For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5 list: సుడిగాలి సుధీర్ ఎంట్రీ అలా.. సెలబ్రిటీలు క్వారంటైన్‌కు వెళ్లేది ఎప్పుడంటే

  |

  తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకొని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న రియాలిటీ షో బిగ్‌బాస్ 5వ సీజన్‌కు రంగం సిద్ధమవుతున్నది. కరోనావైరస్ కారణంగా రెగ్యులర్ షెడ్యూల్ కంటే కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతున్న షో కోసం ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. గత సీజన్ల కంటే భిన్నంగా, కంటెస్టెంట్ల ఎంపికలో కూడా డిఫరెంట్‌గా ఉండేలా నిర్వాహకులు ఎండెమాల్ షైన్ ఇండియా ప్రత్యేక శ్రద్ద తీసుకొంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే బిగ్‌బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ల గురించి ఆసక్తికరమైన చర్చ, ఊహాగానాలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ షోలో ఎవరెవరు ఉండబోతున్నారంటే..

  Bigg Boss Telugu Season 5 : Contestants వీళ్ళే ! మీకు ఓకే నా ? || Filmibeat Telugu
  సరికొత్త స్ట్రాటెజీతో బిగ్‌బాస్ తెలుగు 5

  సరికొత్త స్ట్రాటెజీతో బిగ్‌బాస్ తెలుగు 5

  బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ప్రారంభానికి నెల, నెలన్నర ముందు నుంచే హంగామా ప్రారంభమైంది. మీడియాలో రకరకాల పేర్లతో సెలబ్రిటీల జాబితా వైరల్ అవుతున్నది. అయితే గుట్టుగా తన స్ట్రాటెజీని స్టార్ మా నిర్వాహకులు కొనసాగించడంతో ఈసారి ఎవరు ఉంటారో అనే ఆసక్తి మరింత పెరిగింది. అయితే మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తుండటంతో ఈ విషయంలో రకరకాల గందరగోళం ఏర్పడుతున్నది.

  బిగ్‌బాస్ ఇంటి వాతావరణం క్రేజీగా

  బిగ్‌బాస్ ఇంటి వాతావరణం క్రేజీగా

  బిగ్‌బాస్ తెలుగు 5 షో కోసం ఇప్పటికే సెట్ పనులు ప్రారంభించి పూర్తి చేసేందుకు నిర్వాహకులు బిజీగా ఉన్నారు. ఇంటిలోకి ఏర్పాటు చేయాల్సిన మౌళిక వసతులు, సదుపాయాలు తదితర విషయాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొంటున్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ సారి ఇంటి వాతావరణం మరింత కొత్తగా ప్రేక్షకులనే కాకుండా ఇంటి సభ్యులకు కూడా ఫీల్‌గుడ్‌గా ఉంటుందనే విషయం తెలిసింది.

  ఆగస్టు 22 నుంచి క్వారంటైన్‌కు

  ఆగస్టు 22 నుంచి క్వారంటైన్‌కు

  కోవిడ్ పరిస్థితు కారణంగా బిగ్‌బాస్ తెలుగు 5 షో ప్రారంభానికి ముందు గత ఏడాది అనుసరించిన ప్రోటోకాల్స్‌ను నిర్వాహకులు పాటిస్తున్నట్టు తెలిసింది. ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీలను ముందుగానే క్వారంటైన్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. తమ ప్లాన్‌లో భాగంగా ఎంపికైన కంటెస్టెంట్లను ఆగస్టు 22వ తేదీన గానీ, ఆ తర్వాత గానీ ప్రముఖ హోటల్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

  నాగార్జున లేటేస్ట్ ప్రోమోతో

  నాగార్జున లేటేస్ట్ ప్రోమోతో

  ఇక బిగ్‌బాస్ తెలుగు 5 షో ఎప్పుడెప్పుడూ ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు స్టార్ మా శుభవార్తను అందించింది. ఇటీవల హోస్ట్ నాగార్జునతో షూట్ చేసిన ప్రోమోను విడుదల చేసి మరింత క్రేజ్‌ను పంచారు. స్టైలిష్‌గా దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన తాజా ప్రోమోకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ షో సెప్టెంబర్ 12వ తేదీన ప్రారంభం కాబోతున్నదనే విషయాన్ని నిర్వాహకులు స్పష్టం చేశారు.

  బిగ్‌బాస్ కంటెస్టెంట్ల జాబితా అంటూ

  బిగ్‌బాస్ కంటెస్టెంట్ల జాబితా అంటూ

  ఇదిలా ఉండగా, మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న బిగ్‌బాస్ తెలుగు 5 కంటెస్టెంట్లు వీరే అంటూ ఓ జాబితా చక్కర్లు కొడుతున్నది.
  1. యాంకర్ రవి
  2. నవ్యస్వామి
  3. యాక్టర్ ప్రియ
  4. హీరోయిన్ ఇషా చావ్లా
  5. లహరి
  6. టెలివిజన్ నటుడు మానస్
  7. యాంకర్ వర్షిణి
  8. కొరియోగ్రాఫర్ అన్ని మాస్టర్
  9. టీవీ యాక్టర్ సన్నీ
  10. కార్తీక దీపం ఫేమ్ ఉమ

  యూట్యూబర్స్/ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయర్స్ నుంచి
  11. ఆర్జే కాజల్
  12. శ్వేతా
  13. సిరి
  14. లోబో

  స్టాండ్ బైగా
  1. ప్రియాంక
  2. నిఖిలు
  3. జ్యోతి

  సుడిగాలి సుధీర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో

  సుడిగాలి సుధీర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో

  ఇదిలా ఉండగా, జబర్దస్త్, ఢీ లాంటి షోలతో పాటు సినిమా రంగంలో వర్థమాన నటుడిగా రాణిస్తున్న సుడిగాలి సుధీర్ కూడా ఈ షోలో పాల్గొనబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సుడిగాలి సుధీర్ మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రవేశించబోతున్నారనే వార్త కూడా మీడియాలో చక్కర్లు కొడుతున్నది. సుడిగాలి సుధీర్‌కు భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తున్నది. అయితే సుడిగాలి సుధీర్ ఈ షోలో పాల్గొంటారా లేదా అనే విషయం త్వరలోనే స్పష్టం కానున్నది.

  English summary
  Most Popular show Bigg Boss Telugu Season 5 on Telugu Television is getting ready with news format. This show is going to air on September 12. As per reports, Final contestants will go for 20 days quarantine. Probable Contestants List Is Here!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X