For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi September 20th Episode: తులసికి గుడ్ న్యూస్ చెప్పిన జీకే.. లాస్యకు మరో షాక్!

  |

  టెలివిజన్ ఇండస్ట్రీలు ఉన్న అన్ని భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్య ప్లాన్ ప్రకారం చేసిన తులసి మేనేజర్.. అక్షర కంపెనీకి పంపిన చెక్ బౌన్స్ అయ్యేలా చేస్తాడు. దీంతో పోలీసులు తులసిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఇంట్లోని అందరూ తులసిని నిందిస్తూ మాట్లాడతారు. అప్పుడు ప్రేమ్ తన తల్లికి మద్దతుగా నిలిచి వాళ్లతో గొడవ పడతాడు. వాళ్లు స్టేషన్‌కు వెళ్లే సమయానికి మోహన్ అక్కడకు చేరుకుని తులసికి బెయిల్ ఇస్తాడు. ఆ తర్వాత లాస్య వెళ్లి ఒంటరిగా ఉన్న శృతిని బ్లాక్‌మెయిల్ చేస్తుంది. ఎలాగైనా ప్రేమ్‌కు దూరంగా ఉండమని లేకుంటే ఇలాగే చేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తుంది.

  తులసిని అవమానించిన అనసూయ

  తులసిని అవమానించిన అనసూయ

  ఇంట్లో ఒంటరిగా ఉన్న శృతికి వార్నింగ్ ఇస్తూ లాస్య మాట్లాడుతుండడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. ప్రేమ్‌కు దూరంగా ఉండకపోతే మరిన్ని ఎక్కువగా ఇంట్లో సమస్యలు వస్తాయని చెప్పి బెదిరిస్తుంది లాస్య. ఆ తర్వాత తులసిని తీసుకుని నందూ, ప్రేమ్, అభి ఇంటికి తిరిగి వస్తారు. వాళ్లు రాగానే అనసూయ ‘రామ్మా రా.. నువ్వు చేసిన ఘనకార్యానికి ఎదురొచ్చి హారతులు ఇవ్వాలా' అంటూ అవమానిస్తుంది. ఆ తర్వాత లాస్య, అంకిత కూడా అదే రీతిలో మాట్లాడతారు. దీంతో ప్రేమ్ వాళ్లపై గొడవకు దిగుతాడు. అప్పుడు అభి అతడిని ఆపుతాడు.

  మహేశ్ బాబుపై శ్రీరెడ్డి సెక్సీ కామెంట్స్: ఫొటోను షేర్ చేసి మరీ ఘాటుగా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

   ఇంట్లో వాళ్లపై తులసి తీవ్ర ఆగ్రహం

  ఇంట్లో వాళ్లపై తులసి తీవ్ర ఆగ్రహం

  ప్రేమ్ మాట్లాడుతుండగా.. నందూ ‘ఏంట్రా ప్రేమ్ ఏమనుకుంటున్నావ్? ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావ్? అసలు మీరు చేయబట్టే ఇంట్లో ఉండాల్సిన తులసి కాళ్లు బయట పెట్టింది. ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకుంది' అని అంటాడు. అప్పుడు తులసి ‘ఇంక చాలు ఆపండి. నాకెంత సామర్ధ్యం ఉందో నాకు తెలుసు. చిన్న కారణంతో నన్ను మళ్లీ వంటిట్లో బంధించాలని చూడకండి. లాస్య నువ్వు ఈ కుటుంబం గురించి అంతగా ఆలోచించాల్సిన పని లేదు. అసలు ఈ కుటుంబానికి నీకు ఎలాంటి సంబంధం లేదు' అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహిస్తుంది.

  Bigg Boss: మూడో వారం నామినేషన్స్ లీక్.. ఈ సారి ఆ ఏడుగురు నామినేట్.. టైటిల్ ఫేవరెట్లకు బిగ్ షాక్

   లాస్యకు వార్నింగ్.. త్వరలో చూపిస్తా

  లాస్యకు వార్నింగ్.. త్వరలో చూపిస్తా

  తులసి మాట్లాడుతుండగా లాస్య ‘అసలు నీకెందుకు తులసి. ఇంట్లో కూర్చుని ఉండేదానికి ఇలాంటి అవసరమా' అంటుంది. అప్పుడు తులసి ‘అసలు ఈ కేసు ఎందుకు పెట్టారో.. దీని వెనుక ఎవరు ఉన్నారో త్వరలోనే తేలుస్తా. మేకవన్నే పులిని బయట పెడతా' అంటూ అందరి ముందే వార్నింగ్ ఇస్తుంది. అప్పుడామె ‘నేనేమీ చెక్కులిచ్చి ఫ్రాండ్ చేయలేదు' అంటుంది. దీనికి ప్రేమ్ ‘అవును లాస్య. నువ్వు ఇలాంటివి ఎందుకు చేస్తావ్? కాపురాలన కూలుస్తావ్.. పెళ్లైన వాళ్లను వల వేసి పట్టుకుంటావ్' అంటాడు. దీంతో నందూ అతడిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతాడు.

