Intinti Gruhalakshmi September 30th Episode: శృతికి అక్షర సహాయం.. పెళ్లి చెడగొట్టాలని లాస్య ప్లాన్

తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఓ లుక్కేద్దాం పదండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పెళ్లి వాళ్లు వెళ్లిపోయిన తర్వాత శృతిని అనసూయ, భాగ్య నోటికొచ్చినట్లు తిడతారు. అసలు నువ్వు కాఫీ పట్టుకుని ఎందుకు వచ్చావ్? పెళ్లి చెడగొట్టాలని ప్లాన్ చేశావా? అంటూ నిందలు వేస్తారు. దీంతో ఆమె ఎంతగానో బాధ పడుతుంది. అప్పుడు తులసి ఎంట్రీ ఇచ్చి వాళ్లిద్దరికీ సరైనా సమాధానం చెబుతుంది. ఆ తర్వాత నందూకు లాస్యకు మధ్య పెద్ద వాగ్వాదం జరుగుతుంది. దీంతో అతడు.. ఆమెను చెంపదెబ్బ కొడతాడు. అనంతరం మాధవి, తులసి మధ్య ప్రేమ్ గురించి డిస్కర్షన్ జరగగా.. అంకిత వెళ్లి వాళ్లను డైవర్ట్ చేస్తుంది.

నైట్ టైమ్ ప్రేమ్‌కు ఫోన్ చేసిన అక్షర

నైట్ టైమ్ ప్రేమ్‌కు ఫోన్ చేసిన అక్షర

శృతి మాటలతో బాధ పడుతూ ఒంటరిగా కూర్చున్న ప్రేమ్‌కు అక్షర ఫోన్ చేయడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. నైట్ టైమ్‌లో ఆమె ఫోన్ చేయడంతో ప్రేమ్ కాల్ కట్ చేయాలని అనుకుంటాడు. కానీ, బాధ పడుతుందని మాట్లాడడం కొనసాగిస్తాడు. అప్పుడు 'ఏంటి అక్షర ఈ టైమ్‌లో కాల్ చేశావ్?' అని ప్రశ్నిస్తాడు. దీనికామె 'మరి ఏ టైమ్‌లో చేయాలి? నీ గురించి నేను.. నా గురించి నువ్వు తెలుసుకోవద్దా' అని అంటుంది. అప్పుడతను 'నాకు ఇప్పుడు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు నిద్రొస్తుంది' అంటూ ఫోన్ పెట్టేయడంతో ఆమె నిరాశ చెందుతుంది.

ఈ పెళ్లి జరగడానికి వీలులేదన్న లాస్య

ఈ పెళ్లి జరగడానికి వీలులేదన్న లాస్య

జీకే అన్న మాటలకు కోపంగా ఉన్న లాస్య దగ్గరకు భాగ్య వస్తుంది. రావడం రావడమే 'సరిపోయింది.. పెళ్లి నీ చేతుల మీదుగా జరుగుతుందని సంబర పడిపోతే.. ఆ నెక్లెస్‌కు ఇచ్చే విలువ కూడా నీకు ఇవ్వలేదు' అని రెచ్చగొడుతుంది. అప్పుడు లాస్య 'నిజమే భాగ్య.. ఈ మనుషులు నన్ను కూరల కరివేపాకు తీసేసినట్లు తీసేస్తున్నారు. అందుకే ఈ పెళ్లి జరగడానికి వీలులేదు. వీళ్లంతా సంతోషంగా ఉండడం నాకిష్టం లేదు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తుంది. దీంతో భాగ్య 'నువ్వంత కోప్పడకు లాస్య. ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దు' అంటూ బుజ్జగిస్తుంది.

అలా చేస్తే తులసే గెలుస్తుంది అంటూ

అలా చేస్తే తులసే గెలుస్తుంది అంటూ

పెళ్లి ఆపేస్తానని లాస్య అనగానే.. 'ఏం మాట్లాడుతున్నావ్ లాస్య? మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి. ఎవరి అదృష్టం వల్లో కుబేరుడు లాంటి జీకే సంబంధం కుదుర్చుకోడానికి వచ్చాడు. ఇప్పుడు కాదంటే నీకే నష్టం' అని అంటుంది భాగ్య. అప్పుడు లాస్య 'ఎన్ని చేసినా నా మీద ఎప్పుడూ తులసే గెలుస్తుంది' అని చెబుతంది. దీనికామె 'నువ్వు పెళ్లి కాదన్నా తులసక్కే గెలుస్తుంది. అప్పుడామె చక్కగా ప్రేమ్‌కు శృతికి పెళ్లి చేస్తుంది. నువ్వేమో అప్పుల వాళ్ల వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తుంది. లేకుంటే పరారైపోతావు. ఇది జరగకూడదంటే పెళ్లి జరగాలి' అని వివరిస్తుంది.

