Intinti Gruhalakshmi: తులసికి లవ్ లెటర్ ఇచ్చి నందూ.. సామ్రాట్ మరణంతో ట్విస్ట్.. గుండెలు పిండేశారు!

భారత్‌లోని మిగిలిన భాషల కంటే.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే:మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి చీరకు లిక్విడ్ రాసి నిప్పు అంటించాలని లాస్య ప్లాన్ చేసిందని దివ్య ఆరోపిస్తుంది. అప్పుడు లాస్య ఏడుస్తూ యాక్టింగ్ చేయడంతో విక్రమ్ అదే నిజం అనుకుంటాడు. దీంతో లాస్య దొరికిపోకముందే అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. అంతలోనే తులసి ఆమెను ఆపి చీరను లాగుతుంది. దీంతో కొంగు చాటున దాచిన లిక్విడ్ బాటిల్ కింద పడిపోతుంది. దీంతో రాజ్యలక్ష్మి, బసవయ్య.. లాస్యపై ఫైర్ అవుతారు. ఆ తర్వాత విక్రమ్ కూడా ఆమెను తిట్టడంతో పాటు పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటూ చెలరేగిపోతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 6th 2023

లెటర్‌ను తీసుకున్న తులసి:దివ్య ఇంట్లో జరిగిన గొడవ తర్వాత ఇంటికి వచ్చిన తులసి 'మీ అబ్బాయి నాకు తెలియకుండా కెఫేకు ఓ కాంట్రాక్టును ఓకే చేశారట. దీనికి సంబంధించిన అగ్రిమెంట్‌నే ఆయన దివ్య వాళ్ల ఇంట్లో జరిగిన పూజలో దేవుడి పాదాల దగ్గర పెట్టించారు. ఆ తర్వాత నాకు ఇస్తా అన్నారు. ఇంకా ఇవడం లేదు' అని అత్తమామలకు చెప్తుంది. అప్పుడు వాళ్లు అది లవ్ లెటరే అని తెలుసుకుని 'ఇప్పటికైనా తులసికి ఇచ్చేయరా. అందులో ఏముందో తెలుసుకోనివ్వు' అని అంటారు. దీంతో నందూ భయం భయంగానే దాన్ని తులసి చేతికి అందిస్తాడు.

ఫ్లైట్ యాక్సిడెంట్ న్యూస్‌తో:నందూ లెటర్ ఇవ్వడానికి ముందే అతడి చేతిలో ఉన్న న్యూస్ పేపర్‌ను తులసికి అందిస్తాడు. లెటర్‌ను తులసి చదవడం మొదలు పెట్టే ముందే ఆ వార్త పత్రికలో ఉన్న ఒక ఆర్టికల్ ఆమె కంటపడుతుంది. అది చూసి షాకైపోయిన తులసి.. 'మామయ్యా.. మామయ్యా' అంటూ గట్టిగా అరుస్తుంది. దీంతో పరందామయ్య వచ్చి ఆ పేపర్ చూస్తాడు. ఆ తర్వాత నందూ కూడా చూస్తాడు. అందులో ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందని, కొందరు చనిపోయారని ఉంటుంది. వారిలో సామ్రాట్ పేరు కూడా కనిపిస్తుంది. దీంతో పరందామయ్య అది మన సామ్రాట్ కాదనుకుంటా అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 6th 2023

టీవీలో చూసి పడిపోయింది:పేపర్‌లో సామ్రాట్ పేరు చూసి తులసి కంగారు పడుతుండగా.. నందూ టీవీ ఆన్ చేసి న్యూస్ చానెల్ పెడతాడు. అందులో చనిపోయింది నిజంగానే సామ్రాట్ అన్న విషయం తెలుస్తుంది. దీంతో తులసి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. షాక్‌లో పడిపోయిన తులసి కాసేపటికి తేరుకుంటుంది. అప్పుడు 'తొందరగా మనం సామ్రాట్ గారి దగ్గరకు వెళ్లాలి' అంటూ నందూను తీసుకుని బయలుదేరుతుంది. తర్వాత పరంధామయ్య, అనసూయలు కూడా ఇంత చిన్న వయసులో ఇలా జరగడం ఏంటి అనుకుంటూ భోరు భోరున ఏడుస్తుంటారు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 6th 2023

