శ్రీముఖి పటాస్ నుంచి తప్పుకొన్నది అందుకేనా?... యాంకర్ రవికి దూరంగా..

Recommended Video

Anchor Sreemukhi In To Biggboss Telugu 3 ? || Filmibeat Telugu

యాంకర్ శ్రీముఖి, రవి కలిసి రెండు, మూడు ఏళ్లకుపైగా పటాస్ అనే కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. కాలేజీ స్టూడెంట్స్ పాల్గొనే ఈ షోకు తెలుగు టెలివిజన్ రంగంలో మంచి రేటింగ్ ఉంది. దాదాపు వేలకుపైగా ఎపిసోడ్స్ పూర్తి చేశారు. ఇలా విజయవంతంగా సాగుతున్న కార్యక్రమం నుంచి శ్రీముఖి బ్రేక్ ఇస్తున్నట్టు వీడియో రిలీజ్ చేయడం ఫ్యాన్స్‌కు షాక్ తగిలింది. అయితే ఎందుకు ఈ కార్యక్రమం నుంచి తప్పుకొన్నారనే వార్తలు రకరకాలుగా మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల వెనుక అసలు విషయాలు కొన్ని బయటకు వచ్చాయి. అవేమిటంటే..

యాంకర్ రవి, లాస్య జంటకు

యాంకర్ రవి, లాస్య జంటకు

గతంలో బుల్లితెర మీద రవి, లాస్య జంటకు మంచి పేరు ఉండేది. అయితే వారి మధ్య విభేదాల కారణంగా విడిపోవడంతో రవితో శ్రీముఖి జతకట్టింది. బుల్లితెర రాములమ్మగా శ్రీముఖి ఓ క్రేజ్‌ను సంపాదించుకొని యాంకర్, హోస్ట్‌గా మంచి మార్కులు కొట్టేసింది. పటాస్ కార్యక్రమాన్ని ఓ రేంజ్‌కు తీసుకుపోవడంలో రవి, శ్రీముఖి మంచి పాత్రను పోషించారనడంలో సందేహాలు అక్కర్లేదు.

రవి, శ్రీముఖి మధ్య విభేదాలు అని

రవి, శ్రీముఖి మధ్య విభేదాలు అని

అయితే వినోద పరిశ్రమలో రూమర్లకు ఏం కొదువ ఉండవు. కానీ రవి, శ్రీముఖి మధ్య విభేదాలు వచ్చాయంటూ గతంలోనూ, ఇప్పుడు కూడా కొన్ని గాసిప్స్ వినిపిస్తుంటాయి. అయితే అలాంటి విభేదాల తాలుకు ప్రభావం బుల్లితెర మీద కనిపించిన దాఖలాలు లేవు. వారిద్దరి మధ్య సరసాలు, సెటైర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొన్నాయి. దాంతో వారి మధ్య విభేదాలు రూమర్లే అని స్పష్టమైంది.

పటాస్‌ నుంచి బ్రేక్ తీసుకొంటున్నా

పటాస్‌ నుంచి బ్రేక్ తీసుకొంటున్నా

తాజాగా మీతో ఈ వీడియో ద్వారా ఓ ముఖ్యమైన విషయాన్ని పంచుకోవడానికి వచ్చాను. నా జీవితంలో, కెరీర్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ షో పటాస్. అందులో భాగం చేసినందుకు మల్లెమాల ప్రొడక్షన్, శ్యాంప్రసాద్ రెడ్డి, దీప్తి గారికి థ్యాంక్స్. ఎప్పుడూ పటాస్ షూట్‌కు వెళ్లినా.. సెట్స్‌కు వెళ్లిన మాటల్లో చెప్పలేని ఎనర్జీ ఉంటుంది. స్టూడెంట్స్ అల్లరి నచ్చతుంది. ఐ లవ్ ది దట్ ఎనర్జీ. అలాంటి షో నుంచి నేను బ్రేక్ తీసుకొంటున్నాను. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి అనుమతి తీసుకొని ఈ నిర్ణయం తీసుకొన్నాను అని శ్రీముఖి వెల్లడించింది.

 బిగ్‌బాస్‌లో బుల్లితెర రాములమ్మ

బిగ్‌బాస్‌లో బుల్లితెర రాములమ్మ

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి పటాస్ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం బిగ్‌బాస్ షో అని చెప్పుకొంటున్నారు. త్వరలోనే బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్ ప్రారంభం కానున్నది. ఈ షోలో పాల్గొనేందుకు ఒప్పందం కుదిరిందని, అందుకే అనూహ్యంగా పటాస్ నుంచి తప్పుకోవడం జరిగిందని చెబుతున్నారు. అందుకే శ్యాంప్రసాద్ రెడ్డి అనుమతితో బ్రేక్ తీసుకొంటున్నాను అని చెప్పడంతో అసలు విషయంపై స్పష్టత వచ్చింది.

బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగార్జున

బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగార్జున

ఐపీఎల్, వరల్డ్ క్రికెట్ కప్ ప్రభావం బిగ్‌బాస్ తెలుగు షోపై పడింది. అందుకే రెగ్యులర్‌గా టైమ్ కాకుండా కొన్ని వారాలు ఆలస్యంగా ప్రారంభం కానున్నది. ఈ రియాలిటీ షోకు హోస్ట్‌గా అక్కినేని నాగార్జున వ్యవహరించనున్నారు. ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని, ఆయన మన్మథుడు 2 షూటింగ్‌లో ఉండటం వలన అధికారికంగా వెల్లడించడానికి వీలు కాలేదని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. త్వరలోనే హోస్ట్, సెలబ్రిటీల ఎంపికను పూర్తి చేసి జూలై రెండోవారంలో షోను ప్రారంభించనున్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X