For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi September 4th Episode: తులసిని బ్లాక్ మెయిల్ చేసిన లాస్య.. శృతికి నందూతో చెక్!

  |

  దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రేమ్, శృతిని గుడికి పంపడం కోసం తులసి ఎంతగానో ప్లాన్లు వేస్తుంది. ఆ సమయంలో ఆమెకు తల కూడా దువ్వుతుంది. అది చూసిన అంకిత, లాస్య కన్నింగ్ ప్లాన్ వేస్తారు. అందుకు అనుగుణంగానే తులసి అనుకున్నట్లు జరగకుండా అడ్డు పడతారు. దీంతో వాళ్లిద్దరూ గుడికి వెళ్లడం కుదరదు. అలాగే, అక్షర తండ్రి కూడా ప్రేమ్ కోసం ఓ ప్లాన్ వేస్తాడు. నేరుగా నందూ ఆఫీస్‌కు వచ్చిన ఆయన.. బిజినెస్ డీల్ ఉందని చెప్పి మాట్లాడాతాడు. అంతకంటే ముందే ప్రేమ్ కోసం అడ్డంకులను తొలగిస్తానని పీఏ ముందు చెబుతాడాయన.

  Evaru Meelo Koteeswarulu షోకు షాకింగ్ రేటింగ్: చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. దానితో పోలిస్తే మాత్రం!

  ప్రేమ్ నాకు బాగా కావాల్సిన వాడంటూ

  ప్రేమ్ నాకు బాగా కావాల్సిన వాడంటూ

  నందూ కంపెనీకి వచ్చిన అక్షర తండ్రి జీకే బిజినెస్ డీల్ గురించి మాట్లాడడానికి వచ్చానని చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. మొదట నందూకు కోపం వచ్చేలా మాట్లాడిన ఆయన.. ఆ తర్వాత బిజినెస్ డీల్ ఉందని చెప్పడంతో ఆఫీస్‌ రూమ్‌లోకి వెళ్లి మాట్లాడుకుంటారు. ఆ సమయంలో జీకే.. ప్రేమ్ గురించి మాట్లాడతాడు. దీంతో నందూ తన కొడుకు ఏదైనా చేశాడేమో అని సారీ చెబుతాడు. అప్పుడు జీకే ‘ప్రేమ్ గొడవ పెట్టుకునే వాడో కాదో నాకు తెలీదు. కానీ, నాకు బాగా కావాల్సిన వాడు' అని అంటాడు. దీంతో ఏమీ అర్థం కాక నందూ అయోమయానికి గురవుతాడు.

  తన కూతురి ఫొటోను పంపించిన జీకే

  తన కూతురి ఫొటోను పంపించిన జీకే

  జీకే.. ప్రేమ్ గురించి మాట్లాడుతుంటే నందూకు ఏమీ జరుగుతుందో అర్థం కాదు. దీంతో అసలు మేటర్ ఏంటో నేరుగా చెప్పమని నందూ కోరతాడు. అప్పుడు జీకే.. నందూకు తన కూతురు ఫొటోను సెండ్ చేస్తాడు. ఆ తర్వాత ‘పాయింట్‌కు వచ్చేస్తున్నా.. మా అమ్మాయి పేరు అక్షర. తను మీ అబ్బాయిని ప్రేమిస్తుంది. తననే పెళ్లి చేసుకుంటా అని అడిగింది. ఈ విషయాన్ని నేను ప్రేమ్‌తోనే మాట్లాడొచ్చు. కానీ, మనం పెద్దవాళ్లం కదా. ముందుగా మనమే మాట్లాడుకుంటే బాగుంటుంది. అందుకే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా' అంటూ వివరిస్తాడాయన.

  బ్రా ఒక్కటే ధరించి విష్ణుప్రియ రచ్చ: ఇంతకు ముందెన్నడూ చూడనంత ఘాటు ఫోజులతో!

