For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రముఖ షోలో ఊహించని సంఘటన: యాంకర్ రవి చేతికి గాయం.. భయంతో వణికిపోయిన గెస్టులు

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా తమ హవాను చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తన మార్క్ హోస్టింగ్‌తో లేడీ యాంకర్ల పోటీని తట్టుకుని మరీ నిలబడ్డాడు యాంకర్ రవి. అతడు ఏ షోలో ఉంటే అందులో సందడి అంతా ఇంతా ఉండదు. అందుకే వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడతను. ఈ క్రమంలోనే టాప్ యాంకర్ సుమ కనకాలతో కలిసి అతడు 'బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్' అనే షో చేస్తున్నాడు. ఇందులో ఊహించని సంఘటన జరిగింది. దీంతో యాంకర్ రవి చేతికి గాయమైనట్లు చూపించారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  అలా మొదలైన రవి ప్రయాణం

  అలా మొదలైన రవి ప్రయాణం

  దాదాపు పదేళ్ల క్రితమే బుల్లితెరపైకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చాడు రవి. తొలినాళ్లలోనే అద్భుతమైన యాంకరింగ్‌తో అలరించిన అతడు.. మంచి గుర్తింపును అందుకున్నాడు. అప్పటి నుంచి వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానాన్ని సంపాదించాడు. ఈ మధ్య కాలంలో టీవీ షోలు, సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు చేస్తున్నాడు.

  శ్రీముఖితో కలిసి రచ్చ చేశాడు

  శ్రీముఖితో కలిసి రచ్చ చేశాడు

  సుదీర్ఘ ప్రయాణంలో యాంకర్ రవి ఎన్నో షోలను సక్సెస్‌ఫుల్‌గా నడిపాడు. వాటిలో ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన ‘పటాస్' మాత్రం అతడికి ఎంతగానో గుర్తింపును తెచ్చి పెట్టింది. ఇందులో హాట్ యాంకర్ శ్రీముఖితో కలిసి అతడు చేసిన రచ్చకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. అదే సమయంలో కొన్ని విమర్శలూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ మధ్య దీనికి గుడ్‌బై చెప్పేశాడు.

  ఎప్పుడూ వివాదాలతో ఊంటూ

  ఎప్పుడూ వివాదాలతో ఊంటూ

  తన కెరీర్‌ మొత్తంలో యాంకర్ రవి ఎన్నో అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. అదే సమయంలో చాలా వివాదాల్లో చిక్కుకున్నాడు. ఆ మధ్య ఓ సినిమా ఫంక్షన్‌లో ఆడవాళ్లపై చేసిన కామెంట్స్ పెద్ద రాద్దాంతానికి కారణం అయ్యాయి. ఆ తర్వాత అతడు పలుమార్లు క్షమాపణలు చెప్పినా విమర్శల పాలయ్యాడు. ఇక, తరచూ డబుల్ మీనింగ్ డైలాగులతో హాట్ టాపిక్ అవుతూ ఉన్నాడు.

  హీరోగా మారాడు.. పోలీస్ కేసు

  హీరోగా మారాడు.. పోలీస్ కేసు

  యాంకర్ రవి కొన్నేళ్ల క్రితం ‘ఇది మా ప్రేమకథ' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ డిజాస్టర్ అయింది. దీనికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ సందీప్ తనను రూ. 41 లక్షలు ఇవ్వకుండా మోసం చేశాడని ఫిర్యాదు చేశాడని రవి అతడిపై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు పెట్టాడు. ఆ తర్వాత అతడు కూడా యాంకర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇది పెద్ద సంచలన అయింది.

  సుమతో కలిసి రచ్చ చేస్తుండు

  సుమతో కలిసి రచ్చ చేస్తుండు

  ప్రస్తుతం యాంకర్ రవి చేస్తున్న షోలలో ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్' ఒకటి. జీ తెలుగులో ప్రసారం అవుతోన్న ఈ కార్యక్రమంలో సెలెబ్రిటీలు గెస్టులుగా వస్తుంటారు. వాళ్లంతో కొన్ని గేమ్స్ ఆడించడమే దీని కాన్సెప్ట్. ఈ ప్రోగ్రాంకు రవితో పాటు సుమ కూడా యాంకర్‌గా చేస్తున్నాడు. ఇక, వచ్చే వారం ఎపిసోడ్‌లో ‘తెల్లవారితే గురువారం' హీరో హీరోయిన్లు శ్రీ సింహా, మిషా గెస్టులుగా వచ్చారు.

  రవితో ప్రయోగం చేసిన ఆర్టిస్టు

  రవితో ప్రయోగం చేసిన ఆర్టిస్టు

  ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్' వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో ఓ మేజీషియన్ వచ్చి పేపర్ కవర్లలో మేకులు ఉంచి ఓ ట్రిక్ చేశాడు. ఐదు కవర్లలో గెస్టులు చెప్పిన ఒక్కో కవర్‌ను చేతితో కొడుతూ వచ్చాడు. అలా కొట్టిన వాటిలో మేకు కనిపించలేదు. ఇక, చివర్లో రెండు మాత్రమే మిగిలగా.. వాటిని యాంకర్ రవితో కొట్టించాలని డిసైడ్ అయిపోయాడతను.

  Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu
  రవి చేతికి గాయం అయిందా?

  రవి చేతికి గాయం అయిందా?

  రెండు కవర్లు మిగలగా.. దేనిని కొట్టాలని మేజీషియన్ సుమను అడిగితే రెండోది అని చెబుతుంది. కొట్టేలోపు ఆగమని ఒకటో కవర్ ట్రై చేయమంటుంది. అప్పుడు రవి చేతిని పట్టుకుని దాన్ని కొట్టిస్తాడతను. ఆ తర్వాత ఏం జరిగిందో చూపించలేదు.. కానీ, రవి గట్టిగా అరవడం.. గెస్టులు, సుమ భయంతో నోరెళ్లబెట్టేయడం మాత్రం కనిపించింది. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

  English summary
  Suma Kanakala and Anchor Ravi Now Doing Big Celebrity Challenge with Thellavarithey Guruvaram Team. In This Show Anchor Ravi Injured.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X