బిగ్‌బాస్ నుంచి టాప్ సెలబ్రిటీ అవుట్? పోటాపోటీగా ఓట్ల సమరం..
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో చివరి అంకానికి చేరుకొన్నది. మరో తొమ్మిది రోజుల్లో ముగియనున్నది. దాంతో ఇంటి సభ్యుల మధ్య పోటి తీవ్రతరమైంది. ఇప్పటి వరకు మంచితనాన్ని రుజువు చేసుకొన్న ఇంటి సభ్యుల్లో ఇక అసలు రంగు బయటపడే సమయం వచ్చేసింది. శనివారం ఎలిమినేషన్ ప్రక్రియను ఆదివారానికి వాయిదా వేయడం జరిగింది. ఈ వారం నామినేషన్‌లో అమిత్, దీప్తి, గీతా, రోల్ రైడా, కౌశల్ ఉన్నారు. వీరంతా టాప్ ఆటగాళ్లే కావడంతో ఎవరు బయటకు వెళ్తారనే అంశంపై ఆసక్తి పెరిగింది.

కౌశల్ నామినేషన్‌లో
ఇంటి సభ్యుల్లో గత కొన్నివారాలుగా కౌశల్ నామినేషన్‌లో ఉన్నాడు. గీతాకు లభించిన ఓ హక్కు కారణంగా కౌశల్ ప్రతీవారం నామినేషన్ ఉచ్చులో చిక్కుకొంటున్నాడు. కాకపోతే బయట నుంచి కౌశల్ ఆర్మీ సపోర్ట్ ఉండటంతో ఆయన సులభంగా బయటపడుతున్నాడు. ఈ వారం పెద్దగా కౌశల్‌కు ముప్పు ఉండకపోవచ్చు.

గీతా ఫిజికల్ టాస్క్‌లో
ఇంట్లో బిగ్‌బాస్ టైటిల్ ఎగిరేసుకొని పోయే సత్తా ఉన్న వారిలో నాని ఒకరు. గీతా ఫిజికల్ టాస్క్‌లో పెద్దగా రాణించకపోయినప్పటికీ.. మెంటల్ గేమ్ బాగా ఆడుతున్నది. మర్డర్ మిస్టరీ టాస్క్‌తో మరింత దూసుకెళ్తున్నది.

గల్లి పోరడు రోల్ రైడా
గల్లీ పోరడు రోల్ రైడాకు బాగానే మద్దతు లభిస్తున్నది. పెద్దగా గేమ్ షో లేకపోయినప్పటికీ... ఇంటి సభ్యుల నుంచి మద్దతు లభిస్తుండటంతో నామినేషన్ నుంచి గతంలో తప్పించుకొన్నాడు. ఇక ముగింపు దశకు చేరుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నామినేషన్ కావాల్సి వచ్చింది.

కెప్టెన్ టాస్క్‌లలో
కొద్ది వారాలుగా దీప్తి తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. కెప్టెన్ టాస్క్, ఇతర ఫిజికల్ టాస్క్‌లలో భయంకరంగా ఆడుతున్నది. దాంతో ఇంటి సభ్యులకు ఆమె సవాల్‌గా నిలుస్తున్నది. ఈ క్రమంలో ఈ వారం తెలికగానే ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

అమిత్ తివారీపై వేటు?
ఇక ఇంటిలో ప్రస్తుతం బలహీనమైన అభ్యర్థిగా అమిత్ ఉన్నారు. కానీ ఇంటి సభ్యుల పోటీ ముందు తట్టుకోలేక అమిత్ ఈ వారం ఇంటి నుంచి వెళ్లినట్టు తెలుస్తున్నది. ఈ వారం ఇంటి సభ్యుల మధ్య పోటాపోటీగా ఓట్ల సమరం జరిగిందట. అందులో తక్కువ ఓట్లు రావడంతో అమిత్ నిష్క్రమణ తప్పనిసరి అయినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