   నిజం చెప్పిన లాస్య.. తులసి సవాల్

  నిజం చెప్పిన లాస్య.. తులసి సవాల్

  చెక్ బౌన్స్ అవడానికి వెనుక పొరపాటు ఎక్కడ జరిగిందా అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు పురుషోత్తమే మొత్తం చేశాడని గ్రహిస్తాడు. అంతలో అక్కడకు లాస్య వస్తుంది. ‘ఏంటి తులసి అసలు ఇది ఎలా జరిగిందా అని ఆలోచిస్తున్నావా? పురుషోత్తం ఏమైపోయాడా అనుకుంటున్నావా? వాడు దొరకడు. ఎందుకంటే ఇదంతా చేసింది నేను కదా. జైలుకెళ్లడానికి రెడీగా ఉండు' అంటుంది. దీనికి తులసి ‘నువ్వే చేశావని తెలుసు. దీనికే తెగ సంబర పడకు. త్వరలోనే గెలిచి చూపిస్తా. ఆ పురుషోత్తంను పట్టుకుని నిజం బయటపెడతా' అని సవాల్ చేస్తుంది.

  Bigg Boss: ప్రియాంకకు రామ్ చరణ్ బంపర్ ఆఫర్.. నిహారిక పేరు చెప్పగానే ప్రామిస్.. హమీదాకు కూడా!

  ఎదురొస్తే భయపడాలి అంటూ జీకే

  ఎదురొస్తే భయపడాలి అంటూ జీకే

  జీకే దగ్గరకు వెళ్లిన మేనేజర్ ‘సార్ చెక్ బౌన్స్ కేసులో ఆ ఫ్యాక్టరీ ఓనర్‌ను అరెస్ట్ చేయించాం కదా.. ఆమె విడుదల అయ్యారు సార్' అని చెప్తాడు. ఆ సమయంలో జీకే ‘అవునా? మనం అరెస్ట్ చేయించాం అని తెలిసినా ఏ లాయర్ విడుదల చేసింది. మనకు ఎదురు పడితే భయపడాలి. అలాంటి యాక్షన్ తీసుకోవాలి' అని అంటాడు. ఆ తర్వాత మేనేజర్ ‘సార్ మనను వాళ్లు మోసం చేశారు కదా. మరి మన మెటీరియల్ వాళ్ల దగ్గర ఉంచాలా? లేకుంటే తిరిగి తీసుకోవాలా' అని అడుగుతాడు. దీనికి జీకే ‘పద నేను కూడా వస్తాను. ఎలా డీల్ చేయాలో నేర్చుకో' అని చెప్తాడు.

  తులసిని ఎంతో ఆశ్చర్యపరిచిన జీకే

  తులసిని ఎంతో ఆశ్చర్యపరిచిన జీకే

  మేనేజర్ తులసితో మాట్లాడుతుండగా జీకే చూస్తాడు. అప్పుడు గతంలో ఆమె గిరిధర్‌తో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత తులసి ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతుండగా ‘మీరేంటి ఇక్కడున్నారు? నేను మీకు తెలియకపోవచ్చు. కానీ, మీరు కరెంట్ ఆఫీస్ దగ్గరకు వచ్చినప్పుడు చూశాను. అయినా మీరు డైనమిక్ అని తెలుసు కానీ, ఇలా గుడ్డిగా నమ్మేస్తారు అని కూడా ఇప్పుడే తెలిసింది. అయినా ఎవరిని పడితే వాళ్లను ఎలా నమ్ముతున్నారు. ఈ ఫీల్డులో ఇలా గుడ్డిగా నమ్మి అడుగులు వేయకూడదు' అని చెప్పి ఎంతో ఆశ్చర్యపరుస్తాడు.

  Bigg Boss: షోలో ఆ హీరోను అవమానించిన నాగార్జున.. స్టేజ్ మీదే ఆమెతో అలా చేయడంతో విమర్శలు

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  తులసిని గుడ్ న్యూస్ చెప్పేసిన జీకే

  తులసిని గుడ్ న్యూస్ చెప్పేసిన జీకే

  జీకే అన్న మాటలకు ఆశ్చర్యపోయిన తులసి ఆ వెంటనే ఆయనకు సరైన సమాధానాలు ఇస్తుంది. ‘చూడండి సార్.. మీరు హోటల్‌కు వెళ్లి భోజనం చేయాలనుకుంటే.. అక్కడ వండిన వాడిపై నమ్మకం ఉండాలి. మీరు ఫ్లైట్‌లో వెళ్తుంటే దాన్ని నడిపే పైలట్ మీద నమ్మకం ఉండాలి. మీరు ఇంట్లో కూర్చుని ఉంటే అది నిర్మించిన వాళ్లపై నమ్మకం ఉండాలి. అసలు నమ్మకం లేకుండా ఏమీ చేయలేం సార్' అని అంటుంది. తులసి మాటలకు ఇన్‌స్పైర్ అయిన జీకే.. ఆమెపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటానని చెబుతాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 429: Tulasi Challenges Lasya. Then GK Met Tulasi and Inspired Very Much. After That He Take Back His Case.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X