ఆ బుల్లితెర నటుడితో శ్రీముఖి పెళ్లి? లైవ్‌లో హింట్ ఇచ్చిన యాంకర్ ఫ్యామిలీ

తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా దూసుకెళ్తున్నారు శ్రీముఖి. ప్రస్తుతం సుమ కనకాల తర్వాత ఆ రేంజ్ స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తున్నారు రాములమ్మ. సినిమా ఈవెంట్స్‌లో సుమ డామినేషన్ కనిపిస్తుండగా.. బుల్లితెరపై మాత్రం శ్రీముఖిదే హవా. ప్రస్తుతం ఎక్కువగా స్టార్ మాలోనే ఆమె సందడి చేస్తున్నారు. ఆదివారం విత్ స్టార్ మా పరివారం, కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ తదితర షోలను రాములమ్మ అద్భుతంగా హోస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 30 క్రాస్ చేసిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రత్యేకంగా ముస్తాబైంది. ఈ షోకు వచ్చిన శ్రీముఖి నాయనమ్మ.. తన మనవరాలి పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

బుల్లితెర నుంచి వెండితెరపైకి
పటాస్ షోతో కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి.. తన అందం, చలాకీతనంతో అతి తక్కువ టైంలోనే టాప్ యాంకర్‌గా దూసుకొచ్చారు. బుల్లితెరతో పాటు వెండితెరపైనా సందడి చేసింది. జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, నేను శైలజ, జెంటిల్మెన్, సావిత్రి, మనలో ఒక్కడు, బాబు బాగా బిజీ, క్రేజీ అంకుల్స్, మ్యాస్ట్రో, భోళా శంకర్ సినిమాలలో శ్రీముఖి నటించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా బుల్లితెరపైనే ఫోకస్ పెట్టారు శ్రీముఖి. భోళా శంకర్ తర్వాత రెండేళ్లుగా ఏ సినిమాకు ఆమె కమిట్ కాలేదు.

Is Anchor Sreemukhi Planning to Marry Vishnukanth Grandmother s Shocking Comment Sparks Buzz

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా
తాను ప్రేమలో పడ్డానని, బ్రేకప్ కూడా జరిగిందని బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడే శ్రీముఖి బయటపెట్టింది. దాంతో బాగా కుంగిపోయి ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. తన మాజీ ప్రియుడు బాగా పాపులర్ వ్యక్తని, ఇప్పుడు అతని పేరు బయటపెట్టడం తనకు ఇష్టం లేదని శ్రీముఖి తెలిపారు. ఆ తర్వాత కూడా పలువురితో బ్రేకప్స్ జరిగాయని సోషల్ మీడియా చిట్ చాట్‌లో బయటపెట్టి షాకిచ్చారు రాములమ్మ. ఆ తర్వాత పూర్తిగా కెరీర్‌పై ఫోకస్ పెట్టిన శ్రీముఖి.. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో పడిందని.. అతనిని పెళ్లాడబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తర్వాత అది గాలివార్తగా మిగిలింది. తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో శ్రీముఖి పెళ్లిపై ఓ షాకింగ్ న్యూస్ బయట చక్కర్లు కొడుతోంది.

సంక్రాంతికి స్టార్ మా సిద్ధం
సంక్రాంతి సందర్భంగా రాకింగ్ రాకేష్ తన భార్య జోర్దార్ సుజాత, బిగ్‌బాస్ ఫేమ్ ప్రేరణ కంభం తన భర్త శ్రీపాద్, బుల్లితెర హీరోయిన్లు పల్లవి రామిశెట్టి, పల్లవి గౌడలు తమ కుటుంబ సభ్యులు, బంధువులతో ఈ షోకు వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ముందుగా పల్లవి రామిశెట్టి కొడుకు వచ్చి తన ముద్దు ముద్దు మాటలతో హాయ్ ఫ్రెండ్స్.. హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ అని చెప్పి అందరినీ అలరించాడు. అనంతరం కంటెస్టెంట్స్‌కి పూతరేకులు, ఇతర స్వీట్స్ తినిపించింది శ్రీముఖి.

ఆ నటుడిని ఇష్టపడుతున్న శ్రీముఖి
ఈ క్రమంలోనే శ్రీముఖి నాయనమ్మ వచ్చి మనవరాలిని ఆశీర్వదించింది. నాకు శ్రీముఖి చాలా ప్రాణం... ఇనప్ని రోజులు ఆమెను వదిలేసి ఉండటం చాలా కష్టమని పెద్దావిడ ఆవేదన వ్యక్తం చేసింది. మా ఫ్యామిలీ మొత్తంలోనే ఫస్ట్ మనవరాలిని నేనే అని శ్రీముఖి చెప్పింది. ఆ తర్వాత స్టార్ మాలో నువ్వు బాగా సీరియల్స్ చూస్తావు కదా? నువ్వు చూసే సీరియల్స్ పేరు చెప్పు అని శ్రీముఖి అడగ్గా.. గుండె నిండా గుడిగంటలని నాయనమ్మ చెప్పింది. అందులో హీరో బాలు నాకు బాగా ఇష్టమని అంది. ఆ వెంటనే బాలు బాగుంటాడు కదా? నేను పెళ్లి చేసుకోనా? అని శ్రీముఖి అడగ్గా.. పెద్దావిడ మరో మాట లేకుండా చేసుకోమ్మని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు.

శ్రీముఖికి గిఫ్ట్‌గా చీర
అయితే గుండె నిండా గుడిగంటలు హీరో బాలు అలియాస్ విష్ణుకాంత్‌పై తన అభిమానాన్ని శ్రీముఖి పలుమార్లు బయటపెట్టింది. కొద్దిరోజుల క్రితం ఆదివారం విత్ స్టార్ మా పరివారంకు హాజరైన బాలుకి శ్రీముఖి మ్యారేజ్ ప్రపోజల్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత వినాయక చవితి ఈవెంట్‌కు వచ్చిన విష్ణుకాంత్.. తాను స్వయంగా నేసిన చీరను శ్రీముఖికి గిఫ్ట్‌గా ఇవ్వడంతో నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు శ్రీముఖి - విష్ణుకాంత్ పెళ్లికి స్వయంగా ఆమె నాయనమ్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. మరి నిజంగానే విష్ణుకాంత్‌ని శ్రీముఖి ఇష్టపడుతుందా? లేక ఇదంతా స్క్రిప్ట్‌లో భాగమా? అనేది త్వరలోనే తేలిపోనుంది.

ఆ నటుడికి పెళ్లి, విడాకులు
ఇకపోతే.. విష్ణుకాంత్‌కు గతంలోనే సంయుక్త అనే అమ్మాయితో వివాహం జరిగింది. అయితే మనస్పర్ధల కారణంగా పెళ్లయిన కొద్దిరోజులకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరిద్దరి బ్రేకప్‌పై ఇండస్ట్రీలో రకరకాల రూమర్స్ హల్‌చల్ చేశాయి. పెళ్లి తర్వాత తమిళంలో విష్ణుకాంత్‌కు అవకాశాలు తగ్గగా.. తెలుగులో బిజీ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X