For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi September 3rd Episode: తులసి ప్లాన్ చెడగొట్టిన లాస్య.. నందూకు షాకిచ్చిన జీకే

  |

  ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ చూసుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంట్లో గొడవలు వద్దని మాజీ భర్తకు సలహాలు ఇచ్చిన తులసి.. లాస్యకు మాత్రం నందూకు తనకు మధ్య భార్య భర్తల బంధం లేకున్నా.. ఎవరి నాశనాన్ని కోరుకోమని చెబుతుంది. ఆ తర్వాత అక్షర తనకు ప్రేమ్ కావాలని తండ్రిని కోరుతుంది. ఇందుకోసం సూసైడ్ డ్రామాను ఆడుతుంది. ఇక, పరందామయ్య నందూ అన్న మాటలకు బాధ పడుతుంటాడు. ఈ క్రమంలోనే అనసూయ ముందు ఏడ్చేస్తాడు. మరోవైపు, ప్రేమ్ శృతికి ప్రపోజ్ చేసేందుకు గుడికి తీసుకెళ్లాలని డిసైడ్ అవుతాడు. అందుకోసం ఇద్దరూ రెడీ అవుతుంటారు.

  షర్ట్ మొత్తం విప్పేసి ‘ఎవడు' హీరోయిన్ హాట్ షో: తల్లైన తర్వాత కూడా ఇంత ఘాటుగానా!

  శృతి జీవితంలో ముఖ్యమైన రోజంటూ

  శృతి జీవితంలో ముఖ్యమైన రోజంటూ

  రాములమ్మతో తులసి మాట్లాడుతుండగానే శృతి రెడీ అవుతూ బయటకు వస్తుంటుంది. ఆమెనలా చూసి వాళ్లిద్దరూ ఎంతో సంతోషిస్తారు. అలాగే, శృతితో ‘ఈరోజు నువ్వు ఎంతో అందంగా ఉన్నావు శృతి. ఇప్పుడేమీ పనులు చేయకు. అసలే నీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. గుడికి వెళ్లి అంతా మంచి జరగాలని కోరుకో' అని అంటుంది. దీంతో శృతి అయోమయంగా ముఖం పెడుతుంది. అప్పుడు రాములమ్మ ‘మీరు శృతమ్మను ప్రేమ్ బాబును కలపడానికి ఎంత పరితపిస్తున్నారమ్మా. మీరు చాలా లక్కీ' అంటుంది. అప్పుడు తులసి కూడా కొడుకును, శృతిని పొగుడుతుంది.

  ప్రేమ్ కోసం అక్షర తండ్రి కన్నింగ్ ప్లాన్

  ప్రేమ్ కోసం అక్షర తండ్రి కన్నింగ్ ప్లాన్

  ఒకపక్క ప్రేమ్ తన ప్రేమను శృతికి చెప్పడానికి రెడీ అవుతుండగా.. మరోపక్క కూతురి కోరిక మేరకు అక్షర తండ్రి జీకే ప్లాన్లు వేస్తుంటాడు. ఇందులో భాగంగానే తన పీఏ ద్వారా ప్రేమ్ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకుంటాడు. ఈ క్రమంలోనే నందూ కంపెనీ దివాళా తీసే ప్రమాదంలో పడిందన్న న్యూస్ ఆయన చెవిన పడుతుంది. అప్పుడు జీకే ‘గుడ్ న్యూస్ చెప్పావ్. వాళ్లు సమస్యల్లో ఉంటేనే కదా.. దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం కుదురుతుంది. ఇప్పుడు అతడికి మనం అండగా ఉండే ఏదైనా సాధ్యం అవుతుంది' అని పీఏతో చెబుతాడు.

  అనసూయకు నెలలు అంటూ అభి సంచలన వ్యాఖ్యలు: ప్రెగ్నెన్సీపై అందరి ముందే ఊహించని ఆన్సర్

  అడ్డుగా ఉంటే మనం తొలగించడమే

  అడ్డుగా ఉంటే మనం తొలగించడమే

  ప్రేమ్‌తో తన కూతురికి ఎలాగైనా పెళ్లి చేయాలన్న పట్టుదలతో ఉన్న జీకే.. నందూను కలవడానికి పీఏతో ప్లాన్ చేయమంటాడు. అప్పుడతను ‘సార్ నాకో డౌట్. ఒకవేళ ప్రేమ్ గారికి ఇప్పటికే ఎవరైన లవర్ ఉంటే ఎలా' అని అడుగుతాడు. అప్పుడు జీకే ‘ప్రేమ్‌ జీవితంలో ఎవరూ లేకపోతే మనకు ఓకే. ఒకవేళ ఎవరైనా ఉంటే మనం అడ్డు తొలగించడమే. అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడమే. ముందైతే నందూతో ఈ విషయం గురించి మాట్లాడనీ. ఆ తర్వాత ప్రేమ్ పర్సనల్ లైఫ్ గురించిన సంగతులు తెలుసుకుందాం' అని కన్నింగ్ ప్లాన్ వేస్తాడాయన.

  నందూకు సర్‌ప్రైజ్ ఇచ్చిన అక్షర తండ్రి

  నందూకు సర్‌ప్రైజ్ ఇచ్చిన అక్షర తండ్రి

  కంపెనీలోని ఉద్యోగులు అందరూ జీతాలు ఇవ్వడం లేదని వెళ్లిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధ పడుతుంటాడు నందూ. అంతలో జీకే పీఏ అతడికి ఫోన్ చేస్తాడు. అప్పుడు ‘హలో నందూ గారేనా? నేను జీకే ఇండస్ట్రీస్ ఎండీ జీకే గారి పీఏను. సార్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు' అని చెబుతాడు. దీనికి షాకైన నందూ ‘అదేంటి అంత పెద్దాయనకు నాతో ఏం పని? నేను ఎక్కడికి రావాలి' అని అడుగుతాడు. అప్పుడు పీఏ ‘ఏం మాట్లాడతారో నాకు తెలీదు. మీ దగ్గరకే సార్ వస్తారు' అని చెప్తాడు. దీంతో నందూ, లాస్య కంగారుగా ఆఫీస్‌కు బయలుదేరుతారు.

