బిగ్‌బాస్‌లోకి ఓటీటీ హీరో.. ఆ విషయం పట్టించుకోను అంటూ!
బిగ్‌బాస్ రియాలిటీ షోలు అన్ని భాషల్లోను మొదలయ్యేందుకు రెడీ అవుతున్నాయి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న ఈ షోలో సెలబ్రీటలు ఎవరెవరు వస్తున్నారనే విషయంపై నెటిజన్లు, ఆడియెన్స్, బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇక తాజాగా ఓ యువ హీరో బిగ్‌బాస్ షోలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
అన్ని భాషల్లో కంటే బిగ్‌బాస్ షో హిందీలోనే ఎక్కువ ఆదరణ పొంతం చేసుకొన్నది. ఈ షో ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకొని.. 18వ సీజన్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. దాదాపు ఒకట్రెండు సీజన్లకు తప్పితే.. అన్ని సీజన్లకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరించారు.

ఇక బిగ్‌బాస్ హిందీ 18 షోలోకి టాప్ సోషల్ మీడియా సెలబ్రిటీలు, అలాగే బాలీవుడ్‌కు చెందిన యువ హీరోలు, హాట్ హీరోయిన్లు వస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై భారీ విజయం అందుకొన్న హిరామండీలో నటించిన యువ హీరో జాసన్ షా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.
అయితే తాను బిగ్‌బాస్ రియాలిటీ షోలోకి వెళ్తున్న వార్తలను ఆయన ఖండించారు. అయితే తాను పాపులర్ షోలోకి వెళ్లడం లేదు. వార్తలన్నీ రూమర్లే. నాకు పార్టిసిపేట్ చేయడం ఇష్టమే కాని.. ఇప్పుడు సినిమా షూటింగులతో బిజీగా ఉన్నాను అని ఆయన అన్నారు. ఇలాంటి వార్తలు నా వద్దకు వచ్చాయి. కానీ నేను పట్టించులేదు అని అన్నారు.

యువ హీరో జాసన్ షా హీరామండిలో కీలక పాత్రను పోషించాడు. ఆయన చేసిన రోల్‌కు మంచి స్పందన వచ్చింది. దాంతో ఆయన పేరు బిగ్‌బాస్ జోడించి ఊహగానాలతో రూమర్లు క్రియేట్ చేశారు. తనపై వస్తున్న వార్తలపై స్పందించి.. అలాంటిదేమీ లేదు అని క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు బ్రేక్ పడింది.
ఇక జాసన్ షా కెరీర్ విషయానికి వస్తే.. హీరామండి సిరీస్ తర్వాత ప్రస్తుతం మూడు, నాలుగు సినిమాలతో బిజీగా మారిపోయారు. అలియాభట్‌తో కలిసి జిగ్రా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ మాసంలో రిలీజ్ అవుతుంది. ఇంకా రెండు దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలిపాడు.


Click it and Unblock the Notifications











