Bigg Boss 8 Telugu: బిగ్ షాక్.. ముక్కు అవినాష్ సెల్ఫ్ ఎలిమినేషన్?
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అన్యూహం పరిణామం చోటు చేసుకుంది. బిగ్ బాస్ రీ లాంచ్ పేరిట 8 మంది కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటినుండి హౌస్‌లో ఉన్న వారిని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ (ఓజీ)గా, వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చినవారిని రాయల్ క్లాన్‌గా విడిపోయి గేమ్స్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఆరో వారం వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో ముక్కు అవినాష్ అనూహ్యంగా సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ హైయెస్ట్ పిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్తున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఎనిమిదో వారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ను డిసైడ్ చేశారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ లో సెలెబ్రేటీలు సందడి చేశారు. మెయిన్ గా మూవీ ప్రమోషన్స్ కోసం సినిమాల టీమ్స్ బిగ్ బాస్ హౌస్ లో వచ్చేశాయి. శనివారం రోజు.. కంగువా మూవీ ప్రమోషన్ లో భాగం సూర్య రాగా.. ఆదివారం ఎపిసోడ్ లో క మూవీ టీం, లక్కీ భాస్కర్ మూవీ టీం, అమరన్ మూవీ టీంలు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి.. సందడి చేశాయి. వీరు కాకుండా అనసూయ, సమీరా భరద్వాజ్, హైపర్ ఆది అదిపోయే రేంజ్ లో పార్మామెన్స్ లు ఇచ్చారు. స్పెషల్ ప్రోగ్రామ్ లతో దుమ్ము రేపి..బిగ్ బాస్ ఆడియన్స్ కు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించారు.

ఇక ఎనిమిదో వారం నుంచి ఎవరూ ఊహించని విధంగా మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. 8వ వారం ఎలిమినేషన్స్ లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో ఓజి క్లాన్ నుండి నిఖిల్, పృద్వి, విష్ణు ప్రియ, ప్రేరణ ఉండగా.. రాయల్ క్లాన్ నుంచి మెహబూబ్, నయని పావని నామినేషన్లలో నిలిచారు. అయితే.. ఈ వారం నాయని పావని ఎలిమినేట్ అవుతుందని చాలామంది భావించారు. చాలామంది బిగ్ బాస్ రివ్యూస్ కూడా నయని పావని ఈ వారం డేంజర్ జోన్ లో ఉందని, 8వ వారం నయని పావని ఎలిమినేట్ అవుతుందని అంచనా వేశారు. కానీ, అనూహ్యంగా నాగార్జున నయనిని సేవ్ చేసి, మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. ఎలిమినేషన్ అనంతరం మెహబూబ్ స్టేజ్ పైకి వచ్చి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
ఇదెలా ఉంటే.. ఎనిమిదో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తుంది. సండే ఎపిసోడ్ ముగించగానే నామినేషన్లకు సంబంధించిన ప్రోమో చూపిస్తారు కానీ ఈ వారం ప్రోమో కాస్త డిఫరెంట్ గా ఉంది. ఆ ప్రోమోలో ముక్కు అవినాష్ తనకు భరించలేక కడుపునొప్పి ఉందని, తాను చాలా ఇబ్బంది పడుతున్నాయని, ఆ కారణంతో తాను బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతున్నాను అంటూ అందరికీ షాక్ ఇస్తాడు. ఈ క్రమంలో నిజంగా వెళ్తున్నావా అంటే.. ప్రామిస్ గా తాను వెళ్తున్నానంటూ ఓటు కూడా పెడతాడు. ఇంతలోనే బిగ్ బాస్ ఎగ్జిట్ డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. దీంతో అందరికీ సెండ్ ఆఫ్ చెప్పి అవినాష్ అవుతోంది వెళ్ళిపోతాడు.
అయితే.. ముక్కు అవినాష్ ఎలినేషన్.. నిజమా లేదా ప్రాంక్ అనేది అనుమానంగా ఉంది. నిజంగానే అవినాష్ కడుపునొప్పితో బాధపడుతుంటే. ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి తిరిగి వస్తాడా? లేదా? అంతతోనే అవినాష్ బిగ్ బాస్ జర్నీ ముగిసిపోతుందా ? అనేది ఈరోజు ఎపిసోడ్లో తెలియాల్సి ఉంది. ఏదేమైనా ముక్కు అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో అందించిన ఎంటర్టైన్మెంట్ లిమిట్ లెస్. షో డల్ గా ఉన్న ప్రతిసారి తన కామెడీ టైమింగ్ తో కంటెస్టెంట్లలో జోష్ ను నింపేవాడు. ఒకవేళ నిజంగానే ముక్కు అవినాష్ ఉండే ఎలిమినేట్ అయితే.. బిగ్బాస్ షో పై ప్రభావం చూపుతోందని చెప్పాలి. అవినాష్ సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం ఏంటి? ఇదంతా బిగ్ బాస్ బిగ్ ప్లాన్ నే కావచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో ఈ రోజు ఎపిసోడ్ లో చూడాలి..


Click it and Unblock the Notifications











