Intinti Gruhalakshmi: విక్రమ్ కోసం మరో హీరోయిన్.. నందూ ఊహించని నిర్ణయం.. తులసి పరిస్థితి దారుణం
జనరేషన్లు మారుతున్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసికి తన చేతిలో ఉన్న లవ్ లెటర్‌ను నందూ అందిస్తాడు. అప్పుడామె దాన్ని చదువుతుండగా సామ్రాట్ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు ఓ న్యూస్ కనిపిస్తుంది. అది చూసిన తులసి గుండె పగిలేలా ఏడుస్తుంది. తర్వాత టీవీలో న్యూస్ చూడగా.. అందులోనూ ఇదే చూపిస్తారు. దీంతో వెంటనే నందూ, తులసి కలిసి సామ్రాట్ ఇంటికి వెళ్తారు. అక్కడ హనీ తన తండ్రి కావాలని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ వాళ్ల బాబాయి కూడా బాధ పడతాడు. వాళ్లను తులసి, నందూ ఓదార్చే ప్రయత్నాలు చేస్తుంటారు.

లాస్య గురించి రెచ్చగొడుతూ:తమ ప్లాన్‌ను చెడగొట్టడం.. లాస్యను ఇంట్లో నుంచి గెంటేయడం గురించి తలచుకుంటూ రాజ్యలక్ష్మి రగిలిపోతుంటుంది. అప్పుడే బసవయ్య అక్కడకు వచ్చి 'ఏంటక్కా మన పరిస్థితి? రోజు రోజుకూ దివ్య ఇలా చెలరేగిపోతుంది ఏంటి' అంటాడు. అప్పుడు దివ్య డామినేషన్ ఎక్కువ అయిపోయిందని మాట్లాడుకుంటుంటారు. అంతలోనే దివ్య కూడా వచ్చి 'ఏంటి బాధపడుతున్నారు' అంటూ వెంటకారంగా మాట్లాడుతుంది. అప్పుడే విక్రమ్ కూడా రావడంతో.. దివ్య 'విక్రమ్.. మీ అమ్మ గారు లాస్య చేసిన మోసానికి చాలా బాధపడుతున్నారు' అంటుంది.

స్టేషన్‌కెళ్లడం ఇష్టం లేదని:దివ్య మాటలకు బసవయ్య 'అవును విక్రమ్.. మీ అమ్మ తెగ బాధపడుతోంది. ఇంత మోసం చేసిన లాస్యను పోలీసులకు అప్పగించలేకపోయామని అక్కయ్య తెగ అల్లాడిపోతుంది' అంటాడు. అప్పుడే విక్రమ్ తండ్రి 'ఇప్పుడు మాత్రం పోయింది ఏముంది? కేసు పెడితే సరిపోతుంది కదా' అని రాజ్యలక్ష్మికే షాకిస్తాడు. దీంతో కేసు పెడితే నేను బుక్కైపోతా అని రాజ్యలక్ష్మి మనసులో అనుకుంటుంది. అప్పుడు బసవయ్య 'కేసు పెట్టాలనే అనుకున్నా.. ఇంటి పరువు పోతుందని విక్రమ్ అన్న మాటతో అక్కయ్య వద్దనుకుంది' అంటాడు. దీనికి విక్రమ్ కూడా ఒప్పుకుంటాడు.
తులసి బాధ.. లెటర్ చించి:సామ్రాట్ ఇంటి నుంచి వచ్చిన తర్వాత తులసి ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడు పరందామయ్య, అనసూయతో తనలోని బాధను చెప్పుకుంటుంది. దీంతో వాళ్లిద్దరూ తులసిని ఓదార్చుతారు. ఆ తర్వాత తులసి ఇంట్లోకి వెళ్లిపోగానే.. నందూ తన తండ్రి చేతిలో ఉన్న లవ్ లెటర్‌ను తీసుకుని చించేస్తాడు. దీంతో పరందామయ్య వాళ్లు ప్రశ్నించగా.. 'తులసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా చేయడం వేస్ట్ నాన్న. నేను అప్పుడు తెలియకుండా తప్పు చేశాను. ఇప్పుడు మంచి చేద్దామన్నా దేవుడు అడ్డు పడుతున్నాడు. కాబట్టే ఇలా చేయాల్సి వచ్చింది' అని చెబుతాడు.

