Intinti Gruhalakshmi: తులసిని ఒప్పించిన నందూ.. ధనుంజయ్ ఫ్యామిలీ ఎంట్రీ.. కథలో ఊహించని మలుపు
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగానే కొత్త షోలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే : గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత తులసి బాధ పడుతూనే ఉంటుంది. అది చూసిన నందూ తన చేతిలో ఉన్న లవ్ లెటర్‌ను చించి పడేస్తాడు. దీంతో అతడి తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసి తులసిలో మార్పును తీసుకు రావాలని సూచిస్తారు. ఇక, లాస్య గురించి రాజ్యలక్ష్మి ఇంట్లో ప్రస్థావన వస్తుంది. దీంతో ఆమెపై కేసు పెట్టాలని అంటారు. కానీ, దీనికి విక్రమ్ మాత్రం ఒప్పుకోడు. తర్వాత విక్రమ్ విషయంలో దివ్యను దెబ్బకొట్టేందుకు బసవయ్య కూతురిని రంగంలోకి దించాలని రాజ్యలక్ష్మి అదిరిపోయే ప్లాన్‌ను రెడీ చేసుకుంటుంది.

అంత దూరంగా వెళ్లిపోయారు : సామ్రాట్ మరణం తర్వాత తులసి అతడి గురించే ఆలోచిస్తూ ఏమీ తినకుండా బాధ పడుతూ ఉంటుంది. అప్పుడు నందూ భోజనం తీసుకు వస్తాడు. దీంతో తులసి వద్దు అంటుంది. అయినా నందూ ఆమె మనసు మార్చడానికి ట్రై చేస్తాడు. దీంతో తులసి 'నిస్సహాయంగా నిలబడినప్పుడు సామ్రాట్ నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. కళ్ళు మూసినా తెరిచినా ఆయన చేసిన సహాయాలు గుర్తుకొస్తున్నాయి. కెఫేను నిలబెట్టడం కోసం ఆయన ఆఫీసు నుంచి వచ్చేశా. నేను తప్పు చేశా. సారీ చెప్పడానికి కూడా వినిపించినంత దూరంగా వెళ్లిపోయారు. చాలా గిల్టీగా ఉంది' అంటుంది.

ఎవరం భోజనం చేయమని : తులసి మాటలకు నందూ 'కళ్ళు మూసుకుని ఆయనకి సారీ చెప్పు. ఏ లోకంలో ఉన్నా వినబడుతుంది' అని సలహా ఇస్తాడు. దీనికి తులసి 'నేనే ఈ బాధను తట్టుకోలేకపోతున్నా.. చిన్న పిల్ల హనీ ఎలా తట్టుకుంటుంది' అంటుంది. దీంతో నందూ 'హనీకి నచ్చజెప్పి భోజనం పెట్టి.. ఇక్కడ నువ్వు కడుపు మాడ్చుకుంటే ఎలా ఉంటుంది? మంచి ఫ్రెండ్‌ను పోగొట్టుకుంటే బాధగానే ఉంటుంది. కానీ భోజనం చెయ్. నువ్వు తినకపోతే ఇంట్లో ఎవరం భోజనం చేయం' అంటాడు. దీంతో తులసి మనసు బాగోలేదు అర్థం చేసుకోండి. ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళండి అంటుంది.

తిన్న తులసి.. హనీ కోసమే : ప్లేట్ పెట్టేసి వెళ్లమనడంతో నందూ తినిపిస్తానని అంటాడు. దీనికి తులసి ఒప్పుకోకపోవడంతో గతంలో తనకు అలాగే తినిపించావని అంటాడు. దీంతో తులసి ఆ ప్లేట్ తీసుకుని తినేస్తుంది. అది చూసి పరందామయ్య వాళ్లు సంతోషిస్తారు. ఇక, ఉదయాన్నే తులసి హనీ కోసం క్యారేజ్ రెడీ చేస్తుంది. అప్పుడు కెఫేకు ఆలస్యంగా వస్తానని నందూకు చెప్తుంది. దీంతో హనీ కోసం వెళ్లడం అవసరమా అని అడుగుతాడు. దీనికి తులసి ఏంటి అలా అడిగారు అనగా.. 'ఏం లేదూ.. నువ్వు సామ్రాట్ ఆఫీస్‌లో మానేసిన తరువాత వాళ్ల ఇంటికి వెళ్లడం మానేశావ్ కదా' అంటాడు.