అక్షరే ప్రేమ్ భార్య అని చెప్పేసిన అభి

అక్షరే ప్రేమ్ భార్య అని చెప్పేసిన అభి

శృతిని తలచుకుంటూ బాధ పడుతోన్న ప్రేమ్‌తో మోహన్ మాట్లాడతాడు. ఆ సమయంలో అతడికి ధైర్యం చెబుతూనే సరైనా నిర్ణయాలు తీసుకోమని అంటాడు. ఆ సమయంలో అభి అక్కడకు వచ్చి 'చూడరా ప్రేమ్.. ఇప్పటికే నువ్వు పెళ్లికి ఓకే చెప్పేశావ్. కాబట్టి ఇక పాత విషయాలను ఏమీ పట్టించుకోవద్దు. ఒక్కసారి ఓకే అంటే ఓకే అన్నట్లే. ఇప్పుడు అక్షరే నీకు కాబోయే భార్య' అంటూ చెబుతాడు. అప్పుడు మోహన్ 'చూడరా.. ఇప్పటికే జరిగిన దానికి వాడు చాలా బాధ పడుతున్నాడు' అంటాడు. దీనికి అభి 'నువ్వు వాడికి ఇలా చెప్పొద్దు' అని మామతో అంటాడు.

అక్షర ఇంటికి శృతి.. నందూ సీరియస్

అక్షర ఇంటికి శృతి.. నందూ సీరియస్

జీకే ఫోన్ చేసి కార్లు పంపించాను త్వరగా వచ్చేయండి అంటూ నందూకు చెబుతాడు. దీంతో అతడు ఇంట్లో వాళ్లందరినీ త్వరగా రెడీ అవ్వమని అంటాడు. అప్పుడు తులసి శృతిని పిలిచి నువ్వు కూడా అక్కడకు రావాలి అని అడుగుతుంది. దీంతో నందూ 'తులసి నీకు మతుందా? శృతిని అక్కడకు తీసుకెళ్తే జీకే గారు ఏమనుకుంటారు' అని సీరియస్ అవుతాడు. అప్పుడామె 'మన ఇంట్లో అమ్మాయి ఉంటే అనుమానించే సంస్కారం వాళ్లకు లేదనే అనుకుంటున్నా. శృతి మన ఇంటి పిల్ల కాబట్టి వచ్చినా జరిగే నష్టమేమీ ఉండదు' అంటూ చెప్పి ఆమెను తీసుకెళ్తుంది.

ప్రేమ్‌పై అనుమానం వ్యక్తం చేసిన జీకే

ప్రేమ్‌పై అనుమానం వ్యక్తం చేసిన జీకే

తన కూతురు కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరుగుతుండడంతో జీకే ఎంతగానో సంతోషిస్తుంటాడు. ఇదే విషయాన్ని నందూకు చెబుతాడు. అంతేకాదు, 'ఏంటి ప్రేమ్..? ఎవరైనా పెళ్లి అంటే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కానీ, నువ్వు మాత్రం ఇష్టం లేనట్లు కనిపిస్తున్నావు' అంటాడు. అలాగే 'ఈ మాట అడిగా అని ఏమీ అనుకోకండి. ఎంతైనా అమ్మాయిని ఇస్తున్నాం కదా' అని అంటాడు. దీనికి లాస్య స్పందిస్తూ ఆయనకు అనుకూలంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత నందూ 'ప్రేమ్‌కు ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకుంటున్నాడు. మీరేమీ కంగారు పడకండి' అని సమాధానం ఇస్తాడు.

లాస్యకు మరో షాక్.. శృతికి అక్షర్ సపోర్ట్

లాస్యకు మరో షాక్.. శృతికి అక్షర్ సపోర్ట్

అందరూ మాట్లాడుతుండగా.. లాస్య జీకేను అక్షర గురించి అడుగుతుంది. దీంతో ఆమె రెడీ అవుతుందని చెబుతాడు. అప్పుడు లాస్య, భాగ్యను తీసుకుని ఆమె దగ్గరకు వెళ్తుంది. కాసేపు ఆమెతో మాట్లాడిన వెంటనే తులసి గురించి అడుగుతుంది. దీంతో లాస్య షాక్ అవుతుంది. అప్పుడే తులసి, శృతిని తీసుకుని వస్తుంది. అప్పుడు ఆమెను చూసిన అక్షర.. 'ఏంటి శృతి ఇలా ఉన్నావు. నువ్వు ఈ డ్రెస్‌లో ఉండడం నాకు నచ్చలేదు' అంటుంది. దీనికి తులసి 'కంగారులే అలా వచ్చేసిందమ్మా' అని చెప్తుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X