Intinti Gruhalakshmi: మళ్లీ చేతులు కలిపిన దివ్య శత్రువులు.. తల్లి కూతుళ్లను విడదీసే ప్లాన్ రెడీ
బుల్లితెరను వీక్షించే వాళ్ల అభిరుచిలో మార్పులు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్య ఇంటికి వస్తే తమ బతుకు మళ్లీ రోడ్డున పడుతుందని పరందామయ్య వాళ్లు బాధ పడుతుంటారు. అంతలోనే అక్కడకు లాస్య వస్తుంది. ఇంట్లో తిష్ట వేయాలని ప్లాన్ చేస్తున్న ఆమెకు లక్కీ షాక్ ఇస్తాడు. మనం ఇక్కడ ఉండి వీళ్లను ఇబ్బంది పెట్టొద్దు వెళ్లిపోదాం అని అంటాడు. కానీ, తనకు డాడీ ప్రేమ కావాలని ఏడుస్తాడు. దీంతో నందూ ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని ఓదార్చుతాడు. ఆ తర్వాత లక్కీని తీసుకుని లాస్య.. రాజ్యలక్ష్మి ఇంటికి చేరుకుంటుంది. కానీ, అక్కడ ఆమెను బసవయ్య, రాజ్యలక్ష్మి అవమానిస్తూ మాట్లాడతారు.

రాజ్యలక్ష్మికి నిజం చెప్పిన లాస్య: నందూ ఇంటి నుంచి వచ్చిన లాస్యను రాజ్యలక్ష్మి 'నిన్ను, నీ కొడుకును నందూ గెంటేశాడా' అని ప్రశ్నిస్తుంది. దీనికి లాస్య 'నా కొడుకే నన్ను దగా చేశాడు. వాడితో కలిసి ఆ ఇంట్లో ఉండాలని నేను అనుకుంటే.. ప్లాన్ మొత్తం పాడుచేసి నన్ను కూడా బయటకు తీసుకు వచ్చాడు' అని నిజం చెప్తుంది. దీనికి రాజ్యలక్ష్మి 'మరి ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నావు' అని అడగ్గా.. బసవయ్య 'నీ మీద పడి బతుకుంది. కాకమ్మ కబుర్లు చెప్పి కాలం గడుపుతుంది. ఇక్కడేమో ఫ్రీ బెడ్, ఫ్రీ ఫుడ్' అంటాడు. దీంతో లాస్య కోప్పడగా.. రాజ్యలక్ష్మి కూడా ఆమెపై ఫైర్ అవుతుంది.

