Intinti Gruhalakshmi Today Episode: కోట్ల ఆస్తి గురించి నిజం చెప్పిన గాయత్రి.. అంకితకు తులసి షాక్

దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

Recommended Video

Vikram Hit List Movie Public Talk #VOX | Filmibeat Telugu
గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అంకిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. అప్పుడు నందూ.. అభిని పిలిచి చాలా గొప్పగా చెబుతూ పక్క వాళ్లకు పరిచయం చేస్తాడు. కానీ, ప్రేమ్‌ను మాత్రం అందరి ముందే అవమానిస్తాడు. ఆ తర్వాత అంకిత.. లాస్య వాళ్లు తెచ్చిన డ్రెస్‌ను కాదని, తులసి ఇచ్చిన చీరను కట్టుకుంటుంది. దీంతో గాయత్రి దానిపై జ్యూస్ పోస్తుంది. అయితే, తులసి ఆ చీర స్పెషల్ అని జ్యూస్ తుడిచేస్తుంది. అనంతరం కేక్ కట్ చేసిన అంకిత తులసికి పెడుతుంది. దీంతో లాస్య, నందూ ఆమె చేసిన దానికి తీవ్ర ఆగ్రహంతో ఉంటారు.

కోట్ల ఆస్తి గురించి చెప్పిన గాయత్రి

కోట్ల ఆస్తి గురించి చెప్పిన గాయత్రి

అంకిత తీరుపై లాస్య, నందూ, గాయత్రి, అభి సీక్రెట్‌గా మాట్లాడుకుంటారు. ఆ సమయంలో అంకిత ప్రవర్తనపై అభి అందరికీ క్షమాపణలు చెబుతాడు. ఆ తర్వాత గాయత్రి ‘మనకు కోట్ల ఆస్తి కలిసి వచ్చింది అనే విషయం.. అస్సలు తులసికి తెలియకూడదు' అని అభితో అంటుంది. దీనికి అతడు చెప్పను అన్నట్లుగా తలూపుతాడు. అయితే, ఆ విషయాన్ని తులసి వింటుంది. అక్కడే ఉన్న లాస్య, నందూ మాత్రం ఏమీ తెలియనట్టు ఆస్తి కలిసిరావడం ఏంటని అడుగుతారు. దీంతో గాయత్రి ‘కోర్టులో వారసత్వం కింద ఉన్న కేసు మా వైపు వచ్చింది' అని చెబుతుంది.

అభి చేసిన దానికి బాధపడ్డ తులసి

అభి చేసిన దానికి బాధపడ్డ తులసి

గాయత్రి మాటలకు లాస్య ‘ఆస్తి విషయం గురించి మనం ఎవరం తులసికి చెప్పం కానీ.. అంకిత చెబితే ఎలా' అంటుంది. దీనికి గాయత్రి ‘అంకితను పిచ్చిదాన్ని చేసి తులసి డబ్బు నొక్కేస్తుంది. అసలే అవసరాల్లో ఉంది' అంటుంది. దీంతో తులసి ఈ మాటలు విని బాధపడుతుంది. అప్పుడు గాయత్రి ‘గాయత్రి, లాస్య అన్ని మాటలు అంటుంటే.. నా కొడుకు చూస్తూ నిలబడ్డాడు' అని బాధపడుతుంది. ఇంతలో అక్కడకు అంకిత వస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లారు ఆంటి అని అడుగుతుంది. దీంతో ఇక్కడే ఉన్నా అని కళ్లు తుడుచుకుని చెప్తుంది.

భోజనం చేయకుండా వెళ్తామంటూ

భోజనం చేయకుండా వెళ్తామంటూ

అంకితతో మాట్లాడిన తర్వాత తులసి ఇక మేము బయలుదేరుతాం అని అంటుంది. దీంతో అంకిత ‘అదేంటి.. అందరూ భోజనం చేసి వెళ్లాల్సిందే. ఫంక్షన్‌లో జరిగిన దాని గురించి బాధపడుతున్నారా' అని అడుగుతుంది. దీనికి తులసి ‘నేను అలా అనుకునేదాన్నే అయితే అసలు వచ్చేదాన్నే కాదు' అంటుంది. ఇంతలో అభి వచ్చి ఏమైంది అంటాడు. దీనికి అంకిత.. తులసి ఆంటి భోం చేయకుండా వెళ్తాం అంటున్నారు అంటుంది. దీంతో భోజనం చేయమంటాడు అభి. అప్పుడు తులసి ‘నువ్వు అంతగా అమ్మ గురించి ఎక్కువగా ఆలోచించకు. దాని వల్ల ఎక్కువగా లాభం లేదు. ఈ అమ్మ తన బిడ్డలను నిస్వార్థంగా పెంచింది. ఇప్పటికే కాదు.. మీ అమ్మ ఎప్పటికీ అలాగే ఉంటుంది. నేను కోరుకునేది ఒకటే.. నా బిడ్డల సంతోషం' అని అంటుంది.

