బాబు గోగినేని అరెస్ట్ తప్పదా? బిగుసుకొంటున్న దేశద్రోహం ఉచ్చు.. బిగ్‌బాస్‌కు మరో తలనొప్పి!

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : బాబు గోగినేని మెడ కు కేసుల ఉచ్చు

దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ, సామాజిక విశ్లేషకుడు బాబు గోగినేని మెడకు ఇటీవల నమోదైన కేసు బలంగా చుట్టుకొంటున్నట్టు కనిపిస్తున్నది. గత కొద్దికాలంగా ఈ కేసును పక్కన పెట్టిన తెలంగాణ పోలీసులు మళ్లీ తిరుగదోడుతున్నట్టు ఓ వార్త వెలుగు చేసింది. ఈ కేసుతోపాటు మరికొన్ని తీవ్ర ఆరోపణలు ఉన్నందున బిగ్‌బాస్ నుంచి రప్పించి విచారణ చేపడుతారనే వార్తలు కూడా మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

 హైకోర్టు ఆదేశాలతో కేసు

హైకోర్టు ఆదేశాలతో కేసు

ప్రజాజీవనంలో మత విద్వేశాలను రెచ్చగొట్టడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే హైకోర్టు సూచనల మేరకు బాబు గోగినేనిపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు కాబట్టి కేసు తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వంలో తీవ్రంగా స్పందిస్తే ఆయనకు ఇబ్బందులు తప్పవనే మాట వినిపిస్తున్నది.

బిగ్‌బాస్‌ నుంచి బయటకు తెస్తారా?

బిగ్‌బాస్‌ నుంచి బయటకు తెస్తారా?

ప్రస్తుతం బాబు గోగినేని తెలుగు బిగ్‌బాస్ షోలో పాల్గొంటున్నారు. ఆయనను బయటకు రప్పించి పోలీసులు విచారించేందుకు అడుగులు వేస్తున్నట్టు కథనాలు వినిస్తున్నాయి. ఒకవేళ బాబు గోగినేనిని బయటకు రప్పిస్తే మళ్లీ బిగ్‌బాస్‌కు పంపించడం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది.

 బాబు గోగినేనిపై కేసులు ఇవే

బాబు గోగినేనిపై కేసులు ఇవే

ఒకవేళ బాబు గోగినేని బయటకు రప్పిస్తే బెయిల్ దొరకని విధంగా కేసు తీవ్రత ఉంది. కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టారని, చీటింగ్, శాంతి భద్రతలకు విఘాతం, రెండు వర్గాలను రెచ్చగొట్టడం, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం లాంటి అంశాలతో ఐపీసీ సెక్షన్ 121, 121ఏ, 153 ఏ, 53 బీ, 406, 420, 504, 505, 295 ఏ, 292, 293 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ముమైత్ ఖాన్ మాదిరిగానే

ముమైత్ ఖాన్ మాదిరిగానే

బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొనే సెలబ్రిటీలు ఇలా కేసులో ఇరుక్కుపోవడం ఇది మొదటిసారి కాదు. గతేడాది షో సందర్భంగా డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ ఆరోపణలు రావడం సంచలనం రేపింది. ఆ సమయంలో ఆమె బయటకు తీసుకు వచ్చి విచారించారు. అది చాలా చిన్న కేసు కావడంతో ముమైత్ పెద్దగా కష్టపడాల్సిన పరిస్థితి ఎదురు కాలేదు.

ఆసక్తికరంగా బాబు గోగినేని కేసు

ఆసక్తికరంగా బాబు గోగినేని కేసు

బాబు గోగినేనిపై తీవ్రమైన కేసులు నమోదైన కారణంగా అతడిని బిగ్‌బాస్ నుంచి బయటకు తీసుకు వస్తారా? లేక అతడు ఎలిమినేట్ అయ్యేంత వరకు పోలీసుల వేచి చూస్తారా అనే విషయంపై క్లారిటీ లేదు. ఒకవేళ బయటకు తీసుకు వస్తే కచ్చితంగా రిమాండ్‌కు తరలించాల్సిందే అనే వాదన న్యాయ నిపుణులు వినిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X