Bigg Boss: బిగ్‌బాస్ షోకు నలుగురు హోస్ట్‌లు? స్టార్ హీరోతోపాటు ఆ ముగ్గురు స్టార్స్ ఎవంటే?
బిగ్‌బాస్ రియాలిటీ షోలు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో కొత్త సీజన్లను మొదలుపెట్టడానికి ఎండెమాల్ షైన్ ఇండియా టీమ్ కసరత్తు చేస్తున్నది. అయితే వివిధ భాషల్లో హోస్ట్‌ల విషయంలో అనేక రూమర్లు, న్యూస్ అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి. అయితే బిగ్‌బాస్ షోలో ఇప్పటి వరకు ఏ భాషలోనైనా ఒకే హోస్ట్ ఉన్నారు. కానీ ఈసారి రొటీన్ ఫార్మాట్‌ను బ్రేక్ చేసి నలుగురు హోస్టులను హిందీ సీజన్‌లో పెట్టేందుకు సిద్దమవుతున్నారు. అయితే సల్మాన్ ఖాన్‌తోపాటు ఈ షోను హోస్ట్ చేసే ఆ నలుగురు స్టార్ సెలబ్రిటీలు ఎవరనే వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ 19 షో ప్రారంభానికి..
హిందీ భాషలో బిగ్‌బాస్ 19 షో ప్రారంభానికి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రోమో షూట్స్ పూర్తయ్యాయి. ఇటీవల సల్మాన్ ఖాన్‌తో ప్రోమోలు షూట్ చేసే పని కంప్లీట్ చేసుకొన్నారు. అలాగే కంటెస్టెంట్ల ఎంపి కూడా పూర్తయిందనే విషయంపై మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలు మాత్రం బిగ్‌బాస్ అభిమానుల్లో ఆసక్తిని భారీగా నింపుతున్నాయి.

హోస్ట్‌లు ఎవరెవరంటే?
ఇక కన్నడలో బిగ్‌బాస్ షోకు హోస్టింగ్ చేయనని చెప్పిన కిచ్చ సుదీప్ మరోసారి ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇక తెలుగులో నాగార్జున అక్కినేని తప్పించి బాలకృష్ణ నందమూరిని లేదా విజయ్ దేవరకొండను హోస్ట్‌గా చేస్తారనే విషయం మీడియాలో భారీగా చర్చ జరిగినా.. చివరకు నాగార్జున అక్కినేనినే హోస్టుగా కొనసాగించనున్నారు. మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో విజయ్ సేతుపతి హోస్టులుగా కొనసాగనున్నారు.
హిందీలో నలుగురు హోస్ట్‌లు?
అయితే హిందీ బిగ్‌బాస్ విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో నలుగురు హోస్ట్‌లు దర్శనం ఇవ్వనున్నారనే వార్త జాతీయ మీడియాలో వైరల్ అవుతున్నది. ఒకవేళ బిగ్‌బాస్ స్ట్రాటెజీ నిజమైతే.. ఇది వీక్షకులకు పండగలాంటి వార్తనే. బిగ్‌బాస్ 19 సీజన్‌కు సల్మాన్ ఖాన్‌తోపాటు ఫర్హా ఖాన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్‌ను హోస్టులుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. వారాంతంలో సల్మాన్ ఉండేలా.. వారం మధ్యలో స్పెషల్ ఎంట్రీగా ఈ ముగ్గురు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
తెలుగు హీరోయిన్, విలన్
బిగ్‌బాస్ 19 కోసం పలువురు సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. అనితా హస్సనందానీ, చింకి, మింకీ, ఆశీష్ విద్యార్థి, లతా సబెర్వాల్, అపూర్వ ముఖిజా, గౌరవ్ తనేజా, రీమ్ షేక్, ధనుశ్రీ వర్మ, పరమ్ సింగ్, భవికా శర్మ, హునార్ హాలీ తదితరులను సంప్రదించినట్టు తెలిసింది. అయితే ఈ షోలో ఫైనల్ లిస్టులో ఎవరు ఉంటారనే విషయం మరింత ఆసక్తిగా మారింది.
ఆగస్టులో సీజన్ 19
బిగ్‌బాస్ హిందీ సీజన్ 19 షో అనేక విశేషాలు, ఆసక్తికరమైన అంశాలతో ప్రారంభానికి సిద్దమవుతున్నది. ఈ షోను ఆగస్టులో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఆగస్టు మొదటి వారం కానీ, రెండో వారంలో మొదలు అవుతుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ షోపై భారీగా అంచనాలు పెరిగాయి. బిగ్‌బాస్ రియాలిటీ షో అప్‌డేట్స్, ఎక్స్‌క్లూజివ్ వార్తల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి..


Click it and Unblock the Notifications