నా అవసరం చాలా ఉంది : నందూ మాటలకు తులసి 'అంటే మన స్వార్దం కోసమే రిలేషన్ పెట్టుకోవాలా? నేను చాలా రోజులుగా వెళ్లడం లేదంటే నా బిజీ వల్ల కుదరలేదు. అంతే తప్ప ఆ ఇంటితో రిలేషన్ వద్దనుకుని కాదు. నిన్న మీ కళ్లతో మీరే చూశారు కదా. బాబాయ్ గారు హనీని చూడలేకపోతున్నారు. ప్రస్తుతం ఆ ఇంటికి హనీకి నా అవసరం చాలా ఉంది' అంటుంది. దీనికి పరందామయ్య వాళ్లు కూడా సపోర్ట్ చేస్తారు. దీంతో నందూ 'వాళ్లు బాధలో ఉన్నారని మనం ప్రతిరోజు వెళ్లలేం కదా.. ఇలా చూస్తే తులసి అలవాటై సమస్య అవుతుంది' అనగా.. తులసి ఆ పరిస్థితి వస్తే చూద్దామంటుంది.

సామ్రాట్ తమ్ముడు ఎంట్రీ : హనీ నిద్రలో ఉండగా సామ్రాట్ కలలోకి వస్తాడు. దీంతో ఉలిక్కిపడి లేచిన ఆ చిన్నారి 'కిందకి వచ్చి డాడీ వచ్చారు' అని చెప్తుంది. అంతలోనే తులసి రావడంతో హనీ 'నిద్రపోతుంటే డాడీ వచ్చి పిలిచారు. అది చెప్తుంటే తాతయ్య నమ్మడం లేదు. డాడీ ఎక్కడ ఉన్నాడో వెతకండి' అని అంటుంది. ఆ తర్వాత తులసి హనీకి భోజనం పెడుతుంది. అప్పుడే సామ్రాట్ చిన్నాన్న కొడుకు ధనుంజయ్ ఎంట్రీ ఇస్తాడు. భార్య రత్నప్రభ, కూతురితో కలిసి సామ్రాట్ ఇంటికి వస్తాడు. రాగానే సామ్రాట్ ఫోటో దగ్గరకి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుని యాక్టింగ్‌ను షురూ చేసేస్తాడు.

బాధ్యతలు మొత్తం మీవే : ధనుంజయ్ వాళ్లు రావడంతో సామ్రాట్ బాబాయి 'ఇప్పుడు కాస్త ధైర్యంగా ఉంది. ఇకపై ఆఫీసు బాధ్యతలు నువ్వే చూసుకో' అని చెప్తాడు. అప్పుడు తులసి 'అది మాత్రమే కాదు.. హనీ బాధ్యత కూడా మీదే' అంటుంది. దీంతో రత్నప్రభ 'మీరు తులసి కదా. సామ్రాట్ మీ గురించి చెప్తూ ఉండేవాడు. హనీ గురించి దిగులుపడొద్దు నేను ఉన్నాను కదా' అని తులసి చేతిలో ఉన్న ప్లేట్‌ను తీసుకుని హనీకి అన్నం తినిపిస్తుంది. అది చూసి తులసి.. హమ్మయ్య అని గుండెలపై చేయి వేసుకుంటుంది. వాళ్ల బాబాయి కూడా ఊపిరి పీల్చుకుంటాడు.

మీరు కలిస్తేనే సంతోషం : విక్రమ్ నిద్ర లేవగానే దివ్య వచ్చి తల తుడుచుకుంటూ కావాలని నడుము చూపిస్తుంది. అతడిని టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ, విక్రమ్ మాత్రం నిగ్రహంగా ఉంటాడు. ఆ తర్వాత విక్రమ్.. తండ్రి కోసం షర్ట్ కొని తీసుకొస్తాడు. దీంతో ప్రకాశం 'నాకు కొత్త షర్ట్ కొంటె సంతోషపడను. నువ్వు, దివ్య కలిసి సంతోషంగా ఉంటేనే ఆనందంగా ఉంటుంది' అని అంటాడు. దీంతో విక్రమ్ 'ఈ విషయంలో ఎవరు చెప్పినా కూడా వినేది లేదు' అంటూ కోపంగా వెళ్లిపోతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











