Intinti Gruhalakshmi September 9th Episode: అలా చేస్తే పెళ్లి చేయనన్న నందూ.. తులసి నయా ప్లాన్
చాలా ఏళ్లుగా మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రేమ్, శృతి మధ్య పెళ్లికి సంబంధించిన చర్చ జరుగుతుంటుంది. అప్పుడామె సరైన నిర్ణయం తీసుకోమని సలహా ఇస్తుంది. అంతలో అతడు తన ప్రేమను వ్యక్త పరచాలని అనుకుంటాడు. కానీ, అప్పుడే అంకిత ప్లాన్ చేసి శృతిని అక్కడి నుంచి పంపేస్తుంది. ఆ తర్వాత లాస్య రెచ్చగొట్టడంతో శృతికి వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని నందూ ప్లాన్ చేస్తాడు. అందుకు అనుగుణంగానే ఏదో సంబంధం కూడా మాట్లాడతాడు. ఇక, ఫ్యాక్టరీలో కరెంట్ రావడంతో ఉద్యోగులంతా సంతోషిస్తారు. ఆ విషయంపై లాస్యకు, తులసి మధ్య డిస్కర్షన్ జరుగుతుంది.

నన్నెవరూ అర్థం చేసుకోరన్న నందూ
ఇంటికి పెళ్లి వాళ్లు వస్తున్నారని నందూ హడావిడి చేస్తుండడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. అతడు చేసే హడావిడికి అందరూ షాక్ అవుతారు. మరీ ముఖ్యంగా ప్రేమ్‌లో అయోమయం కనిపిస్తుంది. అభి కూడా ప్రేమ్ ఒప్పుకోకుండా ఇలాంటి ప్రయత్నాలు ఎందుకని తండ్రిని ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత పరందామయ్య కూడా దీనికి అడ్డు చెబుతాడు. అప్పుడు నందూ 'మంచి చేస్తున్నా ఇంట్లో ఎవరూ నన్ను అర్థం చేసుకోరేంటి? నాతో మాట్లాడాలి అనుకుంటే తర్వాత మాట్లాడుదురు. ముందైతే వెళ్లి రెడీ అవ్వండి' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

తులసిలో భయం... అనసూయ అలా
నందూ అలా వెళ్లిపోతుండగా ప్రేమ్ అడ్డు పడతాడు. కానీ, ఆయన మాత్రం ఏమీ చెప్పకుండానే వెళ్లిపోతాడు. దీంతో తులసి ఏం జరుగుతుందని భయపడుతుంది. అంతలో అనసూయ 'అసలేం భయపడక్కర్లేదు. వాడు మంచిగానే చేస్తున్నాడు. మీరు ఉసూరుమని ఉండకుండా కాస్త హుషారుగా ఉండండి. మన సమావేశాలు తర్వాత పెట్టుకుందాం' అని అంటుంది. దీంతో తులసి వెళ్లి పెళ్లి వాళ్లకు కావాల్సిన టిఫిన్స్ చేయడానికి రెడీ అవుతుంది. అప్పుడు రాములమ్మతో 'నాకిష్టం లేకపోయినా కొన్ని సార్లు ఇలాంటివి తప్పవు' అని వివరిస్తుంది.

తులసి సూపర్ ప్లాన్.. ప్రేమ్‌కు సలహా
తులసి టిఫిన్స్ రెడీ చేస్తుండగా ప్రేమ్ అక్కడికి వస్తాడు. 'ఏంటమ్మా? నాకు టైమ్ కావాలని అడిగాను కదా. ఇప్పుడేంటి డాడ్ ఇలా చేస్తున్నారు? నాకు ఇష్టం వచ్చినట్లు చేసుకోడానికి, ఇష్టం వచ్చినట్లు ఉండడానికి స్వేచ్ఛ లేదా? అసలెందుకు ఇలా కంగారుగా చేస్తున్నారు' అని ప్రశ్నిస్తాడు. దీనికి తులసి 'ఇప్పుడు పెళ్లి చూపులే కదా జరిగేది. కంగారు పడొద్దు నాన్న. నీ మనసులో ఉన్నది పెళ్లి వాళ్లకు కూడా అర్థమయ్యేలా చెప్పు. దీంతో ఇంట్లో వాళ్లు కూడా నీ బాధను అర్థం చేసుకుంటారు' అంటూ అదిరిపోయే ప్లాన్ వేస్తుంది. ఇలా పెళ్లి చెగడొట్టమని సలహా ఇస్తుంది.

