బిగ్‌బాస్ నుంచి జాఫర్ అవుట్.. ఆ నలుగురు సేఫ్.. చిలుక, చిలుక అంటూ ఇస్మార్ట్ శంకర్ రచ్చ
బిగ్‌బాస్ షోలో రెండోవారం తర్వాత ఇంటి నుంచి రెండో సెలబ్రిటీ బయటకు వెళ్లిపోయాడు. ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఇస్మార్ట్ శంకర్ హీరో, హీరోయిన్లు రచ్చ చేశారు. హోస్ట్ నాగ్ కూడా అదే జోష్‌తో ఇంటి సభ్యులను హోరెత్తించారు. దాంతో ఆదివారం ఎపిసోడ్ భావోద్వేగాల మధ్య కొనసాగినట్టు స్పష్టం అవుతున్నది. ఇంతకీ రెండోవారం తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిందెవరంటే..

బిగ్‌బాస్ హౌస్‌లోకి ఇస్మార్ట్ శంకర్
మూడోవారం తర్వాత కూడా ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చిన హీరో రామ్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. వంద కోట్ల క్లబ్‌లో సినిమాను చేర్చేందుకు క్రేజీగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే హీరో రామ్, హీరోయిన్ నిధి అగర్వాల్‌తో కలిసి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు.
చిలుక చిలుక పాటతో రచ్చ
ఇస్మార్ట్ శంకర్‌లోని చిలుక చిలుక పాటతో హీరో రామ్, నిధి, హోస్ట్ నాగార్జున రచ్చ చేశారు. వేదికపైన నాగ్‌తో కలిసి హీరో, హీరోయిన్లు డ్యాన్స్ చేయగా.. ఇంటిలోని సభ్యులు పాటకు స్టెప్పులేసి మరింత క్రేజీగా సందడి చేశారు. ఇప్పటి వరకు గొడవలతో హెరెత్తిన బిగ్‌బాస్ హౌస్ మాస్ ఎలిమెంట్స్‌తో ఉర్రూతలూగించారు. దాంతో తాజా ఎపిసోడ్ మరింత వినోదాత్మకంగా ఉండే అవకాశం ఉంది.

జాఫర్ ఎలిమినేట్ అయ్యారా?
ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి జాఫర్ ఎలిమినేట్ అయ్యారనే విషయం అనధికారికంగా వెలుగు చూసింది. ఎలాంటి పెర్ఫార్మెన్స్ లేకుండా ఇంటిలో సాదాసీదాగా ఉన్న న్యూస్ ప్రజెంటర్ జాఫర్ ఎలిమినేషన్ ఎదుర్కొన్నట్టు సమాచారం. ఎలిమినేషన్ తర్వాత జాఫర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ ఫోటోను నిర్మాత, జర్నలిస్టు సురేష్ కొండేటి ట్వీట్ చేశారు. దాంతో ఆయన ఎలిమినేట్ అయ్యారనే వార్తలకు కొంత బలం చేకూరింది. అయితే డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా అనేది కొద్ది గంటల్లోనే తెలియనున్నది.

ఎనిమిది మందిపై ఎలిమినేషన్ కత్తి
రెండో ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వారి సంఖ్య భారీగానే ఉంది. వరుణ్, వితిక, జాఫర్, హిమజ, రాహుల్, మహేష్, శ్రీముఖి, పునర్నవి మెడపై ఎలిమినేషన్ కత్తి వేలాడింది. దాంతో ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతారనే అంశం మరింత ఆసక్తిగా మారింది. అయితే ఈ సారి ఒకరు కాదు.. ఇద్దరు బయటకు వెళ్తున్నారనే విషయం ఆసక్తిగా మారింది. అయితే ఇప్పటి వరకు శ్రీముఖి, రాహుల్, హిమజ, మహేష్ సేఫ్ అని హోస్ట్ నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











