రష్మీ గౌతమ్‌కు విల్లాను గిఫ్టుగా ఇచ్చిన హీరో: అతడి గురించి పెదవి విప్పబోతున్న యాంకర్

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు తెగ సందడి చేస్తున్నా.. అందులో చాలా తక్కువ మంది మాత్రమే అందం, అభినయం, హోస్టింగ్‌తో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంటున్నారు. అలాంటి వారిలో రష్మీ గౌతమ్ ఒకరు. సుదీర్ఘ కాలంగా తనదైన టాలెంట్లతో సత్తా చాటుతోన్న ఈ భామ.. అప్పుడప్పుడూ సినిమాల్లోనూ మెరుస్తూ వస్తోంది. దీంతో కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది. ఈ నేపథ్యంలో రష్మీ గౌతమ్‌కు ఓ ఫేమస్ హీరో ఖరీదైన విల్లాను గిఫ్టుగా ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాలు మీ అందరి కోసం!

సినిమాల నుంచి యాంకర్‌గా

సినిమాల నుంచి యాంకర్‌గా

యాంకర్‌గా మారడానికి ముందే రష్మీ గౌతమ్ మోడలింగ్ రంగంలో సందడి చేసింది. ఈ క్రమంలోనే ఆ తర్వాత సినిమాల్లోకి నటిగా ప్రవేశించింది. ఇలా ఎన్నో చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించింది. అలా చాలా కాలం పాటు ప్రేక్షకులను అలరించిన ఈ భామ.. ఆ తర్వాత యాంకర్‌గా మారి 'జబర్ధస్త్' షోలోకి అడుగు పెట్టింది. దీని ద్వారా ఎనలేని గుర్తింపును అందుకుంది.

ఆ లవ్ ట్రాక్‌తో ఫుల్ ఫేమస్

ఆ లవ్ ట్రాక్‌తో ఫుల్ ఫేమస్

జబర్ధస్త్ షో ద్వారా ఓ రేంజ్‌లో ఫేమస్ అయిపోయిన రష్మీ గౌతమ్ ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో ఆమె కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగింది. ఇలాంటి పరిస్థితుల్లోనే జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలు వచ్చాయి. దీంతో ఈ బ్యూటీ క్రేజ్ మరింతగా పెరిగింది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని, పెళ్లి జరుగుతుందని అంటున్నారు.

రష్మీ సినిమాల్లో నటించినా

రష్మీ సినిమాల్లో నటించినా

నటిగా పరిచయమైన కొత్తలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన రష్మీ గౌతమ్.. ఆ తర్వాత హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇచ్చింది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్ చేసినా.. వాటిలో 'గుంటూరు టాకీస్' మాత్రమే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రష్మీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా అవన్నీ నిరాశనే మిగిల్చాయి. దీంతో అడపాదడపాగానే సినిమాలు చేస్తూ వస్తోంది.

బొమ్మ బ్లాక్ బస్టర్ కాలేదుగా

బొమ్మ బ్లాక్ బస్టర్ కాలేదుగా

హీరోయిన్‌గా పెద్దగా సినిమాలు చేయని రష్మీ గౌతమ్.. ఇటీవలే 'బొమ్మ బ్లాక్ బస్టర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నందూ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఫలితంగా రష్మీకి విజయం మాత్రం దక్కలేదు. దీంతో ఈ సుందరాంగి మళ్లీ తన కెరీర్‌ మీదనే ఫోకస్ చేస్తోంది. ఫలితంగా ఫుల్ బిజీగా మారిపోయింది.

 ఇప్పుడు వాటిలోనూ భాగమే

ఇప్పుడు వాటిలోనూ భాగమే

కొంత కాలంగా సినిమాల వేగం తగ్గించేసిన రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్, అనసూయ వెళ్లిపోవడంతో ఇటీవలే 'జబర్ధస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలకు కూడా యాంకర్‌గా మారింది. అలాగే, కొన్ని భారీ ప్రాజెక్టుల్లోనూ ఆఫర్లు అందుకుందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పుడు మళ్లీ జబర్ధస్త్ షోకు గుడ్‌బై చెప్పిన ఆమె 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' షోను మాత్రమే నడిపిస్తోంది.

రష్మీకి విల్లా కొనిచ్చిన హీరో

తాజాగా రష్మీ గౌతమ్ 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో పాల్గొంది. వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ను 'బావగారూ బాగున్నారా' అనే కాన్సెప్టుతో చూపించబోతున్నారు. ఇక, ఇందులో కొందరు సెలెబ్రిటీలకు సంబంధించిన గాసిప్పుల గురించి చూపించి.. వాటికి సమాధానాలు చెప్పించే ప్రయత్నం చేశారు. ఇందులోనే రష్మీకి ఓ హీరో విల్లా కొనిచ్చాడని ఓ న్యూస్ చూపించారు.

ఆ హీరో ఎవరంటే.. సస్పెన్స్

ఆ హీరో ఎవరంటే.. సస్పెన్స్

'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో భాగంగా రష్మీ గౌతమ్ గురించి 'రష్మీకి ప్రముఖ హీరో విల్లా గిఫ్టుగా ఇచ్చారంట.. ఎవరా హీరో' అని ఓ యూట్యూబ్ థంబ్‌నెయిల్ చూపించారు. దీంతో జడ్జ్ ఇంద్రజ ఆ హీరో ఎవరు అని రష్మీని ప్రశ్నించారు. దీనికామె 'ఆ హీరో ఎవరంటే' అంటూ ఏదో చెప్పింది. ఇదంతా సస్పెన్స్‌గా ఉంచారు. దీంతో ఈ ప్రోమో విపరీతంగా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X