For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi September 6th Episode: శృతితో నిజం చెప్పిన అక్షర.. జీకేకు అలా చెప్పిన నందూ

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అక్షర తండ్రి జీకే.. నందూకు ఆఫీస్‌కు వస్తాడు. ఆ సమయంలో ఆయనకు ఊహించని ఆఫర్ ఇస్తాడు. దీంతో లాస్య దీనికి ఒప్పుకుని నందూను రెచ్చగొట్టింది. ఆ తర్వాత ఈ విషయాన్ని లాస్య, తులసికి కూడా చెప్పి బ్లాక్ మెయిల్ చేసింది. అనంతరం అక్షరకు తండ్రి ఈ విషయం చెప్పడంతో పాటు ప్రేమ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాడు. ఇక, లాస్య.. ప్రేమ్ మాత్రం శృతిని ప్రేమిస్తున్నాడని చెబుతుంది. అప్పుడు నందూ ప్రేమ్‌పై ఫైర్ అవుతాడు. ఎలాగైనా శృతిని అడ్డు తొలగించి ప్రేమ్‌ను అక్షరతో కలపాలని నందూ డిసైడ్ అయిపోతాడు.

  బ్రా ఒక్కటే ధరించి విష్ణుప్రియ రచ్చ: ఇంతకు ముందెన్నడూ చూడనంత ఘాటు ఫోజులతో!

  ప్రేమ్‌కు అక్షర ఫోన్.. శృతి రావడంతో

  ప్రేమ్‌కు అక్షర ఫోన్.. శృతి రావడంతో

  ప్రేమ్ బొమ్మను చూస్తూ అక్షర మురిసిపోతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. అతడి పెయింటింగ్‌తో మాట్లాడుతూ.. ‘నీ గొంతు వినాలనిపిస్తుంది' అంటూ ఫోన్ చేస్తుంది. చాలా సేపటికి కాల్ లిఫ్ట్ చేసిన ప్రేమ్ హలో హలో అన్నా అక్షర మాత్రం మాట్లాడదు. అప్పుడామె ‘వామ్మో ప్రేమ్.. నీ గొంతు వినగానే నా నోటి నుంచి మాట రావడం లేదు. ఎప్పటికీ నీతోనే ఉంటే ఎలా ఉంటుందో' అనుకుని మళ్లీ కాల్ చేస్తుంది. అప్పుడు అతడు తిట్టి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత శృతి వచ్చి అడగగా విషయం చెబుతాడు. అప్పుడామె ఇంట్లో సామాన్లు తేడానికి వెళ్లాలి అని చెప్తుంది.

  అక్షరతో ఫోన్‌లో గొడవకు దిగిన శృతి

  అక్షరతో ఫోన్‌లో గొడవకు దిగిన శృతి

  శృతిని, ప్రేమ్‌ను తులసి ఇంట్లో సమాన్లు తీసుకు రమ్మని చెబుతుంది. ఈ విషయం చెప్పగానే ప్రేమ్ రెడీ అవడానికి వెళ్తాడు. అప్పుడు అక్షర మళ్లీ ఫోన్ చేయగా.. శృతి ఆ కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఆ సమయంలో వాళ్లిద్దరికీ తీవ్ర స్థాయిలో గొడవ జరుగుతుంది. అప్పుడు అక్షర ‘అసలు ఎవరు నువ్వు ఇంత పొగరుగా మాట్లాడుతున్నావ్? అక్కడ ఉంటే నీ అంతు చూసేదాన్ని' అని అంటుంది. అప్పుడు శృతి ‘నీ లాంటి వాళ్లకు ఈ ఇంట్లో స్థానం ఉండదు. మేనర్స్ నేర్చుకో' అని బదులిస్తుంది. దీనికి అక్షర ‘నేను ఆ ఇంటికి కాబోయే కోడలిని. ప్రేమ్‌కు కాబోయే భార్య'ను అని ఫోన్ పెట్టేస్తుంది.

  అషు రెడ్డి ప్రైవేటు పార్ట్‌ను చూపించిన ఆర్జీవీ: పవన్ కల్యాణ్‌ కోసం ఆమెను బుక్ చేసేశాడుగా!

  ప్రేమ్‌కు అక్షర గురించి చెప్పిన నందూ

  ప్రేమ్‌కు అక్షర గురించి చెప్పిన నందూ

  శృతితో కలిసి ప్రేమ్ బయటకు వెళ్తుండగా.. నందూ అతడిని ఆపుతాడు. అప్పుడు ‘నీతో ఒక విషయం మాట్లాడాలి' అని అంటాడు. దీనికి అతడు ఒప్పుకోకపోవడంతో తులసి వచ్చి అతడికి సర్ధి చెబుతుంది. ఆ తర్వాత నందూ ఇంట్లో వాళ్లు అందరినీ కూర్చోబెట్టి ‘జీకే కంపెనీ అధినేత జీకే గారు నన్ను కలిశారు. వాళ్ల అమ్మాయి ప్రేమ్‌ను ఏదో ఈవెంట్‌లో చూసిందట. వీడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందట' అని చెబుతాడు. దీంతో ప్రేమ్ తండ్రిపై ఫైర్ అవుతాడు. ‘ఎవరో నన్ను చూడడం ఏంటి? పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి? నాకు ఇది ఇష్టం లేదు' అని ముఖంపై చెప్పేస్తాడు.

