Intinti Gruhalakshmi: తులసి ప్రాణం కాపాడిన దివ్య.. శత్రువులకు బిగ్ షాక్.. అసలు మేటర్ తెలియడంతో!

ఈ మధ్య కాలంలో రకరకాల కాన్సెప్టులతో షోలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లక్కీని తీసుకుని తన ఇంటికి వచ్చేసిన లాస్యకు రాజ్యలక్ష్మి ఝలక్ ఇస్తుంది. అంతేకాదు, మర్యాదగా మాట్లాడమంటూ మండిపడుతుంది. దీంతో లాస్య అక్కడి నుంచి వెళ్లిపోగా.. మళ్లీ ఆమె కోసం వెళ్తుంది. మరోవైపు, లక్కీ వెళ్లిపోవడంతో నందూ వాళ్లు బాధ పడుతుంటారు. ఆ తర్వాత తులసి.. దివ్యతో వరలక్ష్మి వ్రతం చేయించాలని అనుకుంటుంది. అందుకోసం రాజ్యలక్ష్మికి ఫోన్ చేయగా.. లాస్య కోరిక మేరకు ఒప్పుకుంటుంది. అనంతరం ఆ వ్రతంలో తులసిని, దివ్యను విడదీసే ప్లాన్ ఉందని రాజ్యలక్ష్మికి లాస్య చెబుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 4th 2023

రాజ్యలక్ష్మి వెటకారం ఆడినా:దివ్యతో వ్రతం చేయించేందుకు తులసి వాళ్లు అందరూ రాజ్యలక్ష్మి ఇంటికి చేరుకుంటారు. అక్కడకు వెళ్లిన వెంటనే తులసి 'రాజ్యలక్ష్మి వెటకారపు మాటలతో రెచ్చగొడుతుంది. మనం రెచ్చిపోకూడదు. ప్రశాంతంగా వచ్చిన పని చూసుకుని వెళ్దాం' అని అంటుంది. దీనికి అందరూ ఓకే అంటారు. ఇంతలో రాజ్యలక్ష్మి వచ్చి 'రావడమే ఆలస్యంగా వచ్చారు.. ఇంకా ఇక్కడే నిలబడి కబుర్లు ఎందుకు లోపలికి రండి వదినా' అని అంటుంది. అప్పుడే లాస్య 'అలా కంగారు పెడతావు ఏంటి రాజ్యలక్ష్మీ.. కాస్త సెటిల్ అయ్యాక లోపలికి రండి' అని అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 4th 2023

మన మాజీ మొగుడే కొన్నాడా:తులసి మంచిగా రెడీ అయి రావడం చూసిన లాస్య 'చీర బాగుంది తులసీ.. మన మాజీ మొగుడు నందూ కొన్నాడా' అని అడుగుతుంది. లాస్య మాటలతో నందూకు కోపం వస్తుంది. కానీ, తులసి సైగలు చేయడంతో కామ్‌గా ఉండిపోతాడు. అప్పుడు అనసూయ మాత్రం 'ఏ చీర కొంటే తప్పేంటి' అని ప్రశ్నించగా.. లాస్య 'తప్పు అని అనలేదే. నాకూ ఒకటి కొనమందామని. ఎంతైనా నేనూ పెళ్లాన్నే కదా' అంటుంది. దీనికామె 'ఆ చీర పాతబడ్డాక నీకే ఇస్తుందిలే' అని పంచ్ వేస్తుంది. దీనికి లాస్య 'పాతబడిన చీరను నేనెందుకు తీసుకుంటాను' అంటుంది.

పాతబడిన నందూ కావాలా?:లాస్య మాటలకు అనసూయ 'నందూకు తులసి విడాకులు ఇచ్చిన తర్వాతే కదా.. నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నది. పాతబడిన నందూ పనికి వచ్చినప్పుడు.. పాత చీర పనికి రాదా ఏంటీ' అని సెటైర్ వేస్తుంది. దీనికి ప్రసన్న 'చీర బాగుందని అన్నందుకే ఇంత వెటకారమా' అని అనడంతో.. పరందామయ్య 'అది వెటకారం కాదు.. వాస్తవం' అని అంటాడు. ఆ తర్వాత లాస్య 'అయినా పూజ చేసేది దివ్య కదా.. నువ్వేంటి కొత్త చీర కట్టుకుని కొత్త పెళ్లి కూతురులా రెడీ అయ్యి వచ్చావు. ఎవరితో జంటగా పూజ చేసుకుందామని' అంటూ తులసిని ప్రశ్నిస్తుంది. దీంతో తులసి 'ఇది మన ఇల్లు కాదు. తర్వాత నీ దగ్గరకు వస్తాను. అప్పుడు గొడవ పడదాం' అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 4th 2023