డాడీ దేవుడు దగ్గరకెళ్లాడా?:నందూ, తులసి రాగానే సామ్రాట్ ఇంట్లో అతడి ఫొటోకు దండ వేసి ఉంటుంది. అప్పుడు హనీ (కొత్త పాపను మార్చారు) తన తండ్రి ఫొటో దగ్గర వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. తులసి వచ్చింది చూసిన హనీ వెళ్లి ఆమెను హత్తుకుంటుంది. తర్వాత నందూ, తులసి కలిసి సామ్రాట్ ఫొటో దగ్గర నివాళి అర్పిస్తారు. అనంతరం హనీ 'ఆంటీ డాడీ ఫొటోకు దండం ఎందుకు వేశారు? తాతయ్యను అడిగితే దేవుడు దగ్గరకు వెళ్లాడని చెప్తున్నాడు. నిజమేనా ఆంటీ' అని అడుగుతుంది. దీనికి తులసి 'అవునమ్మా.. డాడీ దేవుడు దగ్గరకే వెళ్లారు' అని చెబుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 6th 2023

డాడీని చూపుంచు ఆంటీ:తులసి ఆ మాట చెప్పగానే హనీ 'మరి డాడీ నాతో అమెరికా వెళ్తున్నానని చెప్పారు ఏంటి ఆంటీ? వారంలో తిరిగి వస్తానని అన్నారు. మళ్లీ ఎప్పుడు వస్తారు? తాతయ్య అబద్దం చెప్తున్నారా? డాడీ అబద్దం చెప్పారా? డాడీ ఫోన్ కూడా పనిచేయడం లేదు. తాతయ్య మాటలు నాకేం అర్ధం కావడంలేదు. నువ్వైనా చెప్పు ఆంటీ. ఒక్కసారి డాడీతో మాట్లాడించవా.. డాడీని చూడాలని ఉంది. ప్లీజ్ ఆంటీ' అని ఏడుస్తుంది. అది చూసిన ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లేలా ఆ చిన్నారి నటించింది. ఇక, హనీ మాటలకు తులసి ఏమీ చెప్పకుండానే తనలో తాను కుమిలిపోతూ ఉంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 6th 2023

హనీ అలా.. బాబాయి ఇలా:సామ్రాట్ గురించి ఎంత చెప్పినా హనీ మాత్రం డాడీ కావాలి అంటూ ఏడుస్తూనే ఉంటుంది. దీంతో తులసి ఎలాగోలా ఓదార్చడంతో పాటు అన్నం కూడా తినిపిస్తుంది. తర్వాత సామ్రాట్ బాబాయి వచ్చి 'ఆ దేవుడు దర్మార్గుడమ్మా.. చివరికి సామ్రాట్ ఆఖరి చూపు కూడా దక్కకుండా వాడ్ని బూడిద చేశాడమ్మా. నా చివరి రోజుల్లో సామ్రాట్ అండగా ఉంటాడని అనుకున్నా. కానీ, వాడే నాకు పెద్ద బాధ్యతను వదిలి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ బరువైన బాధ్యతను నేను ఎలా మోయాలి' అంటూ ఏడుస్తాడు. దీంతో నందూ, తులసి ఆయనను ఓదార్చుతారు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 6th 2023

సామ్రాట్‌తో తులసి పెళ్లి:సామ్రాట్ మరణ వార్త తెలిసిన తర్వాత అనసూయ 'సామ్రాట్ ఎంతో మంచోడు. చెల్లెలి కూతుర్ని తన సొంత కూతురిగా పెంచుతూ జీవితాన్ని త్యాగం చేశాడు. మంచి మర్యాద తెలిసిన వాడు. కేవలం తులసికి మాత్రమే కాకుండా ఎంతో మంది సాయం చేశాడు. అలాంటి వాడ్ని ఆ దేవుడు అర్ధాంతరంగా తీసుకుని పోయాడు' అని ఏడుస్తుంది. దీంతో పరందామయ్య 'అన్నీ మనం అనుకున్నట్టు అయితే అది జీవితం ఎలా అవుతుంది' అంటాడు. దీనికామె ఒకప్పుడు సామ్రాట్‌ను తులసికి ఇచ్చి పెళ్లి చేస్తే.. తన ఒంటరి జీవితానికి తోడు దొరుకుతుందని అనుకున్నాం. కానీ అలా జరగకుండా ఆ దేవుడు ఎందుకు అడ్డుపడ్డాడో ఇప్పుడు తెలుస్తుంది' అని అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X