  పెళ్లి విషయంలో తండ్రి షాకిచ్చిన ప్రేమ్

  పెళ్లి విషయంలో తండ్రి షాకిచ్చిన ప్రేమ్

  ప్రేమ్ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పగానే అంకిత, అభి అతడిని తప్పుబడతారు. ఆ సమయంలో పరందామయ్య ‘ఏంట్రా నందూ నీ కొడుకు గురించి ఆలోచించడం ఎప్పుడు మొదలెట్టావు' అని అడుగుతాడు. దీంతో అనసూయ అతడిని తిడుతుంది. ఆ తర్వాత నందూ పెళ్లి గురించి ప్రేమ్‌ను సూటిగా ప్రశ్నించగా.. ‘నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకు అంటే దాని వెనుక బలమైన కారణం ఉంది' అని షాకిస్తాడు. అప్పుడు నందూ ఆ కారణమేంటని ప్రశ్నించగా.. ప్రేమ్ మాత్రం అది చెప్పడు. అంతలో లాస్య కూడా ప్రేమ్‌ను పెళ్లికి ఒప్పుకోమని ఇబ్బంది పెడుతుంది.

  Bigg Boss Telugu 5 Nominations: ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో ఆరుగురు.. టైటిల్ ఫేవరెట్‌ కూడా నామినేట్

  కారణం చెప్తానన్న ప్రేమ్.. తులసి అడ్డు

  కారణం చెప్తానన్న ప్రేమ్.. తులసి అడ్డు

  నందూ గుచ్చి గుచ్చి అడుగుతుండడంతో ప్రేమ్ ఓ రేంజ్‌లో కోప్పడతాడు. అంతేకాదు, ‘మీకు కారణమే కదా కావాల్సింది. అది చెప్తాను ఉండండి' అంటాడు. అంతలో శృతి గురించి చెప్తాడేమో అని భయపడిన తులసి.. ‘ప్రేమ్ ఆగరా.. నిన్ను పెళ్లి చేసుకోమని అడిగారని ఇప్పుడే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆలోచించుకుని చెప్పు. బలవంతంగా అడిగినప్పుడు చెప్పే సమాధానాలు అనర్థాలకు దారి తీస్తాయి' అని అంటుంది. దీంతో ప్రేమ్ ‘అవును.. నాకు కొంచెం టైమ్ కావాలి. ఇప్పుడేమీ చెప్పను' అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు.

  తులసిపై నిందలు.. సైలెంట్‌గా ఉంటూ

  తులసిపై నిందలు.. సైలెంట్‌గా ఉంటూ

  పెళ్లి గురించి చెప్పడానికి ప్రేమ్ కొంత సమయం కావాలని చెప్పి వెళ్లిపోవడంతో నందూ ‘వాడిని ఆలోచించుకోమని చెప్పినట్లు లేదు. పెళ్లి వద్దని చెప్పడానికి బలమైన కారణం వెతుక్కోమని సలహా ఇచ్చినట్లు ఉంది. అసలు ఇక్కడ మంచి చేయాలనుకున్నా అడ్డు పడే వాళ్లే ఉన్నారు' అని తులసిపై నిందలు వేస్తాడు. ఆ తర్వాత అనసూయ కూడా కొడుకుకు వత్తాసు పలుకుతూ తులసిని పరోక్షంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ తిడుతుంటుంది. వాళ్లంతా ఎన్నో మాటలు అంటున్నా తులసి మాత్రం సైలెంట్‌గానే ఉండిపోతుంది. ఆ తర్వాత నందూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

  Bigg Boss Telugu 5: ఆదిలోనే యాంకర్ రవికి షాక్.. అతడికే ఎక్కువ మద్దతు.. లేడీస్‌లో ఆమెకు!

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  లాస్య, నందూ మధ్య మాటల యుద్ధం

  లాస్య, నందూ మధ్య మాటల యుద్ధం

  ప్రేమ్ వెళ్లిపోగానే నందూ కోపంగా వచ్చేస్తాడు. ఆ సమయంలో లాస్య వచ్చి ‘నువ్వు ఇలా అందరినీ పిలిచి అడగడం చేస్తే మనకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ఈ విషయం నీకు ఎప్పుడో చెప్పాను' అని అంటుంది. దీనికి కోప్పడిన నందూ, లాస్యపై ఫైర్ అవుతాడు. అంతలో జీకే ఫోన్ చేయగా ‘పెళ్లి అనే సరికి ప్రేమ్ టైమ్ అడిగాడు. వాడికి నా మాట అంటే గౌరవం. రెండు రోజుల్లో ఒప్పుకుంటాడు' అని చెప్తాడు నందూ. దీంతో శుభవార్త కోసం వేచి చూస్తానని ఆయన బదులిస్తాడు. ఆ తర్వాత లాస్య, నందూ గొడవ పడతారు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 417: Akshara Did Phone Call to Prem. That Time Shruthi Lift That Call. Then Akshara And Shruthi Change Words. After That Nandhu Told Marriage Proposal to Prem.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X