twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ ఎలిమినేషన్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. నాగార్జున లేడు కదా అందుకే!

    |

    బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ - 3 జులై 21వ తేదీన ప్రారంభమై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. 15 మంది కంటెస్టెంట్లతో మొదటి వారం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగిపోతున్న ఈ షోలో గతంలో ఎన్నడూ చూడని కొత్త కొత్త విషయాలు ఈ సీజన్‌లో కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా విజయవంతంగా ఆరు వారాలను పూర్తి చేసుకున్న ఈ షోలో మునుపెన్నడూ లేని ఓ ఆసక్తికర పరిణామం ఈ వారం జరగనుందని తెలిసింది. వివరాల్లోకి పోతే..

    స్పెయిన్ వెళ్లిన అక్కినేని నాగార్జున

    స్పెయిన్ వెళ్లిన అక్కినేని నాగార్జున

    గత వారం నాగార్జున పుట్టినరోజు వేడుక నిమిత్తం అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి స్పెయిన్‌లోని ఐబిజాకు వెళ్లారు. నాగచైతన్య, సమంత, అఖిల్‌, నాగార్జున, అమల తదితరులు ఐబిజా ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కనిపించలేదు. అదే సీన్ ఆదివారం కూడా కొనసాగనుంది.

    ఫామ్ హౌస్‌లో నాగార్జున.. ఫారిన్ నుంచే

    ఫామ్ హౌస్‌లో నాగార్జున.. ఫారిన్ నుంచే

    శనివారం బిగ్‌బాస్ ఎపిసోడ్ ప్రారంభం కావడంతోనే ఎక్కడో ఫామ్ హౌస్‌లో నాగార్జున కనిపించాడు. యదావిధిగా నేను నాగార్జున అంటూ యాడ్ గురించి చెప్పి బిగ్‌బాస్‌ను ప్రారంభించారు. అయితే తాను బర్త్ డే కోసం విదేశాలకు వచ్చానని, అందుచేత ఈ వారం హోస్ట్ చేయలేకపోతున్నానని, వచ్చేవారం యధావిధిగా మీ ముందుకొస్తానని చెప్పారు నాగ్.

    నాగార్జునను రీ ప్లేస్ చేస్తూ రమ్యకృష్ణ..

    నాగార్జునను రీ ప్లేస్ చేస్తూ రమ్యకృష్ణ..

    నాగార్జున లేకపోవడంతో బిగ్‌బాస్ వేదికపైకి హోస్ట్‌గా రమ్యకృష్ణ వచ్చింది. నా మాటే శాసనం అంటూ ఝలక్ ఇస్తూ అందరినీ అలరించింది రమ్యకృష్ణ. బుల్లితెర ప్రేక్షకులను ప్రేక్షకులు సర్‌ప్రైజ్ చేస్తూ బిగ్ బాస్ హోస్ట్‌గా బాగా అమితంగా ఆకట్టుకుంది రమ్యకృష్ణ.

    ఈ వారం ఎలిమినేషన్‌..

    ఈ వారం ఎలిమినేషన్‌..

    తాజాగా అందిన సమాచారం మేరకు ఈ వారం ఎలిమినేషన్‌ ప్రక్రియ ఉండదని తెలుస్తోంది. ఈ వారం ముగ్గురు ఎలిమినేట్ అవడానికి నామినేట్ అయ్యారు. అయితే ఆ ముగ్గురిలో ఎవ్వరిని కూడా ఈ వారం ఎలిమినేషన్‌ చేయడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. నాగార్జున లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారట.

    వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్‌

    వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్‌

    సాధారణంగా ప్రతీ వారం ఒకరి ఎలిమినేట్ కావడం బిగ్ బాస్ రూల్. కానీ ఈ వారం ఎలిమినేషన్‌ క్యాన్సిల్ కావడంతో వచ్చేవారం డబుల్ ఎలిమినేషన్‌ చేయబోతున్నారని తెలుస్తోంది. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌ లిస్ట్‌లో ఉన్న హిమజ, రాహుల్, పునర్నవిలకు మరో వారం సమయం దొరికినట్లయింది.

    English summary
    Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 21st july. This season Was Host By Akkineni Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X