Bigg Boss Telugu 7 బిగ్‌బాస్ షోలో ట్రిపుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరి మెడపై వేలాడుతున్న కత్తి!
బిగ్‌బాస్ తెలుగు 7 ఇంతకు ముందు సీజన్ల కంటే విభిన్నంగా సాగుతున్నది. ఎవరూ ఊహించని ట్విస్టులతో బిగ్‌బాస్ తాజా సీజన్‌ను ఉల్టా పుల్టాగా మార్చుతున్నాడు. ప్రతీవారం నాగార్జున అక్కినేని ఇంటి సభ్యులకు సెన్సేషనల్ విషయాలు చోటు చేసుకోబోతున్నాయని చెబుతూ వస్తున్నారు. అందుకు ఊహించినట్టే.. బిగ్‌బాస్ తెలుగు హిస్టరీలో 6వ వారం సంచలనంగా మారబోతున్నది. ఆ సెన్సేషనల్ విషయానికి వస్తే..
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో ఐదోవారం ఎలిమినేషన్ కోసం రంగం సిద్దమైంది. శుక్రవారం జరిగిన షూట్‌లో ప్రేక్షకులకు ఊహించని విధంగా కంటెంట్‌ను సిద్దం చేశారు. ఈ వారం ఇంటిలోకి 5 గురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లోకి చేరుకొన్నారు. ఇప్పటికే వారు ఇంటి సభ్యులతో జాయిన్ అయ్యారు. ఈ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కాబోతున్నది.

ఇక బిగ్‌బాస్ తెలుగు 7 ఐదోవారం ఎలిమినేషన్ కోసం బిగ్‌బాస్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఓటింగ్‌లో చివరి రెండు స్థానంలో నిలిచిన ఇద్దరిని కాకుండా మూడో స్థానంలో నిలిచిన శుభ శ్రీ రాయగురును ఎలిమేనేట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. శుభ శ్రీ ఎలిమినేట్ కావడం సెన్సేషన్‌గా మారింది.

ట్రిపుల్ ఎలిమినేషన్ టాపిక్ తెరపైకి రావడం.. తాజా ప్రోమోలో హోస్ట్ నాగార్జున అక్కినేని షోలో అట్టుడుగు స్థానంలో నిలిచిన ముగ్గురి పేర్లను చెప్పమని అడిగితే.. కంటెస్టెంట్లు తమకు తోచిన మూడు పేర్లు చెప్పారు. అయితే కంటెస్టెంట్లు చెప్పిన విధంగా కాకుండా ఈ ఇంటిలో ఉండటానికి అర్హత లేని ముగ్గురు పేర్లను రేపు నేను చెబుతాను అంటూ నాగార్జున చెప్పడంతో ట్రిపుల్ ఎలిమినేషన్ ఉంటుందా? అనే అనుమానం తలెత్తింది.


Click it and Unblock the Notifications