  అషు రెడ్డి ప్రైవేటు పార్ట్‌ను చూపించిన ఆర్జీవీ: పవన్ కల్యాణ్‌ కోసం ఆమెను బుక్ చేసేశాడుగా!

  తులసి వ్యవహారంపై శృతి అనుమానం

  తులసి వ్యవహారంపై శృతి అనుమానం

  శృతికి గుడికి వెళ్లడానికి రెడీ అవుతుండగా తులసి వచ్చి ఆమెకు తల దువ్వుతూ ఉంటుంది. అప్పుడామె ‘ఏంటి ఆంటీ నన్ను ముస్తాబు చేస్తున్నారు' అని అడుగుతుంది. అప్పుడు తులసి ‘దివ్యకు చేయనా.. అలాగే నీక్కూడ' అని అంటుంది. దీనికి శృతి ‘దివ్య అంటే చిన్న పిల్ల. నాకు నేను పనులు చేసుకోగలను కదా' అని అంటుంది. అంతేకాదు, ‘ఆంటీ ఈరోజు మీరు కొత్తగా కనిపిస్తున్నారు. మనసులో కొంచెం సంతోషంగా, కొంచెం ఆందోళనగా కూడా ఉన్నారు. అసలు ఏమైంది' అని ప్రశ్నిస్తుంది. దీనికి తులసి అలాంటిదేమీ లేదని సమాధానం చెబుతుంది.

  అంకిత కంప్లైంట్.. లాస్య కన్నింగ్ ప్లాన్

  అంకిత కంప్లైంట్.. లాస్య కన్నింగ్ ప్లాన్

  శృతిని తులసి ముస్తాబు చేస్తున్నది చూసిన అంకిత.. లాస్యతో ‘ఈరోజు శృతిని ప్రేమ్ గుడికి తీసుకెళ్లి అక్కడ ప్రపోజ్ చేస్తాడట. అదే జరిగితే ఆమెను ఎవరూ ఆపలేము. నాకు తోడికోడలై అందరి దగ్గర నాతో సమానంగా గౌరవం పొందుతుంది. అది తలచుకుంటేనే నాకు ఒళ్లు మండిపోతుంది' అని చెబుతుంది. దీనికి లాస్య ‘ఇంట్లో ఫైల్ వదిలేసి వచ్చాను. దాన్ని మర్చిపోయామని పంపించమని అంకితకు ఫోన్ చేస్తాను. అప్పుడు దాన్ని ప్రేమ్‌తో పంపమని అడుగుతాను. దీంతో వాళ్లు గుడికి వెళ్లడం క్యాన్సిల్ అవుతుంది. తులసి బాధ పడుతుంది' అని కన్నింగ్ ప్లాన్ చేసింది.

  టాప్‌ తీసేసి హీరోయిన్ హాట్ సెల్ఫీ: పెళ్లైన తర్వాత కూడా అందాలు మొత్తం చూపించిందిగా!

  లాస్య ప్లాన్ వర్కౌట్.. మోసం చేశాను

  లాస్య ప్లాన్ వర్కౌట్.. మోసం చేశాను

  ప్రేమ్‌తో కలిసి శృతి గుడికి వెళ్లిందని అనుకున్న తులసికి బిగ్ షాక్ తగులుతుంది. శృతి ఇంకా ఇంట్లోనే ఉంటుంది. దీంతో ‘ఏంటమ్మా తులసి నువ్వు గుడికి వెళ్లలేదా? ఇంకా ఇక్కడే ఉన్నావేంటి' అని అడుగుతుంది. అప్పుడు శృతి ‘ప్రేమ్‌ అంకుల్ వాళ్ల ఆఫీస్‌కు వెళ్లాడు కదా. ఆయన ఏదో ముఖ్యమైన ఫైల్ మర్చిపోతే ఇవ్వడానికి వెళ్లాడు. గుడికి ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్లొచ్చు. అది ముఖ్యమైన పని కదా' అని అంటుంది. దీనికి తులసి మనసులో ఆందోళన చెందుతుంది. అప్పుడు అంకిత ‘సారీ ఆంటీ మోసం చేశాను' అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  నందూకు ఆఫీస్‌కు జీకే.. కోపంతోనే

  నందూకు ఆఫీస్‌కు జీకే.. కోపంతోనే

  అసలు జీకే తన కంపెనీకి ఎందుకు వస్తానన్నాడు అన్న విషయంపై నందూ తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. అంతలోనే ఆయన ఆఫీస్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. జీకే రాగానే నందూ, లాస్య ఆయనకు స్వాగతం పలుకుతారు. ఆ సమయంలో ఆఫీస్ అంతా ఖాళీగా ఉండడం చూసి ‘కంపెనీ అంతా ఖాళీగా ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారన్న మాట' అని అంటాడు. దీనికి నందూ కోప్పడతాడు. దీంతో జీకే ‘కూల్ నందూ అంత కోపమెందుకు? మీకు నేను ఓ బిజినెస్ డీల్ ఇవ్వడానికి వచ్చాను' అని చెబుతాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 415: Tulasi.. Full Happy about Prem and Shruthi Love. But Lasya Ready a Cunning Plan for Prem and Tulasi. Akshara Father Ready a Evil Plan for Prem.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X