Bigg Boss 8 Elimination: బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్.. గంగవ్వతోపాటు వైల్డ్ కార్డు కంటెస్టెంట్ అవుట్
బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో 10వ వారంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వారంలో నామినేషన్లలో అందరూ టాప్ కంటెస్టెంట్లు ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వారం కూడా అందరూ ఊహించినట్టుగానే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇంటిలోకి వచ్చిన టాప్ కంటెస్టెంట్ ఇంటి నుంచి బయటకు వెళ్లిందనే విషయం ఖరారైంది. ఈ వారం నామినేషన్స్, ఎలిమినేషన్ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో రకరకాల ట్విస్టులతో సాగుతున్న క్రమంలో వైల్డ్ కార్డు ఎంట్రీలు భారీ ట్విస్ట్‌ను ఇచ్చాయి. బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ 2.0 వేడుక ద్వారా ఇంట్లోకి టేస్టీ తేజ, గౌతమ్, హరితేజ, నయని పావని, గంగవ్వ, ముక్కు అవినాష్, రోహిణి, మెహబూబ్ ఇంటిలోకి వచ్చారు. ఆ తర్వాత ఇంటిలో కొంత చలనం, జోష్ కనిపించింది.

అయితే ఇంట్లోకి వచ్చిన వైల్డ్ కార్డు ఎంట్రీలు ఒక్కరొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. మొదట మెహబూబ్, ఆ తర్వాత నయని పావని ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత గంగవ్వ ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
అయితే 10వ వారంలో నామినేషన్‌లో గౌతమ్, నిఖిల్, ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియ, పృథ్వీ, హరితేజ నామినేట్ అయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అర్హత ఉన్నవారంటూ బిగ్‌బాస్ లిస్టును ఖరారు చేశారు. అయితే అందరూ టాప్ కంటెస్టెంట్లు ఉండటంతో ఎవరు వెళ్లిపోతారనే ఉత్కంఠ ఫ్యాన్స్‌లో పెరిగింది.

అయితే 10వ వారంలో వైల్డ్ కార్డు ద్వారా ఇంటిలోకి వచ్చిన హరితేజ ఎలిమినేషన్ ప్రక్రియలో చివరి స్థానంలో నిలిచారు. యష్వీకి తక్కువ ఓటింగ్ వచ్చినప్పటికి.. మిస్డ్ కాల్డ్ ద్వారా ఎలిమినేషన్ నుంచి బయట పడింది. దాంతో హరితేజ మాత్రం ఓటర్ల మనసు గెలుచుకోలేకపోవడం వల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications











