Bigg Boss: బిగ్ బాస్ షో రద్దు.. హోస్ట్ కి వార్నింగ్
దేశంలో ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ నానాటికీ విస్తరిస్తోంది. ఓటీటీలు, సినిమాలు, ఇతరత్రా ఎన్ని వినోద సాధనాలు ఉన్నప్పటికీ మనదేశంలో టీవీయే ఎక్కువ మందికి వినోదాన్ని పంచుతుంది. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు దర్శక నిర్మాతలు టీవీలలో రకరకాల కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారు. వీటిలో బిగ్‌బాస్ కూడా ఒకటి. టీవీలలో, ఓటీటీలో ఎన్ని రియాలిటీ షోలు ఉన్నా బిగ్‌బాస్ క్రేజే వేరు. డచ్ భాషలో పాపులరైన బిగ్‌బ్రదర్ కాన్సెప్ట్ ఆధారంగా బిగ్‌బాస్‌ను తీర్చిదిద్దారు మేకర్స్.
ప్రాంతీయ భాషలకు విస్తరించిన బిగ్‌బాస్
విభిన్న వ్యక్తిత్వాలు, మనస్తత్వం ఉన్న వారిని వారి కుటుంబాలకు దూరంగా దాదాపు 100 రోజులకు పైగా ఉంచి గేమ్స్, టాస్క్‌లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే బిగ్‌బాస్ కాన్సెప్ట్. భారతేదశంలో తొలుత హిందీలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ మెగా రియాలిటీ షో తర్వాతి కాలంలో అన్ని ప్రాంతీయ భాషలకు విస్తరించి మంచి క్రేజ్ దక్కించుకుంది. కొత్తగా ఏదొచ్చినా వెర్రెక్కిపోయే తెలుగువారికి బిగ్‌బాస్ షో ఫేవరేట్‌గా మారిపోయింది. హిందీని మించి తెలుగు బిగ్‌బాస్ క్రేజ్‌ను, ఫేమ్‌ను సంపాదించుకుందంటే అతిశయోక్తి కాదు.

19 ఏళ్ల క్రితం బిగ్‌బాస్ ప్రారంభం
2006 నవంబర్ 3న హిందీలో తొలి బిగ్‌బాస్ సీజన్ సోనీ టీవీలో ప్రసారమైంది. గతేడాదితో కలిపి ఇప్పటి వరకు 18 సీజన్‌లను పూర్తి చేసుకుంది హిందీ బిగ్‌బాస్. తొలుత అర్షద్ వార్సి హోస్ట్‌గా అలరించగా.. ఆ తర్వాత శిల్పా శెట్టి, అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్‌లు ఈ కార్యక్రమాన్ని నడిపించారు. అయితే సీజన్ 6 నేటి వరకు సల్మాన్ ఖానే హోస్ట్‌గా వ్యవహరించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. బిగ్‌బాస్ అంటే సల్మాన్.. సల్మాన్ అంటే బిగ్‌బాస్ అన్నంతగా తన ముద్ర వేశారు సల్లూ భాయ్.
ఓటీటీలోనూ సక్సెస్ అయిన బిగ్‌బాస్
టీవీలో సక్సెస్ అయిన బిగ్‌బాస్ హిందీనీ 2021లో ఓటీటీలలోనూ స్ట్రీమింగ్ చేశారు. గతేడాదితో మూడో సీజన్‌ను అనిల్ కపూర్ హోస్ట్ చేశారు. బిగ్‌బాస్ ఓటీటీ 3 విజేతగా సనా మక్బుల్ నిలవగా.. నేజీ రన్నరప్‌గా నిలిచారు. ఈ ఏడాది కూడా బిగ్‌బాస్ ఓటీటీ 4ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. సాంప్రదాయకంగా జూన్ మూడు లేదా నాల్గవ వారంలో బిగ్‌బాస్ ఓటీటీ ప్రారంభమవుతుంది. అక్టోబర్‌లో టెలివిజన్‌లో ప్రసారమయ్యే వరకు దాదాపు 6 నుంచి 8 వారాల పాటు బిగ్‌బాస్ ఓటీటీ కొనసాగుతుంది. దీనికి కూడా వీక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
బిగ్‌బాస్ ఓటీటీ 4పై సందిగ్థత
అయితే ఈసారి బిగ్‌బాస్ ఓటీటీ 4 ప్రసారాలపై సందిగ్థత నెలకొంది. ఈ ఏడాది బిగ్‌బాస్ ఓటీటీ ఉండదని, దానికి బదులుగా నేరుగా బిగ్‌బాస్ 19ని నిర్వాహకులు ప్రారంభించనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బినిజయ్ ఆసియా (ఎండెమోల్ షైన్ ఇండియా) నిర్మాతలు ఈ షో నుంచి తప్పుకోవడంతో కొత్త నిర్మాణ భాగస్వాములతో మేకర్స్ చర్చలు జరుపుతుండటమే ఈ గందరగోళానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే బిగ్‌బాస్ 19 జియో హాట్‌స్టార్‌లో డిజిటల్‌గా ప్రీమియర్ అవుతుందని బాలీవుడ్ టాక్. ఈ పరిణామాలు బిగ్‌బాస్ ఓటీటీ ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తున్నాయి. మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడితేనే ఈ గందరగోళానికి ఫుల్‌స్టాప్ పడనుంది.


Click it and Unblock the Notifications