తనను మార్చాలింది నువ్వే:తులసి పరిస్థితి గురించి నందూ దిగులు పడుతూ ఉండగా పరందామయ్య వాళ్లు ఓదార్చుతారు. అంతేకాదు, అతడి తండ్రి 'అరెయ్ నందూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తులసిని అలా వదిలేయకూడదు. తనను ఎలాగైనా మార్చాలి. అందుకు నువ్వే ముందుకు రావాలి. నీ పనులతో తులసిని మార్చాల్సిన బాధ్యత నీపై ఉంది. ఎలాగైనా తనను మనిషిని చేయరా' అని చెబుతాడు. దీనికి నందూ సరే అంటాడు. ఆ తర్వాత తులసిని సామ్రాట్ మరణం నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు ఏం చేయాలా అని ఆలోచనలో పడిపోతాడు.

ప్రియను కూడా రమ్మంటూ:రాజ్యలక్ష్మి ఇంట్లో వాళ్లందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని అన్నం తింటూ ఉంటారు. అప్పుడు దివ్య 'ప్రియా ఆగు.. నువ్వు వడ్డించకు. ముందు అవన్నీ పక్కన పెట్టేసేయ్' అంటుంది. దీనికామె 'ఎందుకక్కా? ఏమైనా తప్పు జరిగిందా' అని అడగ్గా.. 'కాదు.. నువ్వు కూడా మాతో పాటు ఇక్కడ కూర్చుని తిందువు గానీ' అంటుంది. దీంతో ప్రియ భయంతో రాజ్యలక్ష్మి వైపు చూడగా.. 'ఏం పర్లేదు. అత్తయ్య గారు రాక్షసి ఏం కాదు' అంటుంది. దీంతో విక్రమ్, రాజ్యలక్ష్మి కూడా రమ్మని పిలుస్తారు. కానీ, ప్రియ మాత్రం సంజయ్‌తో కలిసి తింటానని చెబుతుంది.
విక్రమ్ కోసం మరో బ్యూటీ:దివ్య రోజు రోజుకూ తమను డామినేట్ చేయడాన్ని తట్టుకోలేకపోతున్న రాజ్యలక్ష్మి బ్యాచ్.. దీనికి పరిష్కారం చూడాలని అనుకుంటుంది. అప్పుడు ప్రసన్న 'చూడు వదినా విక్రమ్‌ను దివ్య తన కొంగుకి కట్టేసుకున్నట్లే. దివ్య ఏం చెప్పినా ఏం చేసినా తలూపుతున్నాడు' అంటుంది. అప్పుడు బసవయ్య 'విక్రమ్ మనసు మార్చాలంటే దివ్య స్థానంలోకి మరో ఆడది రావాల్సిందే.. వేరే మార్గమే లేదు. ఒక ఆడదాని నుంచి మగాడిని దూరం చెయ్యాలంటే ఇంకో ఆడదాన్ని ఎరవెయ్యాల్సిందే' అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి 'మీరు ఆలోచనలో ఉన్నారు, నేను ఆల్ రెడీ ప్లాన్ చేసేశాను.. సవతిని ఫిక్స్ చేసేశాను. మీ కూతురే జాహ్నవి. తనని వెంటనే తిరిగి పిలిపిస్తా. తనకు విక్రమ్ అంటే ప్రాణం' అంటుంది. దీంతో బసవయ్య వాళ్లు తెగ సంతోషిస్తారు.

తులసికి తినిపించాలని:సామ్రాట్ గుర్తులను తలచుకుంటూ తులసి బాధ పడుతూ ఉంటుంది. అప్పుడు అనసూయ వెళ్లి అన్నం తినడానికి రమ్మని అడుగుతుంది. కానీ, ఆమె మాత్రం వద్దని చెబుతుంది. ఆ విషయం అనసూయ వచ్చి చెప్పగానే నందూ అన్నం తినిపిస్తానని అంటాడు. అప్పుడు వాళ్లు 'నువ్వు నిజంగా తులసికి అన్నం తినిపిస్తే.. తను నీకు దక్కుతుంది' అంటారు. అప్పుడు నందూ ఫుడ్ తీసుకుని తులసి దగ్గరకు వెళ్తాడు. కానీ, ఆమె మాత్రం తినను అని చెబుతుంది. దీంతో తులసిని నందూ బ్రతిమాలుతుంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











