For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి ఎదురు తిరిగిన ఫ్యామిలీ.. హనీ ప్రశ్నలకు సామ్రాట్ షాక్

  |

  దాదాపు ఇరవై, ముప్పై ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అభి ఒంటరిగా గాయత్రి ఇంటికి వెళ్తాడు. దీంతో ఆమెకు కోపం వచ్చి అంకిత ఎక్కడని ప్రశ్నిస్తుంది. అప్పుడతను అంకిత రాలేదని సమాధానం చెప్తాడు. దీంతో గాయత్రి కోపంలో అంకిత రాకపోతే నువ్వు ఈ ఇంటికి రావొద్దు అంటుంది. అంతేకాదు, ఆమెకు విడాకులు ఇవ్వమని అంటుంది. అనంతరం లాస్య ప్లాన్ ప్రకారం సామ్రాట్ గురించి తులసి విమర్శలు చేసినట్లు పేపర్లో వేయిస్తుంది. అది చూసిన సామ్రాట్‌కు కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే ఆ పేపర్ పట్టుకుని అతడు తులసి ఇంటికి వెళ్లి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

  టాప్ కిందకి జరిపి షాకిచ్చిన శ్యామల: ఇది అట్టాంటిట్టాంటి షో కాదుగా!

  ప్రేమ్ మాటలతో సామ్రాట్ రిప్లైతో

  ప్రేమ్ మాటలతో సామ్రాట్ రిప్లైతో

  తులసి ఇంటికి వెళ్లిన సామ్రాట్ ఆమె మీద సీరియస్ అవుతూ ఉంటాడు. దీంతో ప్రేమ్ 'అసలు ఏమైంది సామ్రాట్ గారు? మీరు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు. మా మామ్ మీరు అనుకునేలా ఎప్పుడూ చేయదు' అని అంటాడు. అప్పుడు సామ్రాట్ 'నువ్వే వచ్చి మా మామ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకండి. తనను ఎదిగేలా చేయండి అని మాట తీసుకున్నావ్. మరి ఇప్పుడు మీ మామ్ నా పార్ట్‌నర్‌షిప్ నుంచి తప్పుకుంది. పైగా నాకే చెడ్డపేరు తేవాలని చూస్తుంది' అని చెప్తాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లు మాట్లాడినా వాళ్లను కూడా ఎదురించి మాట్లాడతాడు.

  నమ్మక ద్రోహం చేశావని నిందలు

  నమ్మక ద్రోహం చేశావని నిందలు

  ఆ తర్వాత సామ్రాట్ 'నాతో పార్ట్‌నర్‌షిప్ వద్దనుకుంటే వచ్చి మాట్లాడాలి. అంతేకానీ, మెసేజ్ చేసి చెప్పడం. తర్వాత నా కంపెనీ రెప్యుటేషన్ పాడు చేయడం ఎందుకు? నాకు చెడ్డపేరు తీసుకు రావడం ఎందుకు? ఈ పేపర్ స్టేట్‌మెంట్ ఎందుకు' అని తులసిని ప్రశ్నిస్తాడు. అనంతరం ఆ పేపర్‌లో వచ్చిన ఆర్టికల్ చూసిన ప్రేమ్.. 'ఈ పేపర్ స్టేట్‌మెంట్ తో మా అమ్మకు ఎలాంటి సంబంధం లేదు' అని బదులిస్తాడు. దీనికి సామ్రాట్ 'అవును.. నేను చూశా.. వచ్చేటప్పుడు ప్రెస్ వాళ్లు ఎందుకు వచ్చారు. నువ్వు చేసింది నమ్మకుండా కాదు మోసం చేశావు. జీవితంలో ఇంకెవ్వరినీ నమ్మకుండా చేశావు. థాంక్స్' అంటాడు. అప్పుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా సామ్రాట్ ఎవరి మాటా వినకుండా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

  ఏమీ లేకుండా పాయల్ సెల్ఫీ వీడియో: అన్ని యాంగిల్స్ నుంచి చూపిస్తూ!

