్వార్థమే అవుతుంది తాతయ్య' అంటాడు. ఇంతలో అంకిత వచ్చి చప్పట్లు కొడుతుంది. అంకితను చూసి అభి షాక్ అవుతాడు. అప్పుడామె 'స్వార్థం గురించి డెఫినేషన్ నువ్వు బాగా చెప్పావు. కానీ.. నువ్వు ఆంటిని వేలెత్తి చూపించడమే అసహ్యంగా ఉంది. తన గురించి ఆలోచించుకోకుండా తన జీవితాన్ని మనందరి కోసం త్యాగం చేసింది. కానీ.. ఆంటి దాన్ని త్యాగం అనుకోలేదు. బాధ్యత అనుకుంది' అంటూ అభికి ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతుంది.

    నందూకు రిక్వెస్ట్ చేసిన అనసూయ

    నందూకు రిక్వెస్ట్ చేసిన అనసూయ

    తులసి బాధను చూసిన అనసూయ వెంటనే తన కొడుకు నందూకు ఫోన్ చేస్తుంది. దీంతో ఎందుకు కాల్ చేశావమ్మా అని అడుగుతాడు. అప్పుడామె 'ఈ అమ్మ మీద అమ్మ మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఒక పని చేయాలి. నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకోవాలి. తులసి మాజీ భర్తవి అన్న నిజం సామ్రాట్ నుంచి దాచమని తులసిని బతిమిలాడుకున్నది నువ్వు. ఆవేశంలో ఆ నిజాన్ని సామ్రాట్ ముందు బయటపెట్టుకున్నది నువ్వు. నువ్వు చేసిన పొరపాటుకు తులసి ఆయన ముందు దోషిగా తలదించుకోవాల్సి వస్తోంది. వెంటనే సామ్రాట్ దగ్గరికి వెళ్లి ఆ నిజాన్ని దాచాలని చెప్పింది నేనే అని చెప్పు' అని అడుగుతుంది. దీనికతడు 'నేను ఇప్పుడు వెళ్లి సామ్రాట్ ముందు దోషిగా నిలబడాలని అనుకోవడం లేదు' అంటాడు.

    ఆ సీరియల్ నటితో ప్రేమలో పడ్డ హైపర్ ఆది: ఆ షోలో బయటపెట్టిన కమెడియన్ఆ సీరియల్ నటితో ప్రేమలో పడ్డ హైపర్ ఆది: ఆ షోలో బయటపెట్టిన కమెడియన్

    అభి ముందు అంకిత కొత్త డిమాండ్

    అభి ముందు అంకిత కొత్త డిమాండ్

    అభిపై అంకిత సీరియస్ అవుతుంది. 'ఆంటీ నిన్ను ఎన్నిసార్లు కాపాడిందో తెలుసు కదా. నువ్వు కానీ.. నేను కానీ ఆంటీని పోషించడం లేదు. ఆంటి ఏం చేయాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఆంటీ మీద పర్సనల్ అటాక్ చేశావు కాబట్టే నీ గురించి మాట్లాడాల్సి వస్తోంది. అయినా ఇంటి పరువు బయట పెట్టింది నువ్వు. అలాంటి సమయంలో ఆంటీనే నిన్ను కాపాడింది. అయినా నువ్వు తల్లినే అనుమానిస్తున్నావు. రేపు నన్ను కూడా అనుమానించవన్న గ్యారెంటీ ఏంటి? ఇప్పుడు నువ్వు అంకుల్‌కు నచ్చజెప్పు. అంకుల్ కోరిక వల్లే ఆంటీ సామ్రాట్‌ గారి ముందు నిజం దాచిందని చెప్పాలి' అని డిమాండ్ చేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 727: Anasuya Makes a Request to Nandhu. But He Refuses to Fulfill It. After That Ankitha Fires on Abhi and Puts a Demand to Him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X