గంగవ్వ మిడ్ వీక్ ఎలిమినేషన్! ప్రధాన కారణం అదేనా?
Bigg Boss 8 Telugu: బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. ఈ సీజన్లో ఎవరూ చూడని, ఎవరూ ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సీజన్ తొలి నాలుగు వారాలు షో కాస్త నెమ్మదిగా సాగినా.. వైల్డ్ కార్డు ఎంట్రీలతో సీజన్ స్వరూపమే మారిపోయింది. గత సీజన్లో ఎన్నడూ చూడని కంటెంట్ ఇస్తుండటం, షో ఇంట్రెస్టింగ్ గా సాగుతుండటంతో హైయేస్ట్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్తుంది బిగ్ బాస్. ఇలా రసవత్తరంగా సాగుతున్న షోలో.. పదోవారంలో ఉహించని మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతుందని, ఈ ఎలిమినేషన్ లో స్ట్రాంగ్ కంటెంట్ ను హౌస్ నుంచి బయటికి పంపించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు? సడన్ గా మిడ్ వీక్ ఎలిమినేట్ చేయడానికి కారణాలేంటి?
బిగ్ బాస్ లో షో ద్వారా ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వైల్డ్ కార్డుల ద్వారా ఎనిమింది మంది పాత కంటెస్టెంట్లను హౌస్ లోకి తీసుకవచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఎంట్రీ ఇచ్చిన వారిలో హరితేజ, టేస్టీ తేజ, రోహిణి, గౌతమ్, నయని పావని, మెహబూబ్, ముక్కు అవినాష్, గంగవ్వ లు ఉన్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీతో బిగ్ బాస్ షో కాస్త జోష్ పెరిగింది. కంటెస్టెంట్ల మధ్య కూడా పోటీ పెరిగింది.అయితే.. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిలో ఓ కంటెస్టెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదే గంగవ్వ.

మై విలేజ్ షో ఫేమ్, ఫేమస్ యూబ్యూబర్ గంగవ్వ కూడా వైల్డ్ కార్డ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. సీజన్ 4 లో గంగవ్వ పాల్గొంది. కానీ, బిగ్ బాస్ హౌస్ వాతావరణం, ఆహార అలవాట్లను సర్ధుకోలేకపోయింది. వీటికి తోడు అనారోగ్య సమస్యలు తోడు కావడంతో కేవలం ఐదు వారాలు ఉండి.. హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. కానీ, కోట్లాది మంది అభిమానాన్ని మూటగట్టుకుంది. బిగ్ బాస్ తో గంగవ్వ దశ- దిశ కూడా తిరిగిపోయింది.
ఇక సీజన్ 8లో ఓ కొత్త లూక్ లో ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. తొలిరోజే తగ్గదేలే అన్నట్టుగా యంగ్ కంటెస్టెంట్లతో పోటీపడి టాస్క్ ఆడి గెలుపొందింది. స్పెషల్ పవర్స్ కూడా సంపాదించుకుంది. యంగ్ కంటెస్టెంట్లకు స్పూర్తి నిచ్చింది. ఇలా వయసుతో సంబంధం లేకుండా చాలా యాక్టివ్ గా ఉంటూ.. తన కామెడి టైమింగ్ తో నవ్వుల పువ్వులను పూయిస్తోంది. అలాగే.. ప్రాంక్ లతో కంటెస్టెంట్లకు చెమటలు పట్టిస్తోంది.
వయసు దృష్ట్యా గంగవ్వకు ఫిజికల్ టాస్కులు, గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం లేదు. అలాగే.. తోటి కంటెస్టెంట్స్ కూడా గంగవ్వను నామినేషన్స్ నుంచి మినహాయిస్తున్నారు. అయితే.. గత రెండు వారాలుగా గంగవ్వ వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఏ గేమ్ కూడా ఆడటం లేదు. టాస్క్ లో గంగవ్వ ఓ సంఛాలక్ గా మాత్రమే కన్పిస్తుంది. కానీ, బిగ్ బాస్ ఇంట్లో అందరూ కంటెస్టెంట్ల అభిమానాన్ని సంపాదించుకుంది. ఓ అవ్వ లాగా.. హౌస్ మేట్స్ అందరితో బాగుంటుంది.

బిగ్ బాస్ లో ఉండాలంటే కంటెస్టెంట్లతో సర్దుబాటు చేసుకోవడమే కాకుండా.. ఫిజికల్ టాస్కుల్లో కూడా అందరిని మెప్పించాలి. ఆ పర్ఫామెన్స్ ఆధారంగా ఆడియన్స్ ఓట్లను పొందాలి. అయితే.. గంగవ్వను ఎలిమినేట్ చేస్తే.. తమ ఓటింగ్ కే దెబ్బపడుతుందనే బాధతో ఏ కంటెస్టెంట్ కూడా ఆమెను ఎలిమినేట్ చేయడం లేదు. ఇలానే గంగవ్వను కంటిన్యూ చేస్తే.. ఇతర కంటెస్టెంట్ల ఆట తీరు కూడా మారుతుందనీ, ఆడియన్స్ ల్లో కూడా ఆమెని ఎందుకు తీసువచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమయేలా ఉన్నాయి. షోపై నెగిటివిటీ రాకముందుకే బిగ్ బాస్ టీం సంచలన నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న గంగవ్వని మిడ్ వీక్ ఎలిమినేషన్ గా బయటకు పంపించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లేదా గంగవ్వలో మాట్లాడి సెల్ఫ్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం. ఇలా చేస్తేనే ఇతర కంటెస్టెంట్ల ఆట తీరు మారుతుందని భావిస్తున్నారట.
మరి గంగవ్వను సెల్ఫ్ ఎలిమినేట్ చేశారా? లేదా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారనే హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ మామ ఎలాంటి ట్విస్టులిస్తాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