  సామ్రాట్‌కు సర్ధి చెప్పిన బాబాయి

  సామ్రాట్‌కు సర్ధి చెప్పిన బాబాయి

  తులసి దగ్గర నుంచి ఇంటికొచ్చిన సామ్రాట్ దాని గురించే ఆలోచిస్తుంటాడు. ఇంతలో అతడి బాబాయి అక్కడికి వచ్చి 'పార్టనర్‌షిప్ నుంచి తప్పుకుంటున్నట్లు మెసేజ్ పెట్టడమే తప్పు అని నువ్వు అనుకుంటున్నావా' అని అడుగుతాడు. దీంతో సామ్రాట్ 'తను తప్పుకున్నానని పేపర్ వాళ్లతో చెప్పి నా కెరీర్‌కే మచ్చను తీసుకొచ్చింది. అంత అన్యాయం నేను ఏం చేశాను బాబాయి. తను ఎందుకు ఇలా చేసింది' అంటాడు. దీంతో తులసిది అలా చేసే వ్యక్తిత్వం కాదురా అంటాడాయన. అప్పుడు సామ్రాట్ నేను కూడా అలాగే అనుకున్నాను అంటాడు. తర్వాత సామ్రాట్ బాబాయి తులసికి ఫోన్ చేయాలని అనుకుంటాడు. దీంతో సామ్రాట్ ఆ ఫోన్ తీసుకుని విసిరేస్తాడు. తులసి ఇంటికెళ్తానని అన్నా ఒప్పుకోడు.

  తులసి గురించి హనీ అడగడంతో

  తులసి గురించి హనీ అడగడంతో

  సామ్రాట్ వాళ్ల బాబాయితో గొడవ పడుతోన్న సమయంలోనే హనీ అక్కడకు వస్తుంది. వచ్చీ రావడమే ఆ చిన్నారి 'నాన్నా తులసి ఆంటి 2 రోజుల నుంచి కనిపించడం లేదు.. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు.. ఎందుకలా. ఒకసారి ఫోన్ చేయవా.. బెంగ పెట్టుకుంటుందేమో.. ఫోన్ చేసి రమ్మను' అని తండ్రిని అడుగుతంది. దీంతో సామ్రాట్‌కు కోపం వస్తుంది. ఆ వెంటనే హనీపై అరుస్తాడు. దీంతో హనీ తాతయ్య అని ఆయన దగ్గరికి వెళ్తుంది. దీంతో ఆయన 'ఒరేయ్ చిన్నపిల్లరా ఎలా ఏడుస్తుందో చూడు. నువ్వు పెళ్లి చేసుకోకురా.. వచ్చేదాని జీవితాన్ని కూడా నాశనం చేయకు' అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు సామ్రాట్ కూడా తులసి గురించి మాట్లాడొద్దని వాళ్లకు వార్నింగ్ ఇస్తాడు.

  ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: ప్రైవేటు పార్టులను చూపిస్తూ దారుణంగా!

  సామ్రాట్ వల్ల తులసి ఇంట్లో రచ్చ

  సామ్రాట్ వల్ల తులసి ఇంట్లో రచ్చ

  సామ్రాట్ గొడవ చేసి వెళ్లిపోయిన తర్వాత అభి 'నా మీదికైతే కొట్టడానికి ఆవేశంగా దూసుకొచ్చావు కదా. సామ్రాట్ గారి ముందు వానపాములా ముడుచుకొని కూర్చున్నావు. ఏమైంది ఆ పౌరుషం' అంటూ ప్రేమ్‌ను ప్రశ్నిస్తాడు. దీంతో ప్రేమ్ 'ఏం సమాధానం చెప్పమంటావమ్మా వాడికి. ఎందుకు నా చేతులు కట్టేశావు' అని తులసిని ప్రశ్నిస్తాడు. ఆ సమయంలో పరందామయ్య కూడా తులసినే తప్పు పడతాడు. అదే సమయంలో సామ్రాట్‌కు అంత ఛాన్స్ ఎందుకు ఇచ్చావంటూ కుటుంబ సభ్యులు అందరూ తులసిదే తప్పు అని మాట్లాడతారు. దీంతో ఆమె షాక్ అవుతుంది.

  తులసి డీలా.. నందూ వాళ్లు హ్యాపీ

  తులసి డీలా.. నందూ వాళ్లు హ్యాపీ

  సామ్రాట్ వచ్చి అంతలా అరిచినా తులసి ఏమీ మాట్లాడకపోవడంతో అందరూ ఆమెపై గుర్రుగా ఉంటారు. అప్పుడు తులసి 'ఆయన ఆవేశంలో ఉన్నారు. మన మాట వినరు. అందుకే ఆయనకు ఏం సమాధానం చెప్పలేదు. అయినా అలాంటి సమయంలో మనం మాట్లాడితే వాదన పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే నేను సైలెంట్‌గా ఉండిపోవాల్సి వచ్చింది. ఆయనకు జరిగిన నష్టం గురించి నేను బాధపడుతున్నా'. మరోవైపు లాస్య, నందు చాలా సంతోషంలో ఉంటారు. అప్పుడు నందూ 'నా ముందు తల ఎగరేసిన తులసి.. ఇక తల ఎత్తుకోలేదు. లేకపోతే నా ముందే అహంతో ఎగిరెగిరి పడుతుందా? తనకు తగిన శాస్తే జరిగింది' అని అంటాడు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 732: Samrat Misunderstands Tulasi about News Article. Then He Fires on Her. After That Samrat Worried about Honey Questions.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X