For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi September 8th Episode: తులసికి జీకే సహాయం.. శృతి పెళ్లికి నందూ గ్రీన్ సిగ్నల్

  |

  ఇండియాలో చాలా భాషలకు సంబంధించిన టెలివిజన్ ఇండస్ట్రీలు ఉన్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతి మనసులో ఏముందో తెలియకుండా అందరి ముందు తన గురించి చెబితే ఏమవుతుందో అని ఆపినట్లు ప్రేమ్‌కు అసలు విషయాన్ని చెబుతుంది తులసి. ఆ తర్వాత భాగ్య, లాస్య కలిసి ఈ పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. అదే సమయంలో శృతి, ప్రేమ్‌ను విడగొట్టడానికి ప్లాన్లు చేసుకుంటారు. ఆ తర్వాత కరెంట్ ఆఫీస్‌కు వెళ్లిన తులసికి ఆ ఆఫీసర్ సహాయం చేయలేనని చెబుతాడు. ఆ తర్వాత అతడు గిరిధర్‌తో మాట్లాడుతుండగా.. వీడియో తీసిన తులసి వాళ్లకే షాకిస్తుంది. అక్కడ జరిగేదంతా జీకే పక్కనే ఉండి గమనిస్తుంటాడు.

  Bigg Boss Telugu 5: ఆమెను టార్గెట్ చేసిన అభిజీత్ ఫ్యాన్స్.. ఆ వీడియోలు షేర్ చేసి మరీ దారుణంగా!

   తులసికి పరోక్షంగా సహాయం చేసిన జీకే

  తులసికి పరోక్షంగా సహాయం చేసిన జీకే

  విద్యుత్ శాఖ అధికారులు చేసిన మోసాన్ని వీడియో తీసిన తులసి.. దాన్ని టీవీ ఛానెళ్లకు ఇస్తానని వార్నింగ్ ఇస్తుంది. దీంతో వాళ్లు వెనక్కి తగ్గి కరెంట్ ఇస్తామని చెబుతారు. అదంతా అక్కడే ఉండి చూసిన జీకే ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఆయనను చూసి అక్కడకు వచ్చిన ఉద్యోగితో ‘నా కంపెనీకి కరెంట్ పర్మీషన్ ఏమైంది? ఇది నేను మినిష్టర్‌కు కాల్ చేస్తే వెంటనే అయిపోతుంది. కానీ, అంత వరకూ రానివ్వకూడదని అనుకున్నా. అయినా ఆమెతో ఏంటి గొడవ' అని అడుగుతాడు. అప్పుడు జరిగిందంతా జీకేకు చెబుతాడు ఆ ఉద్యోగి. దీంతో ‘నా పని కంటే ఆమె పని ముందు అయ్యేలా చూడండి' అని చెప్పి వెళ్లిపోతాడు.

  మీ అందరిలో అది చూస్తున్నాను అంటూ

  మీ అందరిలో అది చూస్తున్నాను అంటూ

  తులసి విద్యుత్ శాఖ అధికారులను బెదిరించి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీలో కరెంట్ వస్తుంది. దీంతో అందులో పని చేస్తున్న ఆడవాళ్లు అందరూ చప్పట్లు కొట్టి తులసిని అభినందిస్తారు. అప్పుడు ఆమె ‘ఇందులో నా గొప్పదనం ఏమీ లేదు. మీ అందరూ నా కోసం కష్టపడుతున్నారు. నేనే మిమ్మల్ని అభినందించాలి. అయినా మీ ప్రతి ఒక్కరిలో కష్టపడే తత్వం ఉంది. అనుక్షణం గెలవాలి అని అనుకోండి. అప్పుడు కష్టం కూడా కష్టంలా అనిపించదు' అని అంటుంది. దీంతో ‘మీరు ఏది చెబితే అది చేయడానికి సిద్ధం అమ్మా' అని ఆడవాళ్లంతా అంటారు. దీంతో తులసి ధైర్యంగా ముందుకెళ్తానని అంటుంది.

  Bigg Boss Telugu 5: బిగ్ బాస్‌లో వింత ట్రాక్.. అతడిపై మనసు పడ్డ ప్రియాంక.. అందరి ముందే ఆ మాట!

  ప్రేమ్‌ను పెళ్లి చేసుకోమని చెప్పిన శృతి

  ప్రేమ్‌ను పెళ్లి చేసుకోమని చెప్పిన శృతి

  నందూ తెచ్చిన పెళ్లి ప్రపోజల్ గురించి ప్రేమ్, శృతి మధ్య చర్చ జరుగుతుంది. ఆ సమయంలో ‘అంకుల్ వాళ్లు నీ మంచి గురించే సంబంధం తీసుకుని వచ్చారు. నీ లైఫ్ సెటిల్ చేయాలని చూస్తున్నారు. నా మాట విని సరైన నిర్ణయం తీసుకో' అని అంటుంది శృతి. అప్పుడు ‘అంటే నన్ను ఆ పెళ్లి చేసుకోమంటున్నావా? ఒక్కటి విను నేను మాత్రం ఆ పెళ్లి చేసుకోను. ఆ విషయం కూడా వాళ్లకు చెప్పేస్తాను. అంతేకాదు, శృతికి దారి చూపించే వరకూ పెళ్లి చేసుకోను' అని అంటాడు. అప్పుడు శృతి ‘అంటే నీ పెళ్లికి శృతి అడ్డమా అని ప్రశ్నిస్తే ఏం చేస్తావు' అని అడుగుతుంది.

