యాంకర్ శ్యామల మళ్లీ ప్రెగ్నెంటా? గందరగోళం రేపిన పోస్టు
బిగ్‌బాస్ సీజన్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది యాంకర్ శ్యామల. అప్పటివరకు బుల్లితెరపై అడపదడపా సీరియళ్లు, వంటల ప్రోగ్రామ్స్, ఆడియో ఫంక్షన్లు చేసుకుంటూ వచ్చిన శ్యామల.. బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇవ్వడంతో మరింత క్రేజ్ పెరిగిపోయింది.

బిగ్‌బాస్ తెచ్చిన ఫేమ్..
పిన్ని గారు అంటూ శ్యామలకు నిక్ నేమ్ కూడా పడిపోయింది. శ్యామల, గీతా మాధురి, దీప్తీ ఒక గ్యాంగ్‌లా ఫామ్ అయి.. ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవారు. ఎలిమినేట్ అయిన శ్యామల.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. అయితే కౌశల్ ఆర్మీ సపోర్ట్‌తోనే ఎంట్రీ ఇచ్చిందని.. అందుకే లోపలికి వెళ్లాక కూడా అతనికి మద్దతు పలుకుతున్నట్లే ఆడిందని రూమర్స్ వినిపించాయి.

సోషల్ మీడియాలో పోస్ట్..
అయితే తాజాగా శ్యామల చేసిన పోస్ట్ ఆమెకు పెద్ద తలనొప్పిని తెచ్చినట్లైంది. మహిళ.. తల్లి కావడం అనేది ఓ గొప్ప అనుభూతి. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, నిద్ర లేని రాత్రులుంటాయి.. కానీ ప్రతీరోజూ ఏదో ఒకటి సాధించినట్లు ఫీల్ అవుతాము. అందుకే ఈ ఆనంద క్షణాలను సెలబ్రేట్ చేసుకోవడానికి నా భర్త నరసింహ.. డైమండ్ బ్రాస్లైట్ కానుకగా ఇచ్చాడు.

యాడ్ షూట్ అంటూ వివరణ..
అయితే ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు.. మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యారా అంటూ ప్రశ్నలు కురిపించసాగారు. అయితే అలాంటిదేమీ కాదని.. అదొక ప్రకటనకు సంబంధించినదని వివరణ ఇస్తోంది. దీంతో ఈ పోస్ట్ కొద్దిసేపట్లోనే వైరల్ కాసాగింది. దీంతో మరోసారి శ్యామల వార్తలల్లోకెక్కింది.
ఫ్యామిలీ మెంబర్స్‌లా...
బిగ్ బాస్ మూడు సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లందరూ ఒక్క ఫ్యామిలీలా కలిసిమెలిసి ఉంటున్నారు. ఎవరి ఇంట్లో ఈవెంట్లు జరిగిన మొదటి రెండు సీజన్ల కంటెస్టెంట్లతో పాటు.. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన మూడో సీజన్ కంటెస్టెంట్లు కూడా హాజరవుతున్నారు.


Click it and Unblock the Notifications