ఒక్క మాట అన్నా ఊరుకోనంటూ: ఆ తర్వాత రాజ్యలక్షి 'లాస్య.. నా తమ్ముడిని ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదు. వెళ్లి ఆమె కొడుకుని తీసుకుని రండి. లాస్య.. ఇప్పటికే నిన్ను నమ్ముకుని చాలా సమయం వృథా చేశాను. అనవసరంగా నెత్తిన కూర్చోబెట్టుకున్నా. నన్ను అడ్డం పెట్టుకుని నీ పబ్బం గడుపుకుంటున్నావని తెలుసుకోలేకపోయా' అని అంటుంది. దీంతో లాస్య 'రాజ్యలక్ష్మీ' అని అరవగా 'రాజ్యలక్ష్మి గారు... నువ్వేమైనా నాకు బొడ్డుకోసి పేరు పెట్టావా? నా మీద అరుస్తున్నావు ఏంటి? నీ కొడుకును తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో' అంటూ లాస్యకు ఊహించని షాక్‌నే ఇస్తుంది.
నా మనసు అర్థం చేసుకున్నాడు: లక్కీ వెళ్లిపోయిన తర్వాత పరందామయ్య వాళ్లు అందరూ డల్‌గా ఉంటారు. అప్పుడు తులసి 'అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుండమని మీ అబ్బాయిని ఫోన్ చేయమనండి' అని తులసి అనగా.. అనసూయ వద్దు అంటుంది. దీంతో నందూ 'నువ్వు రమ్మన్నా వాడు రాడమ్మా. అందరి కంటే ఎక్కువగా నా బాధను, మనసును వాడే అర్థం చేసుకున్నాడు. నేను ఏం కోరుకున్నానో అర్థం చేసుకున్నాడు. అందుకే నేను వాడి డాడీ స్థానంలో ఉంటానని మాటిచ్చాను' అంటాడు. దీంతో తులసి 'మాట ఇవ్వడమే కాదు.. నిలబెట్టుకోవడం కూడా ఎంతో ముఖ్యం' అంటుంది. ఆ తర్వాత దివ్య ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేయాలని తులసి అనుకుంటుంది.
నువ్వు ఇష్టం లేకపోతే తీసేస్తాగా: లాస్యపై సీరియస్ అయిన తర్వాత రాజ్యలక్ష్మీ మళ్లీ ఆమెను కలుస్తుంది. 'నేను అరిచినంత మాత్రాన నిన్ను దూరం చేసినట్లా? అలాంటి దాన్నే అయినా నిన్ను ఆస్పత్రి నుంచి కూడా తీసేస్తా కదా' అని నచ్చజెబుతుంది. అంతలోనే రాజ్యలక్ష్మికి తులసి ఫోన్ చేస్తుంది. అప్పుడామె వెటకారంగా మాట్లాడి అసలెందుకు కాల్ చేశావు అని ప్రశ్నించగా.. దివ్యతో వరలక్ష్మీ వ్రతం చేయిద్దామని అనుకుంటున్నాం అంటుంది. దీంతో పక్కనే ఉన్న లాస్య ఒప్పుకోమని చెప్తుంది. దీంతో రాజ్యలక్ష్మి తప్పక ఒప్పుకుంటుంది. తర్వాత అసలు నన్నెందుకు ఒప్పించావ్ అంటుంది.
లాస్య మరో కన్నింగ్ ప్లాన్‌తోనే: రాజ్యలక్ష్మి అడగ్గానే 'పూజ జరుగుతున్న సమయంలోనే నీ వియ్యపురాలి చీరను కాలిపోయేలా చేస్తాను. అప్పుడు నువ్వు పంతులు గారితో ఇలా జరగడం దోషం అని, దీనికోసం తల్లి కూతుళ్లు ఏడాది పాటు చూసుకోకూడదు అని చెప్పించు. అప్పుడు దివ్య దృష్టి నీ మీద నుంచి తల్లి మీదకు మారుతుంది. దీంతో తను డల్ అయిపోతుంది. అప్పుడు దివ్యను ఇంకా ఇంకా కృంగిపోయేలా చేద్దాం. విక్రమ్, దివ్య మధ్యన కూడా దూరం పెంచుదాం. అంతా మనం అనుకున్నట్లు చేద్దాం. రాజ్యలక్ష్మి గారికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు' అంటుంది. దీంతో ఇద్దరూ నవ్వుకుంటారు.

తులసికి ప్రపోజ్.. క్లాస్ పీకేసి: ఉదయాన్నే దివ్య వాళ్ల ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతుండగా.. తులసికి నందూ ఎదురు పడతాడు. అప్పుడామెకు తన మాటలతో ప్రపోజ్ చేసేద్దాం అనుకుంటాడు. కానీ, భయంతో ఆగిపోతాడు. దీంతో తనలో తానే తిట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు పరందామయ్య వాళ్లు వచ్చి నందూకు క్లాస్ పీకుతారు. అప్పుడు నందూ 'నేను ఇప్పుడు ఏమీ ఆలోచించకుండా ప్రపోజ్ చేస్తే.. తనకు నచ్చితే ఓకే.. నచ్చకపోతే అంతా తారుమారు అవుతుంది. ముఖం చూపించలేను' అని అంటాడు. దీంతో తులసి వచ్చి ఏమైందని అడగ్గా.. వాళ్లంతా అబద్దాలు చెప్పి కవర్ చేస్తారు.
దివ్య అలా.. అత్త వాళ్లు ఇలా: విక్రమ్‌ను పట్టు వస్త్రాల్లో చూసేందుకు దివ్య ఆరాటంగా ఉంటుంది. అప్పుడు అతడిని ఉడికిస్తూ మాట్లాడుతుండగా.. అతడు మాత్రం 'నన్ను కాదనుకుని వెళ్లిపోయావు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు' అంటాడు. అలా ఇద్దరూ కాసేపు చిలిపిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అనంతరం సంజయ్ వాళ్లు ఇంట్లో వ్రతానికి ఏర్పాట్లు చేస్తుంటారు. తర్వాత దివ్య పూజ దగ్గర పనులు చేస్తుండగా.. రాజ్యలక్ష్మి, లాస్య వచ్చి వెటకారంగా మాట్లాడతారు. తులసిని కూడా తిడుతుంటారు. దీంతో దివ్య 'పండుగ రోజు దేవతను కోలవండి' అంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











