Intinti Gruhalakshmi Today Episode: సామ్రాట్ షాకింగ్ డెసీషన్.. తులసి కోసం వెళ్లిన నందూ, లాస్య
భారతదేశంలో చాలా భాషల్లో వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. భూమి పూజ దగ్గర జరిగిన గొడవ తర్వాత సామ్రాట్, తులసి ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే తులసి.. సామ్రాట్‌కు బిజినెస్ పార్ట్‌నర్‌గా ఉండను అంటూ ఓ మెసేజ్ చేస్తుంది. అది చూసిన సామ్రాట్ కోపంతో రగిలిపోతాడు. అప్పుడు సామ్రాట్ బాబాయి తులసికి సపోర్ట్ చేస్తాడు. అనంతరం ప్రేమ్, శృతి సరదాగా గొడవ పడతారు. ఇక, చివర్లో తులసి.. నందూ ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో సామ్రాట్ దగ్గర తన మాజీ భర్త అని నిజం దాయమన్నది మీరే అని ఒప్పుకోవాలంటూ నందూను ఆమె రిక్వెస్ట్ చేస్తుంది.

బాబాయిపై ఫైర్ అయిన సామ్రాట్
తన కంపెనీలో పార్ట్‌నర్‌షిప్ వద్దని తులసి మెసేజ్ చేసినప్పటి నుంచి సామ్రాట్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే కంపెనీలోని తన ప్రోగ్రామ్‌లు మొత్తం వాయిదా వేస్తాడు. దీంతో వాళ్ల బాబాయి వచ్చి 'ఏరా.. ఈరోజు నీ ప్రోగ్రామ్స్ మొత్తం పోస్ట్‌పోన్ చేశావంట ఎందుకు' అని ప్రశ్నిస్తాడు. దీంతో సామ్రాట్‌కు కోపం వస్తుంది. అప్పుడతను 'నా కంపెనీ.. నా పనులు.. నేను ఏదైనా చేసుకుంటా. అయినా నాతో పార్ట్‌నర్‌షిప్ వద్దని వెళ్లిపోయిన వాళ్లను ప్రశ్నించరు. కారణం లేకుండా గొడవ పెట్టుకున్నవాళ్లను అడగరు. నన్ను అడుగుతావా' అని బాబాయిని తిడతాడు.

నందూ, లాస్య వల్ల మరింత హీట్
వాళ్లిద్దరి మధ్య వాదన జరుగుతోన్న సమయంలోనే నందూ, లాస్య అక్కడకు వస్తారు. అప్పుడు నందూ కామ్‌గా ఉండడంతో 'ఏంటి నందూ... సామ్రాట్ గారికి సారీ చెప్తా అని వచ్చావు కదా. మరి ఇప్పుడు సైలెంట్‌గా ఉంటావేంటి? ఆయన ఏమంటారో అని భయంగా ఉందా' అని లాస్య అంటుంది. అప్పుడు నందూ మాట్లాడతాడు. ఆ తర్వాత 'తులసి మీకు నేను మాజీ భర్త అన్న సంగతి చెప్పలేదు అన్న విషయం మాకు తెలియదు సార్. తనవల్లే నేను మీకు ఈ నిజం చెప్పకుండా ఉండిపోయాను. ఈ విషయంలో తప్పు మొత్తం తులసిదే సార్' అని ఆమెపై నిందలు వేస్తారు.

లాస్య, నందూకు సామ్రాట్ ఝలక్
నందూ, లాస్య మాటలకు సామ్రాట్‌తో కోపం మరింతగా పెరుగుతుంది. అప్పుడు ఆయన 'కనీసం నాతో ఫోన్లో కూడా మాట్లాడకుండా మెసేజ్ పెట్టింది. అసలు తనే ఏమనుకుంటుంది. నేను టేకప్ చేసిన ప్రాజెక్ట్‌ను పట్టాలు ఎక్కకుండా పోయిందంటే దానికి కారణం తులసి. మీరే నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయట పడేయాలి' అని నందూ, లాస్యతో అంటాడు. దీంతో వాళ్లిద్దరూ సామ్రాట్ తమ బుట్టలో పడ్డాడని అనుకుంటారు. ఆ వెంటనే ఏం చేయాలో చెప్పమని అడుగుతారు. దీంతో సామ్రాట్ 'మీరే ఏదైనా చేసి తులసిని తీసుకొచ్చి నా ప్రాజెక్టులో జాయిన్ చేపించాలి. మీ వల్లే గొడవ వచ్చింది. మీరే దీన్ని సాల్వ్ చేయాలి' అని వాళ్ళిద్దరికీ ఝలక్ ఇస్తాడు. దీంతో నందూ, లాస్య అక్కడ నుంచి వెళ్లిపోతారు.

