For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: సామ్రాట్‌కు షాకిచ్చిన తులసి.. నందూ ఇంటికి వెళ్లడంతో అవమానం

  |

  ఇండియాలోని ఎన్నో భాషల్లో వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి తనకు వార్నింగ్ ఇవ్వడంతో నందూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడతను లాస్యతో అసలు ఆమె వల్ల నాకెందుకు ఇలా అవుతుంది అని అడుగుతాడు. అప్పుడు లాస్య అభిని రెచ్చగొట్టిన విషయం చెప్పకుండా.. మీ అమ్మా నాన్నలకు దూరంగా ఉండు అని నందూకు సలహా ఇస్తుంది. తర్వాత అనసూయ నందూకు ఫోన్ చేసి సామ్రాట్‌ దగ్గర నిజం ఒప్పుకోమని అంటుంది. అనంతరం ఇంటికి తిరిగొచ్చిన అంకిత అభికి ఫుల్‌గా క్లాస్ పీకుతుంది. అంతేకాదు, సామ్రాట్‌కు నిజం చెప్పమని డిమాండ్‌ను చేస్తుంది.

  వేణు మాధవ్ మరణంపై పెదవి విప్పిన కొడుకులు: ఆయనకు గర్ల్‌ఫ్రెండ్ ఎక్కువ.. అదే ప్రాణం తీసిందంటూ!

  సామ్రాట్ అలా.. తులసి మరోలా

  సామ్రాట్ అలా.. తులసి మరోలా

  భూమి పూజ దగ్గర గొడవ జరిగిన తర్వాత మాట్లాడకుండా ఉన్న తులసి, సామ్రాట్ అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒంటరిగా ఉన్న సామ్రాట్ 'అసలు అలా మాట్లాడకుండా వెళ్లిపోవడంలో తులసి ఉద్దేశం ఏంటి. తన పర్సనల్ విషయాలు నాకు అనవసరం అనా. తను అసలు ఏమనుకుంటుందో ఫోన్ చేసి ఇప్పుడైనా మాట్లాడొచ్చు కదా. అసలు తులసి గారి మౌనానికి అర్థం ఏంటి. నేనంటే నిర్లక్ష్యమా. అసలు నన్ను పట్టించుకోవడం లేదు ఏంటి' అని అనుకుంటాడు. తులసి మాత్రం 'సామ్రాట్ గారు ఇప్పటి వరకు ఫోన్ చేసి కూడా మాట్లాడలేదంటే ఆయన నా మీద ఇంకా కోపంగా ఉన్నట్టున్నారు' అని అనుకుంటుంది.

  సామ్రాట్‌కు తులసి సందేశంతో

  సామ్రాట్‌కు తులసి సందేశంతో

  తర్వాత సామ్రాట్ తులసి గారికి నేనే ఫోన్ చేస్తాను అని అనుకుంటాడు. ఇంతలో తులసి నుంచి అతడికి మెసేజ్ చేస్తుంది. తులసి ఏం మెసేజ్ పెట్టిందో అని చూస్తాడు సామ్రాట్. అది చూసి అతడు షాక్ అవుతాడు. అందులో తులసి 'ఏ సంతోషానికైనా ముగింపు బాధే అవుతుంది. మ్యూజిక్ స్కూల్ విషయంలో ఇంతవరకు మీరు చేసిన సాయానికి ధన్యవాదాలు. ఈరోజుతో మీ వ్యాపార భాగస్వామ్యాన్ని వదులుకుంటున్నాను' అంటూ దండం పెట్టిన ఎమోజీలు పెడుతుంది. ఇంతలో తులసికి కూడా మెసేజ్ వస్తుంది. అది సామ్రాట్ పంపించిందే అనుకుంటుంది కానీ కాదు.

  ప్రియాంక చోప్రా ఎద అందాల ఆరబోత: బటన్స్ విప్పేసి మరీ హాట్ షో

   తులసిపై సామ్రాట్ ఆగ్రహంగా

  తులసిపై సామ్రాట్ ఆగ్రహంగా

  తులసి పంపిన మెసేజ్ చదివిన వెంటనే సామ్రాట్ వెంటనే వాళ్ల బాబాయి దగ్గరికి వెళ్లి 'మీ తులసి గారు ఏమనుకుంటున్నారు. తను నా బిజినెస్ పార్ట్‌నర్‌గా ఉండరట. నా ప్రాజెక్ట్స్ అన్నీ పక్కన పెట్టి ఆవిడ కోసం నేను ఇంత చేస్తే తను ఏం చేసిందో తెలుసా? ఈరోజుతో మీ వ్యాపార భాగస్వామ్యాన్ని వదులుకుంటున్నాను అంటూ మెసేజ్ పెట్టింది. తప్పు చేసింది తను.. ఆత్మాభిమానం తులసి గారికే కాదు.. నాకు కూడా ఉంది' అంటూ సీరియస్ అవుతాడు. దీంతో సామ్రాట్ బాబాయి అసలు తులసి ఏం తప్పు చేసిందిరా? ఈ ఒక్క మాటకు సమాధానం చెప్పు అని అడుగుతాడు.