  నందూకు జీకే ఊహించని ఆఫర్ ఇచ్చి

  నందూకు జీకే ఊహించని ఆఫర్ ఇచ్చి

  తన కూతురి ప్రేమ గురించి చెప్పిన జీకే.. ఆ తర్వాత నందూకు బిజినెస్ డీల్ గురించి చెబుతాడు. ‘మీరు ప్రేమ్‌ను ఒప్పించి పెళ్లి చేస్తే.. మీ కంపెనీకి పూర్వ వైభవం తీసుకువస్తా. సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యేలా చేస్తాను. పెళ్లి తర్వాత మా అల్లుడు కోటీశ్వరుడు అవుతాడు. అప్పుడు మీ హోదా కూడా పెరుగుతుంది. అంతేకాదు, అప్పుల వల్ల దివాళా తీసే ప్రమాదం కూడా లేకుండా చేస్తా' అని అంటాడు. దీంతో నందూ ఏదో చెప్తుండగా.. లాస్య మాత్రం ఒప్పుకుంటుంది. అప్పుడు జీకే ‘ప్రేమ్‌ను ఎలా ఒప్పిస్తారో.. పెళ్లికి ఎలా దారులు వేస్తారో అన్నది మీ చేతుల్లోనే ఉంది' అని వెళ్లిపోతాడు.

  తులసిలో డౌట్.. బాంబ్ పేల్చిన లాస్య

  తులసిలో డౌట్.. బాంబ్ పేల్చిన లాస్య

  తులసి ‘శృతితో కలిసి గుడికి వెళ్లాలనుకున్న ప్రేమ్.. సడన్‌గా ఆఫీస్‌కు ఎందుకు వెళ్లాడు? ఉదయం వెళ్లిన వాడు ఇంకా ఎందుకు రాలేదు? నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది' అని అనుకుంటుంది. అంతలో లాస్య అక్కడకు వచ్చి ‘నువ్వు అనుకున్నదే నిజం తులసి. నందూ.. ప్రేమ్‌కు ఒక పెళ్లి సంబంధం చూశాడు' అని బాంబ్ పేల్చేస్తుంది. అప్పుడు తులసి ‘నా కొడుకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో.. ఎవరిని చేసుకోవాలో వాడికి తెలుసు. మీరు చూడడం ఏంటి' అని ప్రశ్నిస్తుంది. దీంతో లాస్య ‘నందూ చూసింది కోటీశ్వరుల సంబంధం' అంటూ బదులిస్తుంది.

  కొత్తలో నరకం అనుభవించా.. దానివల్ల పిల్లలు కూడా పుట్టరని భయపడ్డా: రోజా సంచలన వ్యాఖ్యలు

  తులసిని బ్లాక్ మెయిల్ చేసిన లాస్య

  తులసిని బ్లాక్ మెయిల్ చేసిన లాస్య

  ప్రేమ్ పెళ్లి చేసుకుంటే కోటీశ్వరుడు అయిపోతాడు అంటూ లాస్య చెప్పగానే తులసి మాత్రం దాన్ని అంగీకరించదు. అంతేకాదు, ‘ప్రేమ్ కోటీశ్వరుడు అవడం పక్కన పెట్టు దీని వల్ల మీరెలా లాభపడుతున్నారు' అని లాస్యను ప్రశ్నిస్తుంది. అప్పుడామె ‘ఈ పెళ్లి అయితే మాక్కూడా లాభమే. మా బిజినెస్ డెవలప్ అవుతుంది. అలా కాదని ప్రేమ్ ఒప్పుకోకపోతే నందూ అప్పులపాలు అవుతాడు. అదే జరిగితే తను ఏమైపోతాడో.. ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుని ఇంట్లో వాళ్లందరినీ ఏడిపిస్తే పరిస్థితి ఏంటో చెప్పు' అంటూ తులసిని ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేస్తారు.

