Jabardasth హీరోగా మారుతున్న జబర్దస్త్ అవినాష్.. ఏ మూవీ కోసమంటే?

ముక్కు అవినాష్ లేదా జబర్దస్త్ అవినాష్ అంటే తెలుగు వినోద రంగంలో తెలియని వారండరు అంటే అతిశయోక్తి ఉంటుదేమో.. కానీ కామెడీని ఆస్వాదించే బుల్లితెర ప్రేక్షకులకు మాత్రం అవినాష్ సుపరిచితులు. ఆయన జబర్దస్త్‌ ఖతర్నాక్ కామెడీ షోలో ఆయన పడించిన హాస్యం అందర్నీ ఆకట్టుకొన్నది. బుల్లితెర మీద నటుడిగా, కమెడియన్‌గా, హోస్ట్‌గా ఆయన తనదైన శైలిలో రాణిస్తున్నారు. అయితే తాజాగా కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకొన్న ఆయన ప్రస్తుతం హీరోగా మారబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఇప్పటి వరకు ఆలీ, బ్రహ్మనందం, సునీల్ వాళ్లు వెండితెర మీద మెప్పించి హీరోగా మారారు. హీరోగా కూడా వారు తమదైన శైలిలో మెప్పించారు. వారి దారిలోనే జబర్దస్త్ అవినాష్ హీరోగా మారుతున్నారు. అయితే ఇటీవల తాను నటించిన మార్కెట్ మహాలక్ష్మీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాన్ని తెలుగు ఫిల్మీబీట్‌కు వెల్లడించారు.

Is Jabardasth Avinash turning as Hero from Comedian in Telugu Film Industry

నేను హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. అది నిజమే. కానీ నేను హీరోగా అని చెప్పుకొనే కంటే.. ఆ మూవీలో లీడ్ రోల్ చేస్తున్నాను. ఆ సినిమాలో కథనే హీరోనే. నేను మాత్రం లీడ్ అనే చెప్పుకొంటాను. నేను ఎప్పటికీ నటుడిగా ఉండాలనే కోరుకొంటాను. నా జీవితాంతం నటుడిగానే గుర్తింపు పొందాలనే ఆశిస్తాను అని అవినాష్ వెల్లడించారు.

నన్ను హీరోగా అని పిలిస్తే నేను భరించలేను. నాకే దానిని ఒప్పుకోవాలంటేనే భయంగా ఉంది. హీరో అనే ట్యాగ్ నాకు సూటబుల్ కాదు. కాబట్టి నేను ఆ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నానని చెప్పగలను. నేను నటుడుగానే గుర్తింపు పొందాలని కోరుకొంటాను. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ష్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఆ సినిమా వివరాలు వెల్లడిస్తాను అని అవినాష్ చెప్పారు.

Is Jabardasth Avinash turning as Hero from Comedian in Telugu Film Industry

ఇక మార్కెట్ మహాలక్ష్మీ సినిమా విషయానికి వస్తే.. కేరింత మూవీ ఫేమ్ హీరో పార్వతీశం, నూతన నటి ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్నారు. వీయస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూసర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X