అంకితను తన గడప తొక్కదంటూ

అంకితను తన గడప తొక్కదంటూ


అభితో మాట్లాడిన తర్వాత తులసి ‘నీ పుట్టిన రోజు సందర్భంగా నాకు ఒక బహుమతి కావాలి అంకిత.. ఇస్తావా' అని అడుగుతుంది. దీనికామె తలూపగానే ‘ఈ క్షణం నుంచి నువ్వు మా ఇంటి గడప తొక్కడానికి వీలు లేదు. నేనంటే నీకు ఎంతో గౌరవం. నా మాటకు విలువ ఇస్తావని తెలుసు' అని అంటుంది. దీనికి అనసూయ అదేంటి అని ప్రశ్నిస్తుంది. దీంతో తులసి ఏం మాట్లాడదు. అప్పుడు అంకిత ‘నేనేం తప్పు చేశాను ఆంటి. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు' అని అడుగుతుంది. దీనికి తులసి ‘తప్పు చేశావని కాదు.. అందరికీ మంచి జరగాలని.. జరుగుతుందని ఆశపడి ఈ నిర్ణయం తీసుకున్నా' అంటుంది. దీనికి ఎవరి మంచి అని అడుగుతుంది అంకిత. దీంతో అందరికీ అంటుంది తులసి.

తులసిపై గాయత్రి ఫైర్ అవడంతో

తులసిపై గాయత్రి ఫైర్ అవడంతో


తులసి నిర్ణయానికి అంకిత ఏడుస్తుండడంతో గాయత్రి అక్కడికి వచ్చి.. ‘ఎందుకే ఏడుపు? పీడ విరగడ అయిందని సంతోష పడక' అని అంటుంది. అప్పుడు లాస్య ‘అంకితను పుట్టిన రోజున ఏడిపిస్తావా? ఇదేనా నీ పెద్దరికం' అని లాస్య అంటుంది. దీంతో తులసి ‘నువ్వు ఈ విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది' అని చెబుతుంది. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక, తెల్లారగానే దీని గురించి పరందామయ్య, అనసూయ మాట్లాడుకుంటారు. అప్పుడాయన తులసి ఏం చేసినా దాని వెనుక బలమైన కారణం ఉంటుందని అంటాడు.

అభి గురించి నిజం చెప్పిన తులసి

అభి గురించి నిజం చెప్పిన తులసి

అంతలో అక్కడకు వచ్చిన తులసి.. వాళ్లకు అభి గురించి చెబుతుంది. ‘వాళ్లు నా మీద నిందలు వేస్తుంటే.. అభి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంకిత వాళ్లకు ఏదో కోట్ల ఆస్తి కలిసివస్తోందట. అది నాకు తెలిస్తే లేని ప్రేమ చూపించి.. ఆ ఆస్తి నొక్కేస్తానట. ఆస్తి వచ్చే విషయం మీ అమ్మకు తెలియనీయొద్దు అని అంటే నా కొడుకు గంగిరెద్దులా తలూపాడు కానీ.. మా అమ్మది పరాయిసొత్తు తీసుకునే మనస్తత్వం లేదు అని నా కొడుకు చెప్పలేకపోయాడు' అని బాధ పడుతుంది. దీనికి పరందామయ్య ‘వాడు జైలు పాలు అవుతుంటే నువ్వే కదా కాపాడింది. ఆమాత్రం ఆలోచించాలి కదా' అంటాడు.

అంకిత ఫోన్.. తన మాటలు చెప్పి

అంకిత ఫోన్.. తన మాటలు చెప్పి

ఆ తర్వాత తులసికి అంకిత ఫోన్ చేస్తుంది. కానీ, అది ఆమె కట్ చేస్తుంది. అలా ఎన్నిసార్లు చేసినా ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు అంకిత ‘నేను నీతో మాట్లాడాల్సిందే. ఎన్నిసార్లు అయినా ఎంతసేపు అయినా కాల్ చేస్తాను. మీరు ఎన్నిసార్లు కట్ చేస్తారో చూస్తా' అని అనుకుంటుంది. ఇంతలో అక్కడికి దివ్య వస్తుంది. తులసి దగ్గర ఫోన్ లాక్కొని కాల్ ఎత్తి స్పీకర్ పెట్టి అక్కడ పెడుతుంది. అంతేకాదు ‘వదిన.. మామ్ ఇక్కడే ఉంది. నీతో మాట్లాడటం లేదు కానీ.. నువ్వు చెప్పే విషయాలు అన్నీ వింటుంది' అంటుంది. అప్పుడు అంకిత ‘ఎందుకు నన్ను మీ ఇంటి గడప తొక్కొద్దన్నారు. మీరు ఏం చేసినా.. నేను మాత్రం మీకోసమే ఉంటాను. మీరు మాట్లాడే వరకూ ఇలానే ఫోన్లు చేస్తాను' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X