Bigg Boss 7 Telugu 2 Week Elimination సెన్సేషనల్ కంటెస్టెంట్ అవుట్.. వైల్డ్ కార్డు ఎంట్రీతో యంగ్ హీరో

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ రెండోవారం దిగ్విజయంగా పూర్తి చేసుకోబోతున్నది. మొదటి వారం కంటే రెండోవారం ఎమోషన్స్, ఫైట్స్‌తో ఇంటెన్స్‌గా సాగింది. ఆటగాళ్లందరూ డిఫెన్స్‌ను వదిలి ఎటాక్ మోడ్‌లోకి వచ్చారు. అయితే రెండోవారంలో మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ కోసం నామినేషన్‌లో ఉన్నారు. అయితే ఈ వారం ఎవరు సేఫ్ అయ్యారు? ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే విషయంలోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో రెండోవారం నామినేట్ అయిన వారిలో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్‌, యాక్టర్ శివాజీ, రతిక రోజ్, డాక్టర్ గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజా, షకీలా, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్ ఉన్నారు. అయితే వారిలో ఇద్దరు నామినేషన్స్ నుంచి బయటకు వచ్చారు. ఆదివారం ఇక మిగిలింది ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే.

Is Actor Shakeela eliminated from Bigg Boss 7 Telugu in 2n week of the Show?

అయితే రెండోవారం తొమ్మిది మంది నామినేట్ అయితే.. పవర్ అస్త్రను గెలుచుకొని యాక్టర్ శివాజీ ఇంటి సభ్యుడిగా మారడంతోపాటు నామినేషన్ నుంచి బయటపడ్డారు. కంటెస్టెంట్ నుంచి హౌస్‌మేట్‌గా మారిన శివాజీకి అన్ని రకాల సౌకర్యాలు ఇంటిలో పొందనున్నారు. ఇక శనివారం ఎలిమినేషన్ ప్రక్రియలో సీరియల్ నటుడు అమర్ దీప్ షేప్ అయ్యారు.

అయితే నామినేట్ అయిన మిగిలిన ఏడుగురు సభ్యుల్లో సీనియర్ నటి షకీలా ఎలిమినేట్ అయినట్టు సమాచారం. ఇంటిలో ఉన్న యువ కంటెస్టెంట్ల జోరు తట్టుకోలేకపోవడం, రెండోది వయసు ఆమెకు అడ్డంకిగా మారడం వల్ల ఫిజికల్ టాస్క్‌లో వెనుకబడింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో బలమైన ఫాలోయింగ్ లేకపోవడంతో సరైన రీతిలో ఓట్లు సంపాదించకపోవడం వల్ల ఎలిమినేట్ కావాల్సి వచ్చింది అని తెలిసింది.

ఇదిలా ఉండగా, ఇప్పటికే ఇంటి నుంచి సీనియర్ నటి కిరణ్ రాథోడ్, షకీలా ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇక వీరి స్థానంలో అంబటి అర్జున్, సురేఖావాణి కూతురు సుప్రిత ఇంటిలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. దాంతో ఇక ఇంటిలో మొత్తం యువ కంటెస్టెంట్లతో నిండిపోయే అవకాశం కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X