Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి బ్రహ్మముడి ఫేమ్ కావ్య.. దీపిక రంగరాజు మానేస్తే సీరియల్ పరిస్థితి ఏంటో?

బిగ్ బాస్ సీజన్ ఇంకా మొదలు కాక ముందే కంటెస్టెంట్ లిస్ట్ వచ్చినట్లు సోషల్ మీడియాలో 14 మంది పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు బిగ్ బాస్.. 7 సీజన్స్ ను ఎంతో విజయవంతంగా పూర్తి చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ వలన పోలీసులు, కేసులు వరకు వెళ్లింది. ఈ బిగ్ బాస్ సీజన్ 7 పుణ్యమా అని ఇంత రచ్చ జరిగింది. దాంతో టీఆర్పీ రేటింగ్ కూడా భారీగా పెరిగిపోయింది.

ఇక త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 రెడీ అవుతుంది. గత ఐదు సీజన్ల నుంచి అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ కు కూడా నాగార్జున అని హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు 14 మంది కంటెస్టెంట్స్ వీరే అంటూ ఒక లిస్ట్ బయటపడిన విషయం తెలిసిందే . ఇక ఈ మధ్యనే ఇందులో మరో పేరు కూడా యాడ్ అయ్యింది అని చెప్పుకొస్తున్నారు.

Is Brahmamudi Serial Heroine Deepika Rangaraju step into bigg boss Telugu 8

బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు వారికి పరిచయమైన నటి దీపిక రంగరాజు కూడా బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ బ్యూటీ అయిన దీపిక.. బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగువారికి పరిచయమైంది. సీరియల్లో ఎంతో సీరియస్ గా ఉండే ఈమె పలుషోస్ లలో అల్లరి చేస్తూ వచ్చేరానీ తెలుగులో మాట్లాడుతూ అభిమానులను ఆకర్షించింది. ఎప్పటిలానే ఈ సీజన్లో కూడా ఎక్కువ సీరియల్ నటీమణులే ఉండనున్నారని సమాచారం అందుతుంది.

ఇక ఈ మధ్యనే ఆదివారం స్టార్ మా పరివారం షోలో దీపిక తాను బిగ్ బాస్‌కు వెళ్లాలని ఉందని తన కోరికను బయటపెట్టింది. దీంతో మేకర్ సైతం ఆమె అల్లరి మెచ్చి హౌస్ లోకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ నడుస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే బ్రహ్మముడి సీరియల్ రేటింగ్ తగ్గే అవకాశం ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మానస్, దీపిక ది మంచి ఆఫ్ స్క్రీన్ పెయిర్ అని చెప్పొచ్చు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు చేంజ్ అయినా కూడా సీరియల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అని అభిమానులు అంటున్నారు.

Is Brahmamudi Serial Heroine Deepika Rangaraju step into bigg boss Telugu 8

అసలు చెప్పాలంటే బ్రహ్మముడి సీరియల్ లో ఉన్న మానస్, హమీధా ఇప్పటికే బిగ్ బాస్ కు వెళ్లి వచ్చారు. ఇక ఇప్పుడు దీపిక కూడా అదే బాటలో నడుస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ, ఒకవేళ ఇదే కనుక నిజమైతే దీపికకు పేరు రావడం ఏమో కానీ, బ్రహ్మముడి సీరియల్ కు మరో కావ్య దొరకదు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Is Brahmamudi Serial Heroine Deepika Rangaraju step into bigg boss Telugu 8

ఇక బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ కోసం మేకర్ భారీగానే ఖర్చు పెడుతున్నారట. అందరూ స్టార్ నటీనటులే రంగంలోకి దిగుతుండడంతో ఒక్కొక్కరికి భారీ రెమ్యూనిరేషన్ ఇస్తున్నారని టాక్. ఇక దీపికకు కూడా అంతే భారీ మొత్తాన్ని ఇవ్వనున్నారని సమాచారం. అందుకే దీపికా కూడా హౌస్ లోకి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తుందని సమాచారం. ఇంకొన్ని రోజులు పోతే అసలు నిజం ఏంటి అనేది తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X