Intinti Gruhalakshmi: ఆస్తి కోసం రత్నప్రభ తెగింపు.. ప్రమాదంలో హనీ.. తులసి కోసం మరో కన్నింగ్ ప్లాన్

ఎప్పటికప్పుడు కొత్త షోలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

Intinti Gruhalakshmi Serial Today Episode September 9th 2023

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ చనిపోయాడన్న బాధతో అన్నం కూడా తినకుండా ఉన్న తులసిని నందూ బ్రతిమాలతాడు. అంతేకాదు, ఆమెను ఎలాగైనా తినేలా చేస్తాడు. అనంతరం హనీ కోసం సామ్రాట్ ఇంటికి వెళ్లేందుకు తులసి రెడీ అవుతుండగా.. నందూ వద్దు అంటాడు.

దీంతో సామ్రాట్ ఫ్యామిలీతో బంధం ఎప్పటికీ పోదని అంటుంది. అనంతరం అక్కడకు వెళ్లగా.. సామ్రాట్ వాళ్ల తమ్ముడు ఫ్యామిలీ వస్తుంది. వాళ్లకే హనీ బాధ్యతలు అప్పగిస్తుంది. ఇక, విక్రమ్‌ను దివ్య ఎంత రెచ్చగొట్టినా టెంప్ట్ అవడు. పైగా తన తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 9th 2023

ప్రేమను ఎలా నిరూపించాలి?: దివ్యతో కలిసి ఉండమని, జీవితం అంటేనే సర్ధుకుపోవడం అని విక్రమ్‌కు ప్రకాశం హితబోధ చేస్తాడు. కానీ, అతడు మాత్రం 'దివ్యపై నా మనసు విరిగిపోయింది. తనకు ప్రేమ అనే మాటకు అర్థమే తెలీదు' అని చెప్తాడు. అప్పుడు ప్రకాశం 'దివ్య మనసు మార్చుకుని తిరిగి వచ్చింది. కుటుంబం కోసం ఎంతగా ఆరాటపడుతుందో కనిపించడం లేదా? ఎవరు ఏమన్నా మౌనంగా భరిస్తుంది. నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఇంక ఏం చేయాలి. తన ప్రేమని ఎలా నిరూపించుకోవాలి. నీ మనసులో దివ్య అంటే ఇష్టం ఉంది. కానీ, పైకి చెప్పడం లేదు' అని అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 9th 2023

మళ్లీ వెళ్లదని గ్యారెంటీ ఏంటి: ప్రకాశం మాటలకు విక్రమ్ 'ఇప్పుడు మనసు మార్చుకుని తిరిగి వెళ్లదనే గ్యారంటీ ఏంటి నాన్నా' అని సూటిగా ప్రశ్నిస్తాడు. దీనికి ప్రకాశం 'ప్రతి విషయంలోనూ నీకు అండగా నిలబడుతుంది. ఎవరు ఏమన్నా మౌనంగా భరిస్తుంది. తనపై ప్రేమ ఉన్నా పైకి చెప్పకుండా దాచుకుంటున్నావు. ప్రేమ ఉంది కాబట్టే తను చెప్పినట్టు వింటున్నావు.. సలహాలు పాటిస్తున్నావు. నీ మనసు విరిగిపోవడం కాదు అది ఎవరికీ కనిపించకుండా ముసుగువేసుకుంటున్నావు ఒప్పుకో' అంటాడు. దీంతో విక్రమ్ బాధ పడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

హనీకి నిజం చెప్పాలని ప్లాన్: తండ్రి కోసం ఏడుస్తూ కూర్చున్న హనీకి సామ్రాట్ లేడన్న నిజం చెప్పాలని రత్నప్రభ ప్రయత్నిస్తుంది. అప్పుడు సామ్రాట్ బాబాయి వద్దని అనడంతో యూఎస్‌లో పిల్లలు ఫాస్ట్‌గా ఉంటారని అంటుంది. అప్పుడు వాళ్ల కూతురు స్వీటీ 'నేను కూడా చాలా ఫాస్ట్.. ఎంతంటే.. రేపు మా డాడీ పోయాక.. ఫొటోకి దండ వేసినా పట్టించుకోను' అంటుంది. దీంతో ఆ పాపను రత్నప్రభ ఎలాపడితే అలా తిడుతుంది. దీంతో సామ్రాట్ బాబాయి అలా అనకూడదు అనడంతో ఆమె ప్లేట్ ఫిరాయిస్తుంది. అంతేకాదు, హనీతో ఇకపై మేమే మీ అమ్మానాన్నలము అని చెబుతుంది.