లవ్ లెటర్‌కు పూజ చేసేలా:మాజీ భార్యలు గొడవ పడుతుండగా నందూ మాత్రం తులసికి ప్రపోజ్ చేయడానికి ప్రయత్నాలు సాగిస్తుంటాడు. ఇందుకోసం ఓ లవ్ లెటర్‌ను రాసి దానికి పూజ చేయమని పంతులుకు చెప్తాడు. అంతలోనే దాన్ని దివ్య లాక్కుని నందూను ఏడిపిస్తుంది. దీంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో నందూ 'మీ అమ్మను లైన్ పెట్టడానికి రాసిన లవ్ లెటర్. ఇది తనకు ఇవ్వడం నాకు పెద్ద రాకెట్ లాంఛింగ్ లాంటిది. అందుకే దేవుడి దగ్గర పెట్టి పూజ చేయిస్తున్నా' అని అంటాడు. ఇలాంటి విషయాల్లో అస్సలు ఆలస్యం చెయ్య కూడదు.. నేరుగా చెప్పేయండి అని తీసుకెళ్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 4th 2023

లెటర్‌ను తల్లికి ఇచ్చింది:నందూను తులసి దగ్గరకు తీసుకు వచ్చిన దివ్య 'నాన్న మీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు అమ్మా' అని అంటుంది. నందూ మాత్రం ఏమీ తెలియనట్లుగా ఉంటాడు. దీంతో తులసి 'ఏం చెప్పాలనుకుంటున్నారు? ఉదయం నుంచి ఇదే గోల. పూజ అయిన తర్వాత చెప్తానని అన్నారు కదా.. మళ్లీ దివ్యతో ఈ రికమండేషన్స్ ఏంటి నందగోపాల్ గారూ' అని అంటుంది. దీంతో దివ్య ఎందుకమ్మా అంత సీరియస్ అవుతావు అనగా.. తులసి 'అమ్మా తల్లీ నేను కూల్‌గానే అడుగుతున్నా. మీ నాన్న మనసులో మాట చెప్పకపోతే నేనేం చేస్తాను? నీ ముందే అడుగుతున్నా. మొహమాట పడకుండా మనసులో మాట చెప్పేయమను' అని అంటుంది. దీంతో కెఫే కొత్త కాంట్రాక్టు లెటర్ అని తులసికి అబద్దం చెప్తాడు. దీనికి పూజ చేయించాలని అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 4th 2023

ఆ కవర్‌లో ఏముంది లాస్య:అనంతరం దివ్య పూజలో కూర్చుంటుంది. అప్పుడు తులసి 'అమ్మా దివ్యా.. చేతిలో ఉన్న ఆ కవర్‌‌ను అమ్మ వారి పాదాల దగ్గర పెట్టమ్మా' అని చెప్తుంది. దీంతో పంతులు ఆ కవర్‌కు బొట్లు పెట్టి మరీ అమ్మవారి పాదాల దగ్గర పెడతాడు. అది చూసిన రాజ్యలక్ష్మి 'ఆ కవర్‌లో ఏముంది? ఎందుకు అమ్మవారి పాదాల దగ్గర పెట్టిస్తుంది' అని అడుగుతుంది. దీనికి లాస్య 'నాకూ అదే అర్ధం కావడం లేదు. విక్రమ్‌ను వెళ్లి అడగమను' అని అంటుంది. దీనికి రాజ్యలక్ష్మి 'వాడా? వాడు ఎప్పుడో దివ్యకి సరెండర్ అయిపోయాడు.. వాడు అడగడు' అని బదులిస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 4th 2023

లాస్య కుట్ర భగ్నం చేసి:ఆ తర్వాత దివ్య ఓ పాట పాడి పూజను పూర్తి చేస్తుంది. దీంతో అందరూ ఆమెకు ఆశీర్వాదం ఇచ్చి అక్షింతలు వేస్తారు. లాస్య కూడా అలా వెళ్లి దివ్యను ఆశీర్వదించడంతో పాటు తులసి చీర కొంగుకు ఏదో లిక్విడ్ రాస్తుంది. అనంతరం దివ్య, లాస్య కలిసి హారతి ఇస్తారు. ఆ సమయంలోనే తులసి చీరకు నిప్పును అంటించబోతుంది. కానీ, ఈ ప్లాన్ ముందే తెలుసుకున్న దివ్య అలా జరగకుండా ఆపుతుంది. దీంతో లాస్య ప్లాన్ భగ్నం అయిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X