సీక్రెట్‌గా శ్రీముఖి మ్యారేజ్ ఫిక్స్ .. వార్త లీక్ చేసిన టాప్ యాంకర్!
తెలుగు వినోద పరిశ్రమలో శ్రీముఖి పేరు తెలియని ప్రేక్షకులు, వీక్షకులు ఉండరు. బుల్లి తెరపై రాములమ్మగా పేరు సంపాదించుకొన్న శ్రీముఖి తనదైన శైలిలో టాప్ యాంకర్లలో ఒకరిగా స్థానం సంపాదించుకొన్నారు. అటు సినిమాల్లోను, ఇటు టెలివిజన్ రంగంలో కూడా తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకొన్నది. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఆమె తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీముఖి ఎంగేజ్‌మెంట్ వార్తను హోస్ట్ సుమ లీక్ చేసింది.
ఇక భోళా శంకర్ చిత్రంలో శ్రీముఖి పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా నటించబోతున్నట్టు సమాచారం. శ్రీముఖితోపాటు చిరంజీవి కూడా పవర్ స్టార్ అభిమానిగా నటిస్తున్నారు. భోళా శంకర్ సినిమా ఈవెంట్‌లో కూడా చిరంజీవి.. స్టేజ్‌పైన పవన్ కల్యాణ్ మేనరిజం ప్రదర్శించి అభిమానుల నుంచి భారీ స్పందనను రాబట్టుకోవడం తెలిసిందే.

భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవిని సిగ్గుపడేలా మాట్లాడారు. భోళా జీ.. ఐ లవ్ యూ అంటూ చిరంజీవికి సైగ చేసింది. నేను చాలా స్పీచ్ రాసుకొని వచ్చాను. కానీ మిమ్మల్ని చూడగానే అంతా ఎగిరిపోయింది. కానీ మీ డ్రస్సు, నా డ్రస్సు మ్యాచింగ్ అయింది.. అది చాలూ అని శ్రీముఖి అంటే.. మీరు ఫోన్ చేస్తే నేను మార్చుకొని వచ్చే వాడిని కదా అంటూ చిరంజీవి సైగల్ చేశారు.
శ్రీముఖి స్పీచ్ ముగిసిన వెంటనే యాంకర్ సుమ వచ్చి.. నీ మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా అంటూ బాంబు పేల్చింది. దాంతో కంగారు పడిన శ్రీముఖి.. సుమ మాటలకు అడ్డు పడుతూ అదేం లేదు అంటూ కవరింగ్ ఇచ్చింది. దాంతో సుమ వెంటనే టాపిక్ మార్చేసి.. శ్రీముఖిని అక్కడి నుంచి పంపేసింది.

అయితే శ్రీముఖి పెళ్లి ఫిక్స్ అయిందంటూ సుమ వార్తను లీక్ చేయగానే.. అందరిలో ఉత్సుకత పెరిగిపోయింది. శ్రీముఖి చేసుకోబోయే వ్యక్తి ఎవరు? శ్రీముఖిది ప్రేమ వివాహమా? పెద్దలు కుదర్చిన వివాహమా? అనే ప్రశ్నలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.
అయితే భోళా శంకర్ లాంటి భారీ ఈవెంట్‌లో శ్రీముఖి మ్యారేజ్ ప్రస్తావన యాంకర్ సుమ ఎందుకు తెచ్చారు. ఇంతకు శ్రీముఖి పెళ్లి నిజంగానే ఫిక్స్ అయిందా? శ్రీముఖి పెళ్లి వార్తను సీక్రెట్‌గా ఎందుకు ఉంచాలనుకొంటున్నారు అనే ప్రశ్నలు భోళా శంకర్ ఈవెంట్‌ను నుంచి వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి తన పెళ్లి గురించి అభిమానులకు ఏదైనా క్లారిటీ ఇస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











