జబర్దస్త్ టీమ్‌లో కరోనా కలకలం.. హైపర్ ఆదికి కొవిడ్ పాజిటివ్?

తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్‌ను కరోనావైరస్ వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే జబర్దస్త్‌కు సంబంధించిన సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్‌కు కరోనావైరస్ పాజిటివ్ అనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నది. కొద్దిరోజుల క్రితం స్టార్ కమెడియన్ హైపర్ ఆది కూడా కరోనా బారిన పడ్డారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో జబర్దస్థ్ టీమ్ అనధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం...

సుడిగాలి సుధీర్‌ కంటే ముందే

సుడిగాలి సుధీర్‌ కంటే ముందే

సుడిగాలి సుధీర్‌‌కు కరోనావైరస్ సోకడానికి ముందే హైపర్ ఆది కూడా కోవిడ్ బారిన పడ్డారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైపర్ ఆది ప్రస్తుతం కోలుకున్నట్టు సమాచారం. అయితే అధికారిక ఎవరూ ధృవీకరించకపోవడం వల్ల హైపర్ ఆది ఆరోగ్యం విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జబర్దస్త్ టీమ్‌లో పలువురికి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంతో కామెడీ షోకు సంబంధించిన షూట్‌ను వాయిదా వేసినట్టు ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు చెందిన వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది.

టెలివిజన్ సెలబ్రిటీలను వెంటాడుతున్న

టెలివిజన్ సెలబ్రిటీలను వెంటాడుతున్న

కరోనా భయాలు వెంటాడుతున్న సమయంలో జబర్దస్త్ టీమ్‌తోపాటు పలు టెలివిజన్ ఛానెల్స్‌లో పనిచేసే నటీనటులు సాంకేతిక నిపుణులు కరోనాటెస్టులు చేయించుకొంటున్నారని, పలువురికి కరోనా నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకొన్నారని సమాచారం.

జూన్ తర్వాత పలువురు సెలబ్రిటీలుకు కోవిడ్

జూన్ తర్వాత పలువురు సెలబ్రిటీలుకు కోవిడ్

తెలుగు సినీ, టెలివిజన్ రంగంలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకొన్నారు. జూన్ నుంచి సీరియల్స్, ఇతర కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాత కోవిడ్19 పాజిటివ్‌కు గురైన వారిలో నవ్యస్వామి, రవికృష్ణ, సింగర్ స్మిత, మాలవిక, సాక్షి శివ తదితరులు ఉన్నారు. తాజాగా రాజశేఖర్ కుటుంబం కూడా కోవిడ్ పాజిటివ్‌కు గురైన సంగతి తెలిసిందే.

సినీ, టీవీ పరిశ్రమలో కరోనా విజృంభణ

సినీ, టీవీ పరిశ్రమలో కరోనా విజృంభణ

అయితే కరోనా తగ్గుముఖం పట్టిందని, పరిస్థితులు మామూలుగా మారాయని అనుకొనే సమయంలో స్టార్ కమెడియన్లు, సాంకేతిక నిపుణులు కరోనాకు గురికావడం ఆందోళనకు గురిచేస్తున్నది. సుధీర్, రష్మీ, హైపర్ ఆది లాంటి వాళ్లు కరోనా బారిన పడ్డారనే వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో వారు తమ ఆరోగ్యంపై వివరణ ఇస్తే ఊరట కలిగే అవకాశం ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X