  సరైన టైమ్‌లో వచ్చి చెడగొట్టిన అంకిత

  సరైన టైమ్‌లో వచ్చి చెడగొట్టిన అంకిత

  ప్రేమ్ ఎంత చెప్పినా వినకపోయే సరికి శృతి నీకు ఏది సరైన నిర్ణయం అనుకుంటే అది తీసుకో అని చెబుతుంది. అంతలో అంకిత అక్కడకు వచ్చి వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారా అని చాటుగా వింటుంది. అప్పుడు ప్రేమ్ ‘చెప్పేస్తా.. నా మనసులో ఏముందో.. నేను ఏమని అనుకుంటున్నానో చెప్తాను' అంటూ శృతికి తన ప్రేమను వ్యక్త పరచాలాని అనుకుంటాడు. అంతలో అక్కడే ఉన్న అంకిత ‘వామ్మో ప్రేమ్ ఇప్పుడు తన ప్రేమను చెప్పేస్తాడా ఏంటి? అలా జరగకూడదు' అంటూ మధ్యలో వచ్చి శృతిని తీసుకెళ్తుంది. దీంతో ప్రేమ్ చెప్పాలనుకున్నది మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది.

  Bigg Boss Telugu 5: హౌస్‌లో రెచ్చిపోయిన యాంకర్ రవి.. అతడి మాటలకు బోరున ఏడ్చేసిన కంటెస్టెంట్

  శృతి పెళ్లికి నందూ ప్లాన్.. లాస్య మరోలా

  శృతి పెళ్లికి నందూ ప్లాన్.. లాస్య మరోలా

  ప్రేమ్ టైమ్ అడిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ లాస్య.. నందూతో మాట్లాడుతుంది. ‘అన్నీ కరెక్టుగా జరగాలంటే కుదరదు నందూ. ఇలా అయితే మన కంపెనీ సరిగా నడవదు. అప్పులు తీరవు. ప్రేమ్ పెళ్లికి ఒప్పుకోవాలంటే ముందు శృతిపై ప్రేమను చెడగొట్టాలి. ప్రేమ్ ప్రేమ గురించి చెప్పినా.. ఆమె ఒప్పుకోకుండా చేయాలి' అని రెచ్చగొడుతుంది. దీనికి ఒప్పుకున్న నందూ ‘అలాగే చేద్దాం లాస్య. దాని కంటే ముందు శృతికి ఒక సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసి పంపించేద్దాం. అందుకోసం ఏం చేయాలో నేను చూసుకుంటా' అని అంటాడు. దీంతో లాస్య అతడిని మరింతగా రెచ్చగొట్టి వాళ్లను విడగొట్టాలని ప్లాన్ చేస్తుంది.

  తులసికి వేసిన బాణం గురి తప్పేసింది

  తులసికి వేసిన బాణం గురి తప్పేసింది

  లాస్యకు గిరిధర్ ఫోన్ చేసి సారీ చెబుతాడు. ఆ తర్వాత తులసి చేసిన పని గురించి మొత్తం వివరిస్తాడు. అంతేకాదు, ఆమె ధైర్యాన్ని పొగుడుతూనే.. మళ్లీ మనం ప్లాన్ వేసి ఆమెను దెబ్బకొడదాం అని చెబుతాడు. ఆమె ఫోన్ కట్ చేయగానే.. తులసి అక్కడకు వస్తుంది. రావడం రావడమే ‘ఏంటి లాస్య అక్కడ పవర్ వస్తే.. ఇక్కడ షాక్ కొట్టిందా' అని అడుగుతుంది. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అప్పుడు లాస్య ‘ఇప్పుడే ఒక నిప్పు వెలిగించాను. అది త్వరలోనే మంటగా మారుతుంది. దాన్ని ఎలా ఆపుతావో చూస్తాను' అని అంటుంది. దీంతో తులసిలో కంగారు మొదలవుతుంది.

  సర్‌ప్రైజ్ చేసిన సుడిగాలి సుధీర్ కవల సోదరుడు: అచ్చం ఇద్దరూ ఒకేలా ఉండడంతో అంతా షాక్!

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  పెళ్లి సంబంధం ఏర్పాట్లు చేసిన నందూ

  పెళ్లి సంబంధం ఏర్పాట్లు చేసిన నందూ

  తర్వాత రోజు ఉదయాన్ని నందూ ఫోన్ కాల్ మాట్లాడుతుంటాడు. ‘ఏంటి వచ్చేస్తున్నారా? సరే సరే ఇంకో గంట సేపు పడుతుందా? అంతలో మా ఏర్పాట్లన్నీ మేము చేసుకుంటాం' అని అవతలి వాళ్లకు చెబుతాడు. అంతేకాదు, ‘తులసి త్వరగా ఏర్పాట్లు చేయండి పెళ్లి వాళ్లు వచ్చేస్తున్నారు' అని అంటాడు. అప్పుడామె ‘అదేంటండీ.. ప్రేమ్ తన మనసులో మాట చెప్పడానికి టైమ్ కావాలని అడిగాడు కదా. ఇప్పుడీ హడావిడి దేనికి' అని ప్రశ్నిస్తుంది. దీనికి ‘ఎప్పుడు ఏం చేయాలో.. టైమ్ తీసుకోవాలో వద్దో నాకు తెలుసు. ముందు మీ పని కానివ్వండి' అని అంటాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 419: Ankita Created Cunning Plan for Prem and Shruti Separation. Then Lasya Manipulated Nandu. After That He Plan to do Shruthi Marriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X