  అక్షరకు గుడ్ న్యూస్ చెప్పేసిన తండ్రి

  అక్షరకు గుడ్ న్యూస్ చెప్పేసిన తండ్రి

  నందూ మాట్లాడిన తర్వాత జీకే తన ఇంటికి వెళ్లిపోతాడు. అప్పుడు ఏం జరిగిందో అని ఆసక్తిగా ఉన్న అక్షర పరుగు పరుగున వచ్చి తన తండ్రితో ‘డాడ్ వచ్చేశారా? వెళ్లిన పని ఏమైంది? ప్రేమ్ వాళ్ల ఫాదర్‌తో మాట్లాడారా? దానికి ఆయన ఒప్పుకున్నారా?' అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. దీనికి ఆయన కామ్‌గానే ‘అంతా ఫేవర్‌గానే జరిగిందమ్మా' అని చెబుతాడు. అంతేకాదు, ప్రేమ్ ఫోన్ నెంబర్‌ను కూడా ఆమెకు ఇస్తాడు. దీంతో అక్షర సంతోష పడుతూ వెళ్లిపోతుంది. ఆ తర్వాత పీఏ నందూ గారు ఒప్పుకోలేదు కదా అనగా.. ఒప్పుకోక తప్పదు.. అలాంటి డీల్ ఇచ్చా అంటాడు జీకే.

  అనసూయకు నెలలు అంటూ అభి సంచలన వ్యాఖ్యలు: ప్రెగ్నెన్సీపై అందరి ముందే ఊహించని ఆన్సర్

  శృతిని అడ్డు తప్పించాలని లాస్య ప్లాన్

  శృతిని అడ్డు తప్పించాలని లాస్య ప్లాన్

  ప్రేమ్ పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడని ఇంటికి వచ్చిన తర్వాత లాస్య, నందూ ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమయంలో లాస్య ‘ప్రేమ్ ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడు అనేదే అసలు సమస్య. అతడు దీనికి ఒప్పుకోవాలంటే అడ్డుగా ఏది ఉందనేది మనం ఆలోచించాలి. ప్రేమ్ గతంలో శృతిని లవ్ చేశాడు. ఆ తర్వాత ఆమెకు పెళ్లై విడాకులు కూడా అయ్యాయి. ఇప్పుడు ఖాళీగానే ఉంటోంది. దీంతో ప్రేమ్ మళ్లీ ఆమె వెంట పడుతున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నాడు. సో.. శృతిని మనం అడ్డు తొలగిస్తే ప్రేమ్ ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు' అని నందూకు సలహాలు ఇస్తుంది.

  Kiran Abbavaram Birthday Special Interview | SR Kalyanamandapam | Sammathame
  పెళ్లైన అమ్మాయిని ఎలా చేసుకుంటాడు

  పెళ్లైన అమ్మాయిని ఎలా చేసుకుంటాడు

  లాస్య మాటలన్నీ విన్న తర్వాత నందూ కోపంతో ఊగిపోతాడు. ‘అదేంటి? పెళ్లై విడాకులు తీసుకున్న అమ్మాయిని ప్రేమ్ ప్రేమించడం ఏంటి? ఇది మన వాళ్లకు తెలిస్తే పరువు పోతుంది. అలా అస్సలు జరగనివ్వను. ప్రేమ్ ఎలాగైనా జీకే కూతురిని పెళ్లి చేసుకోవాల్సిందే. అందుకోసం ఎవరు అడ్డొచ్చినా ఊరుకోను. అక్షరను చేసుకుని వాడు కోటీశ్వరుడు అవ్వాలి. నేను నా బిజినెస్‌ను చక్కగా నడుపుకోవాలి. అలా కాదని వేరేగా ఏం జరిగినా నేను మాత్రం ఒప్పుకోను. ముందు ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పాలి' అని అంటాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 416: Akshara Father GK Gave Effective Offer to Nandhu. Then Lasya Provoke Nandhu for GK Deal. After That Lasya Told This to Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X