తులసి కోసం నందూ, లాస్య రాక
సామ్రాట్ ఆడ్రర్ వేయడంతో లాస్య, నందూ దీని గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు నందూ 'తులసి ఇంటికి వస్తే చీపో అన్నాను. ఇప్పుడు తన దగ్గరికి వెళ్లి తీసుకురావాలి' అని అంటాడు. దీంతో లాస్య 'అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునేలా చేయాలి' అని ఒక పెద్ద ప్లాన్‌ను నందూకు చెప్తుంది. అప్పుడు సరే అని నందూ, లాస్యలు తులసి దగ్గరికి వస్తారు. మొదటిగా వాళ్లు అనసూయతో మాట్లాడతారు. కానీ, ఆమె మాత్రం లాస్యను తిట్టి వెళ్లిపోతుంది. ఆ తర్వాత పరందామయ్య దగ్గరకు వెళ్లగా ఆయన ఫోన్ మాట్లాడుతూ వీళ్లను పట్టించుకోడు. దీంతో నందూ గట్టిగా అరుస్తాడు. దీంతో పరందామయ్య ఏదైనా ఉంటే తులసితో మాట్లాడుకోండి అని చెప్తాడు.

తులసికి ఆ విషయం చెప్పడంతో
ఇక, చేసేదేం లేక నందూ, లాస్య కలిసి తులసి దగ్గరికి వెళ్తారు. అప్పుడు తులసి 'మీ పిల్లల దగ్గరికి కదా వచ్చింది వాళ్ళు లోపల ఉన్నారు వెళ్లి మాట్లాడుకోండి' అని అంటుంది. అప్పుడు లాస్య 'మేము వచ్చింది పిల్లల కోసం కాదు.. నీకోసమే' అని అంటుంది. దీంతో అందరూ బయటికి వస్తారు. అప్పుడు లాస్య ఎన్ని డ్రామాలను ఆడైనా తులసి నీ ఎలాగైనా తీసుకెళ్లాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్ సెటైర్ వేయడంతో ఆమె షాక్ అవుతుంది. తర్వాత నందూ 'నేను వచ్చింది నీ ప్రాజెక్టు మాట్లాడడానికే. నేను సామ్రాట్ దగ్గరికి వెళ్లి మాట్లాడాను.. ఆయన నిన్ను రమ్మన్నారు' అని చెబుతాడు.

తేల్చి చెప్పిన తులసి.. వాళ్లు అలా
నందూ, లాస్య తనను సామ్రాట్ దగ్గరకు రమ్మని అడగడంతో తులసి 'ఇప్పుడు నేను చెప్పింది చేయండి. అప్పుడు నేను వస్తాను. మీరు వెళ్లి సామ్రాట్ గారికి మీరు నా మాజీ భర్త అని చెప్పకుండా ఉండడానికి కారణం నేనేనని ఒప్పుకోండి. అలా చెప్తే నేను వస్తాను' అని గట్టిగా చెప్తుంది. అప్పుడు అభి నందూతో 'మమ్మీ ప్రాజెక్ట్ వదిలేసింది. మళ్లీ మీరు ఎందుకు రమ్మని అడుగుతున్నారు' అని అంటాడు. ఇక, తులసి మొత్తానికి 'నాకు ఆత్మ అభిమానం ఉంది దానిని చంపుకొని నేను సామ్రాట్ దగ్గరికి రాలేను' అని అంటుంది. దీంతో వాళ్లిద్దరూ తిరిగి వెళ్లిపోతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











