బిగ్ బాస్ హౌజ్ లో శృంగారం.. బాత్రూమ్ లో అలా.. షాకింగ్ విషయాలు చెప్పిన శివాజీ

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ ప్రస్తుతం కెరీయర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. అయితే శివాజీ 1997 నుంచే టాలీవుడ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. సపోర్టింగ్ యాక్టర్ గా, హీరోగా, విలన్ గా పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మిస్మమ్మ, అదిరిందయ్య చంద్రం, సత్యభామ, మంత్ర, తాజ్ మహాల్ వంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన కెరీయర్ లో 40కి పైగా సినిమాలు చేశారు.

అయితే శివాజీ 2014 వరకు వరసగా సినిమాలు చేశారు. కామెడీ, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా జోనర్ లో వరుస చిత్రాలతో థియేటర్లలో సందడి చేశారు. ఆయనకంటూ అభిమానులను కూడా సంపాదించుకున్నారు. ఇక శివాజీ సరిగ్గా పదేళ్ల పాటు ఎలాంటి సినిమాల్లో నటించలేదు. ఆయనకు టాలీవుడ్ లో సరైన అవకాశాలు అందలేదు. ఈ సమయంలోనే తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సీజన్ లో శివాజీ హవా మాములుగా లేదనే చెప్పాలి. హౌజ్ లో అందరికీ అన్న పాత్ర పోషించి, ప్రతి టాస్క్ లో తనదైన ప్రతిభను కనబర్చారు.

Is Contestants Romance in Bigg Boss Telugu House

ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 టైటిల్ ను దక్కించుకుంటారని అందరూ భావించారు. కానీ పల్లవి ప్రశాంత్ ఆ సీజన్ టైటిల్ ను గెలుచుకున్నారు. అమర్ దీప్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచారు. శివాజీ 2వ రన్నరప్ గా నిలిచారు. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చాక శివాజీకి మంచి ఆఫర్లు అందాయి. 90's - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ లో సాధారణ కుటుంబం, ప్రభుత్వ గణిత ఉపాధ్యాయుడి పాత్రలో అలరించారు. ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సిరీస్ హిట్ అయ్యింది. ఇక రీసెంట్ గా ప్రియదర్శి కోర్టు సినిమాలో మంగపతి పాత్రతో దుమ్ములేపారు. ఈ క్రమంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.

ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ల శృంగారంపై ఎదురైనా ప్రశ్నకు బదులిచ్చారు. బిగ్ బాస్ తెలుగులో హౌజ్ లో అలాంటి అవకాశం ఉండదని చెప్పారు. అసలు బంధించిన ఇంట్లో 100 రోజులు ఉండాలంటే చాలా కష్టమైన పని అని, పైగా బిగ్ బాస్ నుంచి వచ్చే టాస్క్ లు, హౌజ్ లోని కంటెస్టెంట్లతో జరిగే ఘర్షణలు, సంఘటనతో అసలు శృంగారంపైనే ధ్యాసే రాదని చెప్పారు. అలాగే 360 డిగ్రీల్లో హై క్వాలిటీ కెమెరాలు 24/7 చూస్తూనే ఉంటాయని తెలిపారు. ఇక బాత్ రూమ్ వరకు వెళ్లి డోర్ ఓపెన్ చేసి వెళ్లి డోర్ క్లోజ్ చేసే వరకు కూడా కెమెరాలు వాచ్ చేస్తూనే ఉంటాయని చెప్పారు. పూర్తిగా సీసీ టీవీ సర్వైలైన్స్ లోనే టాస్క్ లు, షో రన్ అవుతుందని వివరించారు.

మరోవైపు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి ముందుగానే ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రతిసారి అక్టోబర్ లో ప్రారంభమై డిసెంబర్ లో ముగుస్తుంటుంది. కానీ ఈసారి సమ్మర్ హాలీడేస్ ను యూజ్ చేసుకోవాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నారంట. అందుకని బిగ్ బాస్ 9 మేలో ప్రారంభమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈసారి హోస్ట్ గా అక్కినేని నాగార్జునకు బదులుగా రానా దగ్గుబాటి ఉండబోతున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X