ముఖం చాటేస్తున్న విక్టరీ వెంకటేష్, నాగార్జున... కాంట్రవర్సీ షోపై మరో దెబ్బ!

తెలుగు టెలివిజన్ రంగాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లిన రియాలిటీ షో తెలుగు బిగ్‌బాస్‌. గత రెండు సీజన్లతో ఈ కార్యక్రమం దుమ్ము దులిపేసింది. బిగ్‌బాస్ షోను హోస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్ ఓ లెవెల్‌కు తీసుకెళ్తే నేచురల్ స్టార్ నాని దానిని నిలబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో బిగ్‌బాస్ 3పై అందరి దృష్టిపడింది. ఎందుకంటే ఎన్టీఆర్ తర్వాత నాని ఈ షో నుంచి తప్పుకోవడంతో కొత్త బాస్ ఎవరు ప్రశ్ననే బుల్లి తెర ప్రేక్షకులను వెంటాడుతున్నది. అంతేకాకుండా ఈ షోను జూన్‌లో ప్రారంభించకుండా వాయిదా వేయాలనే రూమర్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇంతకీ బిగ్‌బాస్‌ షోలో ఏం జరుగుతున్నదంటే..

హోస్ట్‌ ఎంపికపై గందరగోళం

హోస్ట్‌ ఎంపికపై గందరగోళం

వాస్తవానికి జూన్‌లో బిగ్‌బాస్ 3 ప్రారంభం కావాల్సింది. అయితే మే రెండో వారంలోకి అడుగుపెడుతున్నా దానికి సంబంధించిన చప్పుడు వినిపించడం లేదు. అలాగే హోస్ట్ ఎవరనే విషయంపై క్లారిటీ లేదు. దాంతో ఈ షో ఇప్పట్లో మొదలవుతుందా అనే ప్రశ్న అందర్నీ తట్టుతున్నది. అయితే నిర్వాహకులు మాత్రం లోలోపల తమ పని తాము చేసుకుపోతున్నారనే విషయం అర్ధమవుతున్నది.

ప్రపంచ క్రికెట్ టోర్ని దెబ్బ

ప్రపంచ క్రికెట్ టోర్ని దెబ్బ

తాజా సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ 3 షోకు ప్రపంచ క్రికెట్ టోర్ని దెబ్బ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సారి ప్రపంచకప్‌ చాలా ప్రతిష్టాత్మకంగా, రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. ఈ సారి భారత్‌ జట్టు యువతరంతో ఉరకలేస్తుండటంతో అందరి దృష్టి క్రికెట్‌పైనే పడింది. అందుకే నిర్వాహకులు ఈ షోను జూలైకి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.

జూలై 21న ప్రారంభం

జూలై 21న ప్రారంభం

మీడియా సమాచారం ప్రకారం.. ప్రపంచ క్రికెట్ టోర్ని ముగిసిన తర్వాత వారం రోజులకు అంటే జూలై 21న ఈ షో మొదలవుతుందట. అయితే సమయం ఎక్కువగా ఉండటంతో కంటెస్టెంట్ల ఎంపిక కూడా నత్త నడకన సాగుతున్నట్టు తెలిసింది. అలాగే గతేడాది షో అనేక లీకులతో ఆసక్తికరంగా లేకుండా పోవడంపై నిర్వాహకులు దృష్టిపెట్టారట.

విక్టరీ వెంకటేష్ నో

విక్టరీ వెంకటేష్ నో

ఇక గతేడాది ముఖ్య అతిథిగా ఫైనల్‌ కార్యక్రమంలో పాలుపంచుకొన్న విక్టరీ వెంకటేష్‌ను హోస్ట్‌గా చేయమని సంప్రదించారట. అయితే F2 తర్వాత వరుస సినిమాలు చేస్తుండటం, వివాదాలకు దూరంగా ఉంటే వెంకటేష్ సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తున్నది. సాధారణంగా బిగ్‌బాస్ అంటే అనవసరపు వివాదాలతో రచ్చగా మారుతున్నది. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ కూడా ఎక్కువే. దాంతో ఈ వివాద కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారట.

 ముఖం చాటేసిన నాగార్జున?

ముఖం చాటేసిన నాగార్జున?

అలాగే మీలో ఎవరు కోటీశ్వరుడుతో హోస్ట్‌గా నూటికి నూరు మార్కులు సంపాదించుకొన్న మన్మథుడు నాగార్జునను కూడా హోస్ట్‌గా చేయమని అడిగినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం మన్మథుడు 2పై షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అలాగే బంగార్రాజు సినిమాను కూడా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా హిందీలో బ్రహ్మస్త్రతో కూడా బిజీగా ఉన్నాడు. దాంతో నాగ్‌ కూడా చేతులెత్తేసినట్టు తెలుస్తున్నది.

 అనుష్క శెట్టి పేరు తెరపైకి

అనుష్క శెట్టి పేరు తెరపైకి

ఇదిలా ఉంటే, ప్రస్తుతం హోస్ట్‌గా అనుష్క శెట్టి పేరు మీడియాలో మార్మోగుతున్నది. అయితే అనుష్క అంత సాహసం చేస్తుందా అనే ప్రశ్న మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ జేజేమ్మ వివాదాస్పద షోకు హోస్ట్‌గా ఉండే అవకాశం లేదంటున్నాయి సినీ వర్గాలు. ఏది ఏమైనా బిగ్‌బాస్ 3 హోస్ట్ ఎంపిక నిర్వాహకులకు కత్తిమీద సాముగానే మారిందని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X