  తులసి అంటే నీకు ఇష్టం కదా

  తులసి అంటే నీకు ఇష్టం కదా

  బాబాయి అడిగిన ప్రశ్నకు సామ్రాట్ 'నందూ గారు తన మాజీ భర్త అని ఎందుకు చెప్పలేదు' అంటాడు. దీనికాయన 'నువ్వు అడిగావా.. పోనీ నువ్వు ఎవరివి చెప్పడానికి. పోనీ.. నీ జీవితంలో ఉన్న విషయాలను నువ్వు చెప్పావా? చెప్పలేదు కదా. నందూ కూడా ఈ విషయం చెప్పలేదు కదా' అంటాడు. దీంతో సామ్రాట్ 'సరే.. అవన్నీ పక్కన పెట్టు. మ్యూజిక్ స్కూల్ విషయంలో ఇలా చేయడం ఏంటి? అలా చెప్పాపెట్టకుండా మ్యూజిక్ స్కూల్‌ను ఆపేయడం ఏంటి' అని అంటాడు. దీంతో బాబాయి 'తులసి అంటే నీకు ఇష్టం కదా.. ప్రేమ కదా.. తను ఇక నీకు కనిపించదని ఇలా చేస్తున్నావు కదా' అని సూటిగా ప్రశ్నిస్తాడు. అప్పుడు సామ్రాట్ ఊరుకో బాబాయి. మధ్యలో నీ గోల ఏంటి అంటాడు.

  బట్టలు లేకుండా చరణ్ హీరోయిన్: ఆ పార్టును మాత్రమే చూపిస్తూ దారుణంగా!

  శృతి, ప్రేమ్ మధ్య గిల్లికజ్జాలు

  శృతి, ప్రేమ్ మధ్య గిల్లికజ్జాలు

  ఇక, శృతి సూట్‌కేసు తన రూమ్‌లో ఖాళీగా కనిపిస్తుంది. దీంతో తన చీరలు అన్నీ ఏమయ్యాయి అని టెన్షన్ పడుతుంది. అలా బయటకు రాగానే దివ్య ఏమైందని ప్రశ్నిస్తుంది. దీంతో శృతి తన చీరలు కనిపించడం లేదని అంటుంది. అప్పుడామె ఇంతకుముందు ప్రేమ్ అన్నయ్య నీ చీరలను తీసుకెళ్లడం చూశా అంటుంది. దీంతో నా చీరలతో ఏం చేస్తున్నాడు అని బయటికి వచ్చి చూస్తుంది. ఇంతలో ప్రేమ్ ఆమె చీరలను గార్డెన్‌లో వేస్తాడు. అప్పుడు శృతి నా చీరలను ఇక్కడ ఏం చేస్తున్నావు. వీటిని తీసుకొచ్చి ఇలా మట్టిలో పడేశావు ఏంటి అంటుంది. దీంతో ప్రేమ్ నా ఇష్టం. నా రూమ్‌లో ఉన్నాయి. అందుకే తీసుకొచ్చాను అంటాడు. దీనికి శృతి ఇవి ఉతకని చీరలు అంటుంది. తర్వాత వాటిపై నీళ్లు పోస్తాడు. దీంతో శృతి కోప్పడుతుంది.

  నందూ ఇంటికి వెళ్లిన తులసి

  నందూ ఇంటికి వెళ్లిన తులసి

  భూమి పూజలో గొడవ జరిగిన తర్వాత తులసి తొలిసారి నందూ వాళ్ల ఇంటికి వెళ్తుంది. దీంతో ఎందుకొచ్చావన్నట్లుగా నందూ, లాస్య ఆమెను చూస్తారు. అప్పుడు తులసి 'నా ఆత్మాభిమానాన్ని రక్షించుకోవడానికి.. నా నిర్దోషితత్వాన్ని నిరూపించుకోవడానికి నేను ఇప్పుడు రావాల్సి వచ్చింది నందగోపాల్ గారు' అంటుంది. దీనికి నందూ 'సామ్రాట్ గారి బిజినెస్ పార్టనర్ అయిన తులసి ఎక్కడ? ఆఫ్టరాల్ జీతగాడిని అయిన నేను ఎక్కడ. మీరు నా హెల్ప్ అడగడం ఏంటి మేడం' అంటూ వెటకారంగా మాట్లాడతాడు. దీంతో తులసికి కోపం పెరుగుతూ ఉంటుంది.

  Bigg Boss 6: జబర్ధస్త్‌కు కోలుకోలేని షాక్.. బిగ్ బాస్‌లోకి టాప్ లేడీ కమెడియన్.. హౌస్‌లో రచ్చ రచ్చే

  నందూను రిక్వెస్ట్ చేసిన తులసి

  నందూను రిక్వెస్ట్ చేసిన తులసి

  నందూ మాట్లాడిన తర్వాత తులసి 'మనిద్దరి మధ్య ఒక పెద్దమనుషుల తరహా ఒప్పందం ఉంది. కానీ.. మీరే ఆ ఒప్పందాన్ని కాదని సామ్రాట్ గారికి మన విషయం తెలిసేలా చేశారు. నేను దాచడం వల్లనే తులసి ఈ విషయం చెప్పలేదు అని మీరు సామ్రాట్ గారికి చెప్పాలి' అంటుంది. దీంతో నందూ, లాస్య ఇద్దరూ పగలబడి నవ్వుతారు. దీంతో నందూ 'తులసి చెబితే నమ్మని సామ్రాట్ నేను చెబితే నమ్ముతారా. మన ప్రాజెక్ట్ పక్కనపెట్టి తులసి ప్రాజెక్ట్‌ను ఫైనలైజ్ చేసిన సామ్రాట్ గారు' అంటూ హేళన చేస్తారు. దీంతో తులసికి కోపం వస్తుంది. అయినా నందూ మాత్రం అస్సలు వినడు. సామ్రాట్‌తో తన మధ్య ఏదో ఉందని హేళన చేస్తూ అనుమానంగా మాట్లాడటంతో తులసి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 728: Tulasi Revokes her Business Partnership with Samrat. After That Tulasi Makes a Request To Nandhu about Truth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X