అభిలో టెన్షన్... లాస్య వల్లే ఇలా అని
ప్రేమ్ పరిస్థితిని చూసిన అభి తనలో తానే తెగ టెన్షన్ పడుతూ ఆలోచించుకంటూ ఉంటాడు. అంతలో అక్కడకు వచ్చిన అంకిత ఏమైందని అడుగుతుంది. దీంతో ప్రేమ్ పరిస్థితిని చెబుతాడు. దీంతో ఆమె కూడా నందూకు సపోర్ట్ చేస్తుంది. మరోవైపు, దీని గురించి పరందామయ్య, తులసి మధ్య సంభాషణ జరుగుతుంది. అప్పుడు తులసి ఇందులో లాస్య ప్రమోయం ఉందని అనిపిస్తుందంటూ అభిప్రాయ పడుతుంది. ఇక, లాస్య నందూతో 'ఏంటి నువ్వు ఇంత కామ్‌గా ఉన్నావ్? ఎప్పుడేం చేస్తావో అని భయంగా ఉంది' అంటూ తెగ కంగారు పడిపోతుంది.

బాంబ్ పేల్చిన నందూ.. అంతా షాక్
బయట లాస్య, నందూ మాట్లాడుతుండగానే పెళ్లి వాళ్లు వస్తారు. వాళ్లను ఇంట్లోకి తీసుకెళ్లిన తర్వాత చాలా సేపు మాట్లాడతారు. ఆ సమయంలో వాళ్లు 'నందూ గారూ మేమొచ్చి చాలా సేపు అవుతుంది కదా. అందరినీ పిలవండి. అమ్మాయిని చూపించండి' అంటారు. అప్పుడందరూ షాక్ అవుతారు. దీంతో తులసి 'అసలు మీరు సంబంధం చూసింది ఎవరికి' అంటూ ప్రశ్నిస్తుంది. దీనికి నందూ శృతి గురించి చూశానని చెబుతాడు. దీంతో ప్రేమ్.. పెళ్లి వాళ్లను బయటకు వెళ్లిపోమని అంటాడు. అప్పుడు వాళ్లు తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

శృతి గురించి అడిగితే ఏం చెప్పాలి?
శృతికి సంబంధం చూడడంతో కోపంగా ఉన్న ప్రేమ్ తండ్రితో గొడవకు దిగుతాడు. 'అసలు ఆమె ప్రమేయం లేకుండా సంబంధం ఎందుకు చూశారు? తను నాకు పెళ్లి చేయండి అని మిమ్మల్ని అడిగిందా' అని తండ్రిని ప్రశ్నిస్తాడు. దీనికి నందూ 'ఇప్పుడు తనకు పెళ్లి చేయకపోతే రేపు ఈ ఇంటికి వచ్చే ఈ భార్య తను ఎవరు అని ప్రశ్నిస్తే ఏ సమాధానం చెప్పాలి. నేను తన మంచి గురించే చేశాను' అని చెబుతాడు. అప్పుడు తులసి కూడా నందూకు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. దీంతో అతడు మరింతగా ఫైర్ అవుతూ అందరికీ సమాధానాలు చెబుతాడు.

ప్రేమ్‌కు కండీషన్ పెట్టేసిన నందూ
నందూ ఎంతలా ఫైర్ అయినా ప్రేమ్ మాత్రం సరైన ప్రశ్నలు అడిగి తండ్రికే చెమటలు పట్టిస్తాడు. అంతేకాదు, శృతి తన మనిషి అని అందరి ముందే చెబుతాడు. తనకు ఏం చేయాలో తెలుసు అంటూ స్పష్టం చేసేస్తాడు. దీంతో నందూ మాట్లాడుతూ 'మేము శృతి గురించి ఆలోచించకుండా, పట్టించుకోకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు చేయాలి. నేను తీసుకొచ్చిన సంబంధం గురించి త్వరగా ఆలోచించుకుని చెప్పాలి. నీకు మరో 24 గంటలు సమయం ఇస్తున్నా. ఈ లోపు ఆలోచించుకుని చెప్పు' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Recommended Video

మీరు చేసిందే.. కొడుకు చేస్తే తప్పా
ఇంట్లో ఒంటరిగా ఉన్న నందూతో తులసి గొడవకు దిగుతుంది. 'ప్రేమ్.. శృతిని ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు కదా. ఇప్పుడివన్నీ ఎందుకు చేస్తున్నారు' అని ప్రశ్నిస్తుంది. దీనికి నందూ 'తను భర్త వదిలేసిన అమ్మాయి. ఆమెను ప్రేమ్ చేసుకోవడం నాకిష్టం లేదు' అని అంటాడు. దీనికి తులసి 'మరి అప్పుడు మీరు నన్ను కూడా ప్రేమించారు కదా' అని అనగా.. 'ఆ తప్పు వాడు చేయకూడదనే అంటున్నా' అని బదులిస్తాడు. దీంతో తులసి 'మీరు వద్దన్నా ప్రేమ్‌కు ఏది నచ్చితే అదే చేస్తాను' అంటూ నందూతో ఛాలెంజ్ చేస్తుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











