Anasuya Bharadwaj అనసూయ ఇంట్లో అలాంటి పూజలు.. రంగమ్మత్త కోసం ఆ జ్యోతిష్కుడి పనేనా?
జబర్దస్త్ భామగా పాపులర్ అయిన అనసూయ నిత్యం ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూనే కెరీర్ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ విశేషాలు పంచుకుంటూ ఉండటం అనసూయ నైజం. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అనసూయ స్పీడు:మొదట స్మాల్ స్క్రీన్‌పై తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనసూయ.. ఆ తర్వాత వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంది. జబర్దస్త్ వేదికగా బుల్లితెర ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడమే గాక, తన గ్లామర్ తో అందరినీ ఆకర్షించింది. రీసెంట్ గానే జబర్దస్త్‌కి బై బై చెప్పి ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్‌పై సత్తా చాటుతోంది.

రంగమ్మత్త ప్లానే వేరు:రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి ప్రేక్షకుల మదిలో చెరిగిపోని స్థానాన్ని సంపాదించిన అనసూయ.. ఆ తర్వాత పుష్ప సినిమాలో దాక్షాయణి రోల్ పోషించి తనదైన స్టైల్ లో ఆకట్టుకుంది. సుకుమార్ డిజైన్ చేసిన ఈ రెండు క్యారెక్టర్స్ ఆమె సిల్వర్ స్క్రీన్ జర్నీకి పూల బాటలు వేశాయి. ఇప్పుడు అదే జోష్ లో పుష్ప- 2లో నటిస్తోంది అనసూయ భరద్వాజ్.
పుష్ప- 2లో అనసూయ రోల్:స్కోప్ ఉన్న పాత్రలు ఎంచుకుంటూనే ఫిమేల్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ మరింత ఫాలోయింగ్ పెంచుకుంటోంది అనసూయ. రీసెంట్ గా విమానం, పెదకాపు-1 సినిమాల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకుంది. ఈ సారి పుష్ప- 2లో అనసూయ రోల్ ఓ రేంజ్ లో ఉండనుందట. అనసూయకు సినిమా కెరీర్ కి ఈ మూవీ టర్నింగ్ పాయింట్ అయ్యేలా సుకుమార్ పర్ఫెక్ట్ ప్లాన్ చేశారట.
అనసూయ పూజలు:ఇక వెండితెరపై తన మార్క్ చూస్పిస్తునే సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది అనసూయ. కుర్రకారుకు మైకం తెప్పించే ఫోటో షూట్స్ షేర్ చేస్తూ హవా నడిపిస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా ఫ్యామిలీతో కలిసి తన ఇంట్లోనే ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ పూజలు ఎందుకోసమో చెప్పలేదు గానీ కుటుంబంతో కలిసి సాంప్రదాయబద్దంగా కనిపించింది. ఈ ఫొటోస్ చూసి ఇక అనసూయ దశ తిరిగినట్లే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ఆ జ్యోతిష్కుడి పనేనా? అంటూఅయితే అనసూయ పూజల వెనుక కారణమేంటి? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వేణుస్వామి సలహాలు, సూచనలతోనే ఈ పూజలు చేశారా అని అడుగుతున్నారు. ఏది ఏమైనా రంగమ్మత్త ఫ్యామిలీ, కెరీర్ బాగుండాలని అభిమానులు, నెటిజన్లు కోరుకొంటున్నారు. తాజా పూజలతో రంగమ్మత్త కెరీర్‌లో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా? వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