ఆస్తి కోసమే... ప్లాన్ వివరిస్తూ: ఆ తర్వాత ధనుంజయ్‌తో రత్నప్రభ 'సామ్రాట్‌కు వారసురాలు హనీ.. అది తప్పితే వారసులు ఎవరూ లేరు. దానికి మనం తప్పితే వేరే రక్త సంబంధీకులు ఎవరూ లేరు. జాగ్రత్తగా డీల్ చేస్తే ఈ ఆస్తి మనది అవుతుంది' అంటుంది. దీనికతడు 'మనకు చిన్న ముక్క దొరికినా చాలు పట్టుకుని పోదాం అని వచ్చాం. నువ్వేమో మొత్తం సామ్రాట్ గాడి ఆస్తికే ఎసరు పెట్టావు.. ఇది జరిగే పనేనా' అంటాడు. దీనికి రత్నప్రభ 'జరిగితీరాలి. చేతకాని బిజినెస్ చేసి ఆస్తిని హారతి కర్పూరం చేశావు. ఇండియాకు రావడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి తెచ్చావు' అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 9th 2023

హనీని లేపేసి.. తులసిపైనా: అనంతరం రత్నప్రభ 'సామ్రాట్‌ను పైకి పిలిపించుకుని దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చాడు. దీన్ని వాడుకోకపోతే మనం బాగుపడం. ఫస్ట్ స్టెప్ హనీని మనం గ్రిప్‌లో పెట్టుకుని మన మాట వినేలా చేసుకోవాలి. ముసలాయనకు హనీని మనం కళ్ళలో పెట్టుకుని చూసుకుంటున్నట్టు నటించాలి' అంటుంది. దీంతో ధనుంజయ్ 'హనీ ప్రవర్తన చూస్తుంటే అది జరిగేలా లేదు' అంటాడు. అప్పుడు రత్నప్రభ 'అయితే లేపేద్దామా? ఆలోచిస్తూ కూర్చుంటే పరిస్థితులు చేజారిపోయి తులసి అడ్డుపడొచ్చు. సామ్రాట్‌కు బిజినెస్‌లో, ఇంట్లో తులసికి ఉన్న విలువ వేరు. తను ఉన్నా లేకపోయినా తన విలువ మారదు. నెమ్మదిగా విలువ తగ్గించాలి. సైలెంట్‌గా తులసిని ఈ ఇంటిని దూరం చేయాలి' అని తన ప్లాన్‌ను వివరిస్తుంది.

తులసి అలా.. నందూ ఇలా: ఇంటికి తిరిగి వచ్చిన తులసితో నందూ 'హనీ దగ్గర కాసేపు ఉండొచ్చు కదా' అంటాడు. దీంతో 'టిఫిన్ పెట్టేసి వచ్చాను. యూఎస్ నుంచి సామ్రాట్ కజిన్ బ్రదర్ ఆయన భార్య వచ్చారు. ఇక నుంచి హనీ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు చూసుకుంటారు. ఇక నా అవసరం అక్కడ లేకపోవచ్చు' అని చెప్తుంది. దీంతో నందూ 'బిజినెస్, ఇంటి వ్యవహారాల్లో మనం జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు. ఏదైనా అయితే మధ్యతరగతి వాళ్ళం మన మీద నింద వేస్తారు' అంటాడు. అప్పుడు తులసి 'నా బాధ అంతా హనీ గురించి. తనని సామ్రాట్ కంటికి రెప్పలా చూసుకున్నారు. ఇప్పుడు ఆయన దూరమై హనీని బాధపెడుతున్నారు' అని ఫీల్ అవుతుంది. దీంతో నందూ 'ఎలాగైనా తులసి మనసు మార్చి నా ప్రేమను చెప్పాలి' అని అనుకుంటాడు.

జాహ్నవి ఎంట్రీ.. దూరంగా: ప్లాన్‌లో భాగంగా బసవయ్య కూతురు జాహ్నవి ఎంట్రీ ఇస్తుంది. ప్రసన్న దిష్టి తీసి కూతుర్ని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. రాగానే అత్తయ్య అంటూ రాజ్యలక్ష్మి దగ్గరకి వెళ్ళి కౌగలించుకుంటుంది. తర్వాత రాజ్యలక్ష్మితో మాట్లాడి.. అందరినీ కిందకు రమ్మని అరుస్తుంది. తర్వాత దివ్యను చూసి ముఖం మాడ్చుకుంటుంది. అలాగే, విక్రమ్ రాగానే హగ్ చేసుకుని బుగ్గలు నిమురుతుంది. అనంతరం అతడిని దివ్యతో కలిసి ఆస్పత్రికి వెళ్లకుండా ఆపుతుంది. అది చూసి రాజ్యలక్ష్మి వాళ్లు సంతోషిస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X