Intinti Gruhalakshmi: లాస్యను ఘోరంగా అవమానించిన భాగ్య.. వాటిని పుట్టింటికి పంపించేసిన దివ్య

ఐదు కాదు.. పది కాదు.. దాదాపు ఇరవై ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

Intinti Gruhalakshmi Serial Today Episode September 30th 2023

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. హనీ మీద దిగులుతో ఉన్న తులసి ఆ చిన్నారికి కాల్ చేస్తుంది. అప్పుడు తులసికి అన్నీ అబద్దాలే చెబుతుంది. అవన్నీ నిజమే అని తులసి నమ్ముతుంది. ఇక, దివ్య వినాయక చవితి రోజు చంద్రుడిని చూసేలా రాజ్యలక్ష్మి ప్లాన్ చేస్తుంది.

కానీ, బసవయ్య వచ్చి అనుకోకుండా ఆ ప్లాన్‌ను చెడగొడతాడు. దీంతో అతడిపై అందరూ ఫైర్ అవుతారు. తర్వాత విక్రమ్‌కు దివ్య నలుగు పెట్టి స్నానం చేయించాలని అనుకుంటుంది. అంతలోనే జానూ వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తుంది. దీంతో ఆమెకు దివ్య అదిరిపోయే రీతిలో వార్నింగ్ ఇస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 30th 2023

పుట్టింటికి దివ్య వంటలు: దివ్య కోసం రాజ్యలక్ష్మి వేసిన స్కెచ్‌కు బలైపోయిన బసవయ్య నీలాపనిందలు పడుతూనే ఉంటాడు. ఎవరితో మాట్లాడినా అతడిని తిడుతూనే ఉంటాడు. దీంతో 'అనవసరంగా చవితి రోజు చంద్రుడిని చూశాను. ఆయన చాలా పవర్‌ఫుల్ అనుకుంటా.

అందుకే నాకు ఎవరిని కదిలించినా తిట్లు పడుతున్నాయి' అని అనుకుంటాడు. ఆ తర్వాత దివ్య పూజకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేస్తుంది. తర్వాత వంటలన్నీ వండిన దివ్య.. రాములమ్మను పిలిపించి తాను వండినవి అన్నీ ఒక క్యారేజ్‌లో పుట్టింటికి పంపుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 30th 2023

రాజ్యలక్ష్మి మరో ప్లాన్‌తో: దివ్యపై నిందలు వేసే ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో రాజ్యలక్ష్మి మరొకటి క్రియేట్ చేస్తుంది. ఇందుకోసం ప్రసన్నను 'ఎవరు చూడకుండా దివ్య బెడ్ రూమ్‌లో దాచిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎత్తుకునిరా. అలా చేస్తేనే కదా దివ్య మీద నింద వేసి విక్రమ్‌కు కోపం వచ్చేలా చేయొచ్చు. అలా జరిగితేనే వాళ్లను వేరు చేయగలిగేది' అంటుంది.

కానీ, ప్రసన్న మాత్రం ఎత్తుకురావడం అంటే తన వల్ల కాదని భయపడుతుంది. దీంతో రాజ్యలక్ష్మి ఈ పని జానూ కోసం చేయమని అంటుంది. ఆ మాట అనే సరికి ప్రసన్న భయపడుతూనే పని చేస్తానని అంటుంది. అలా గదిలోకి వెళ్లిన ప్రసన్నకు డాక్యూమెంట్లు దొరకవు. దీంతో రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి విషయం చెప్తుంది.

కూతురి నైవేద్యం రెడీగా: పూజ చేయడం కోసం నందూ వినాయకుడి ప్రతిమను తీసుకొస్తాడు. అప్పుడు అతడికి తులసి చేయాల్సిన పనులను చెప్తుంది. దీంతో అతడు బిక్కముఖం వేస్తాడు. అయినప్పటికీ తులసికి కష్టం కలగకుండా పనులు చేస్తానని అంటాడు. అప్పుడే నైవేద్యం కూడా రెడీ చేయమని అనసూయ అనగా.. రాములమ్మ వచ్చి అవసరం లేదు దివ్య పంపించిందని చెప్తుంది. అంతేకాదు, 'దివ్యమ్మ చేత్తో చేసిన నైవేద్యాలు తులసమ్మ చేతితో దేవుడి దగ్గర పెట్టాలని కోరింది' అంటుంది. దీంతో అందరూ సంతోషించగా తులసి భయపడుతుంది. ఆమెకు పరందామయ్య సర్ది చెప్తాడు.

లాస్యను అవమానించి: మరోవైపు, భాగ్య తన ఇంట్లో వినాయకుడి పూజ చేసుకుంటుంటే లాస్య మాత్రం ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది. అప్పుడు లాస్య 'మొగుడిని గదిలో కూర్చోబెట్టి ఇక్కడ నువ్వు పూజలు చేయడం ఏంటి' అని భాగ్యను ప్రశ్నిస్తుంది. దీనికామె 'అదేం కాదు.. నందూ బావది, మా వారిది ఒకటే రక్తం కదా. అందుకే ఎందుకైనా మంచిదని నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను' అని అవమానించేలా మాట్లాడుతుంది. దీంతో లాస్య 'అంటే నీకు నా మీద అనుమానమా? అంత చీప్ క్యారెక్టర్ లాగా కనిపిస్తున్నానా' అంటూ సీరియస్ అవుతుంది.

చిల్లర మనిషే ఇలానా: లాస్య మాటలకు భాగ్య 'ఎంతైనా మా వారు ఉప్పు కారం తినే మనిషి కదా. నిన్ను చూడగానే ప్రసాదంలాగా కళ్లకు అద్దుకుంటే నా పని పులిహోర అయిపోతుంది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలి మాదిరిగా కాపురం చేయడం నా వల్ల కాదు. అది తులసక్కకే సాధ్యం. నేను అలా చాన్స్ ఇవ్వదలచుకోలేదు. ఇప్పుడు ఇచ్చి తర్వాత బాధపడలేను' అంటూ మరింతగా అవమానిస్తుంది. దీంతో లాస్య 'నా ముందు చిల్లర డబ్బుల కోసం ఆశపడే మనిషి.. ఇలా మాట్లాడుతుంది' అంటూ తనలో తాను తిట్టుకుంటూ ఉంటుంది.

బిస్కెట్లు తెచ్చివ్వగా: హనీ ఆకలి వేస్తుందని తాతయ్యతో చెప్పుకుని ఏడుస్తుంది. అంతలోనే ఇంట్లో పని చేసే ఆమె.. హనీ పరిస్థితికి జాలి పడి బిస్కెట్లు తెచ్చి హనీకి ఇస్తుంది. అంతలోనే రత్నప్రభ అక్కడకు వస్తుంది. హనీ చేతిలో బిస్కెట్లు చూసి పనిమనిషిని నోటికి వచ్చినట్లు తిడుతుంది. అలాగే, 'వెంటనే తీసుకొచ్చినవి తిరిగి తీసుకెళ్లు. నువ్వు మా అనుమతి లేకుండా ఈ పని చేసినందుకు ఒక నెల రోజుల పాటు జీతం లేకుండా పని చేయాలి. పచ్చి కూరగాయలు తినాలి' అని పనిష్మెంట్ ఇచ్చి అందరికీ వార్నింగ్ ఇస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X