Bigg Boss Telugu 8 ఆ నరకమే బెటర్ బిగ్ బాస్ తెలుగు 8 ఎంట్రీపై పంచ్ ప్రసాద్ షాకింగ్ కామెంట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 త్వరలోనే బుల్లితెర పైకి రాబోతుందన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కంటెస్టెంట్స్ గురించి రోజుకో వార్త చెక్కర్లు కొడుతోంది. అందులో జబర్దస్త్ తో పాపులర్ అయిన కొంతమంది కమెడియన్లు కూడా పాల్గొనబోతున్నారని టాక్ నడుస్తోంది. బిగ్ బాస్ 8 ఎంట్రీపై తాజాగా పంచ్ ప్రసాద్ స్పందించారు. మరి బిగ్ బాస్ పై ఆయన ఇంట్రెస్టింగ్ రియాక్షన్ ఏంటి అనే విషయంపై ఒక లుక్కేద్దాం.
బిగ్ బాస్ సీజన్ 7కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో రికార్డు స్థాయిలో టిఆర్పి రేటింగ్ ను సాధించగా, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగుకు రంగం సిద్ధం అవుతుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ కు సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ మొదలైందని, నిర్వాహకులు పలువురు ప్రముఖులను హౌజ్ మేట్స్ గా తీసుకురావడానికి సంప్రదింపులు మొదలు పెట్టారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ సీజన్ 8లో ఆఫర్ వస్తే మీరు వెళ్తారా? అనే ప్రశ్న ఎదురైంది పంచ్ ప్రసాద్ కు. ఆ ప్రశ్నకు స్పందించిన పంచ్ ప్రసాద్ తాను బిగ్ బాస్ కు వెళ్లాలని అనుకుంటున్నానని చెప్పారు. ఇప్పటికే ఇంట్లో ఇంకో బిగ్ బాస్ లో ఉన్నట్టే అనిపిస్తోందని, ఇంట్లో భార్యా పిల్లలతో పడే టార్చర్ కంటే బిగ్ బాస్ హౌస్ బెటర్ అనిపిస్తుందని ఫన్నీ కామెంట్స్ చేశారు.
తన కొడుకు ఘన్ శ్యామ్ ను ఒక్కడిని హ్యాండిల్ చేస్తే చాలు పది మందిని హ్యాండిల్ చేసిన ఫీలింగ్ వస్తుందని, ఇక తన భార్యను ఒక్కదాన్ని హ్యాండిల్ చేస్తే 16 నుంచి 20 మందిని హ్యాండిల్ చేసినట్టేనని చెప్పి నవ్వించారు. ఇక ఇదంతా జోక్ మాత్రమేనని నిజంగా తన భార్య బిగ్ బాస్ హౌస్ కు వెళ్ళమంటే వెళ్తానని క్లారిటీ ఇచ్చారు పంచ్ ప్రసాద్.

అయితే మీ భార్య వద్దంటే ఆగిపోతారా? అనే ప్రశ్నకు అయినా వెళ్తాను అని ఫన్నీ రిప్లై ఇచ్చారు పంచ్ ప్రసాద్. మొత్తానికి తనకు బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ ఇచ్చే ఆసక్తి ఉందంటూ మనసులోని మాటను బయట పెట్టాడు. మరి బిగ్ బాస్ మేకర్స్ కు ఆయనను హౌస్ లో చూపించే ఆలోచన ఉందో లేదో తెలియాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే పలువురు బుల్లితెర సెలెబ్రిటీలు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అడుగు పెట్టబోతున్నారు అంటూ పేర్లతో సహా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఇక పంచ్ ప్రసాద్ పలు బుల్లితెర షోలతో, ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యారు. రీసెంట్ గా అనారోగ్యం బారిన పడిన ఆయన ప్రస్తుతం కోలుకొని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ తనకు అవకాశాలు ఇవ్వమని కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











