‘ఉగ్రవాద బెట్టింగ్ యాప్స్‌తో బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు లింకు.. అరాచకాలకు కారణం నాగార్జున అక్కినేని’
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం గత కొద్ది రోజులుగా మీడియాలో భారీగా చర్చకు దారి తీసింది. ఈ వివాదంలో సామాజిక కార్యకర్తలు నమోదు చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో టెలివిజన్ యాక్లర్లు, బిగ్‌బాస్ కంటెస్టెంట్లపై కేసులు నమోదు అయ్యాయి. వారిని పిలిచి పోలీసులు విచారించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణల వివరాల్లోకి వెళితే..
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌లో ఎక్కువగా పాల్గొన్నది బిగ్‌బాస్ కంటెస్టెంట్స్. వివిధ బిగ్‌బాస్ తెలుగు సీజన్లలో పాల్గొన్న 50 మందికిపైగా బెట్టింగ్ యాప్స్‌ను జోరుగా ప్రమోట్ చేశారు. అయితే ఈ యాప్స్‌కు చాలా వరకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి అని నా అన్వేష్ ఆరోపించారు. ఉగ్రవాదులతో లింకు ఉన్న యాప్‌లను ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించారని ఆయన వీడియోలో పేర్కొన్నారు.

ఇక ఉగ్రవాదులతో లింక్ ఉన్న యాప్స్‌కు బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు సంబంధాలు ఉండటం వెనుక ప్రధాన కారణం ఆ షోను హోస్ట్ చేసే నాగార్జున అక్కినేని. పరోక్షంగా ఆయన పరిచయం చేసిన షో ద్వారా సెలబ్రిటీలు మారిన వారంతా బయటి దేశాలతో సంబంధాలున్నా యాప్స్. ఒకవేళ క్లాస్‌లో పిల్లాడు తప్పు చేస్తే.. టీచర్‌ది బాధ్యత. బిగ్‌బాస్ కంటెస్టెంట్లు తప్పు చేస్తే హోస్ట్, నిర్వాహకులదే తప్పు అని యూట్యూబర్ ఆరోపించారు.
పాపులర్ షో బిగ్‌బాస్‌లోకి ఊరు, పేరు, క్యారెక్టర్ లేని వాళ్లను ఎంపిక చేయడం వల్లే ఇాలాంటి దారుణాలు జరుగుతున్నాయి. బిగ్‌బాస్‌లో పాల్గొన్న దీప్తి సునైనా, అరియానా, జ్యోతి, దిల్ సే మహబూబ్ లాంటి 50 మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. దాని ప్రభావం వల్ల చాలా మంది తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకొన్నారు. వారి ఆత్మహత్యలకు ఎవరు బాధ్యులు? నాగార్జున బాధ్యత వహిస్తారా? బిగ్‌బాస్ షో నిర్వాహకులు సమాధానం చెబుతారా? అని యూట్యూబర్ ఘాటుగా స్పందించాడు.
బెట్టింగ్ యాప్ వల్ల చాలా కుటుంబాలు నాశనమయ్యాయి. ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక బాధపడుతున్నారు. పరువు పోతుందని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. అందుకు కారణం బిగ్‌బాస్ కంటెస్టెంట్లే. వారు ప్రచారం చేసి కోట్లు, విలువైన ఫ్లాట్స్, కార్లలో తిరుగుతున్నారు. ఓ యూట్యూబ్ సాంగ్ కోసం నాలుగు దేశాలకు వెళ్లి 2 కోట్లు ఖర్చు పెట్టి షూట్ చేశారు. వారికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? యూట్యూబ్ సాంగ్ కోసం అంత డబ్బు ఎక్కడిది?. మీ సినిమాలో పాటలకు కూడా అంత ఖర్చు చేయరు అని ప్రశ్నించారు.
బెట్టింగ్, ఇతర యాప్స్‌ను ప్రచారం చేసి అమాయాకులను బలి చేస్తున్నారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి అక్రమాలకు పాల్పడి హోటల్స్, రెస్టారెంట్స్ పెట్టుకొంటున్నారు. వారికి అంత డబ్బు ఎక్కడిది? ఇలాంటి వారికి బిగ్‌బాస్‌లోకి తీసుకు రావొద్దు. ఆ షో ద్వారా వచ్చిన ఫేమ్ ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. పల్లవి ప్రశాంత్, రాహుల్, సోహైల్ లాంటి వారిని ఎంకరేజ్ చేయవద్దు అని నా అన్వేష్ దారుణంగా కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











