బిగ్‌బాస్ తెలుగులోకి సెన్సేషనల్, మోస్ట్ కాంట్రవర్సీ ఉమెన్.. కొడుకును వదిలేసి కామన్ మ్యాన్ కేటగిరిలో ఎంట్రీ?

బిగ్‌బాస్ తెలుగు 8 ప్రారంభానికి తొలి అడుగు పడింది. రాబోయే సీజన్‌ కోసం ఎండెమాల్ షైన్ ఇండియా లోగోను రిలీజ్ చేసి.. త్వరలోనే అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటీ షోను మొదలుపెట్టబోతున్నామనే విషయాన్ని రివీల్ చేసింది. అయితే ఎప్పటిలానే లోగో వెనుక ఉన్న కథ ఏంటి? ఎవరెవరు ఇంటిలోకి వెళ్తున్నారనే విషయాలపై ఉత్సాహం కలుగుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ షోలోను దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో నిర్వహించే ఎండెమాల్ షైన్ ఇండియా తాజాగా బిగ్‌బాస్ తెలుగు 8 లోగో (Bigg Boss Telugu 8 Logo) ను రిలీజ్ చేసింది. సీజన్ 8 అంకె ఆకారంలో ఇన్ఫినిటీని సూచించే విధంగా లోగోను డిజైన్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే ఈ సీజన్‌లో ఫన్, కొట్లాటలు ఓ రేంజ్‌లో ఉండబోతున్నాయనే విషయాన్ని లోగోతో చెప్పకనే చెప్పారు.

Is Amrutha Pranay entry into Bigg Boss Telugu 8 Show Here is the expected contestants list

ఇక బిగ్‌బాస్ తెలుగు షోలోకి కంటెస్టెంట్లు ఎవరెవరు వస్తున్నారనే విషయంపై అనేక ఊహగానాలు మీడియాలో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు నిర్వాహకులు సుమారుగా 60 నుంచి 70 మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి ఓ లిస్టును ఫైనల్ చేశారు. వారితో ఇంటర్వ్యూలు, వారి అభిప్రాయలు, డిమాండ్ల గురించి చర్చిస్తున్నారు అనే విషయం తెలిసింది.

అయితే దాదాపు 25 మంది ఫైనల్ లిస్టును సిద్దం చేశారు. కానీ అందులో నుంచి కొన్ని మార్పులు, చేర్పులు చివరి నిమిషంలో కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదీ ఫర్‌ఫెక్ట్ లిస్టు అనుకోవడానికి వీలు లేదనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తున్నది. కాబట్టి కంటెస్టెంట్ల ప్రాబబుల్స్ ఎప్పటికప్పుడూ మారుతూనే ఉంటుంది అని చెప్పారు.

Is Amrutha Pranay entry into Bigg Boss Telugu 8 Show Here is the expected contestants list

ఇక తెలుగు బిగ్‌బాస్ 8 షోలో తాజాగా తెరపైకి వచ్చిన పేర్లు సింగర్ సాకేత్, దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పరువు హత్య కారణమైన, సూసైడ్ చేసుకొన్న మారుతీరావు కూతురు అమృత ప్రణయ్ షోలోకి రానున్నారనేది ప్రముఖంగా వినిపిస్తున్నాయి. , ప్రేరణ ఖమ్మం, వెబ్ సీరిస్ యాక్టర్ రవితేజ, మోటివేషనల్ స్పీకర్ వంశీ కృష్ణారెడ్డి, మోడల్ సయ్యద్ అబు, మోడల్ ఉర్మిలా చౌహాన్, యాక్టర్ హారిక, ఈటీవీ ప్రభాకర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

ఇక బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ సెప్టెంబర్ 1వ తేదీన గానీ లేదా 8వ తేదీన గానీ ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఈసారి విభిన్నంగా ఈ షో ఉండబోతుందనే విషయం ఇప్పటికే స్పష్టం అవుతున్నది. ఈ సీజన్‌లో రెండు రకాల సెట్స్ వేస్తున్నారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X